తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్స్! | Commuter Bikes Under 1 Lakh in 2026 | Sakshi
Sakshi News home page

తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్స్!

Jun 29 2026 9:06 PM | Updated on Jun 29 2026 9:10 PM

Commuter Bikes Under 1 Lakh in 2026

భారతదేశంలో ద్విచక్ర వాహన మార్కెట్ ఎప్పుడూ బడ్జెట్ వినియోగదారుల చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఎక్కువ మంది కొనుగోలుదారులు తక్కువ ధరలో మంచి మైలేజ్, నమ్మకమైన పనితీరు, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు ఉన్న బైకులను కోరుకుంటారు. ఈ కారణంగానే కమ్యూటర్ బైక్స్ చాలాకాలంగా మంచి ఆదరణ పొందుతున్నాయి. ఈ కథనంలో రూ.1 లక్ష కంటే తక్కువ ధరలో లభించే బైకుల గురించి తెలుసుకుందాం.

టీవీఎస్ స్పోర్ట్ (రూ.55,500 - రూ.57,500)
టీవీఎస్ స్పోర్ట్ అనేది బడ్జెట్ సెగ్మెంట్‌లో అత్యంత తక్కువ ధరలో లభించే కమ్యూటర్ బైక్‌లలో ఒకటి. ఇది ముఖ్యంగా రోజువారీ ఆఫీస్ వెళ్లేవాళ్లు, ఎక్కువ దూరం ప్రయాణించే వినియోగదారుల కోసం రూపొందించారు. ఇది 109.7cc ఇంజిన్‌తో 8.1 హార్స్ పవర్ అందిస్తుంది. పెద్దగా స్పోర్టీ ఫీచర్లు లేకపోయినా, దీని అసలు బలం మైలేజ్, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులోనే ఉంటుంది. సిటీ ట్రాఫిక్‌లో సులభంగా నడపగలిగేలా ఇది చాలా లైట్‌గా ఉంటుంది.

హీరో హెచ్ఎఫ్ డీలక్స్ (రూ.58,977 - రూ.71,470)
హీరో హెచ్ఎఫ్ డీలక్స్ భారతదేశంలో అత్యంత పాపులర్ కమ్యూటర్ బైక్‌లలో ఒకటి. దీని సింపుల్ డిజైన్, నమ్మకమైన పనితీరు దీన్ని చాలా మంది మొదటి ఎంపికగా మార్చాయి. ఇందులోని 97.2cc ఇంజిన్‌ 7.9 హార్స్ పవర్ అందిస్తుంది. మంచి మైలేజ్ అందించే ఈ బైక్ మెయింటెనెన్స్ ఖర్చు కూడా తక్కువే. ఇందులో ఎల్ఈడీ హెడ్‌లైట్, స్టార్ట్/స్టాప్ టెక్నాలజీ కూడా ఉన్నాయి.

బజాజ్ ప్లాటినా 100 (రూ.65,407)
బజాజ్ ప్లాటినా 100 అనేది కంఫర్ట్ రైడింగ్ కోసం రూపొందించిన సింపుల్ కమ్యూటర్ బైక్. దీని 99.59cc ఇంజిన్ సుమారు 7.9hp పవర్ అందిస్తుంది. ఈ బైక్‌ సాఫ్ట్ సస్పెన్షన్, మంచి గ్రౌండ్ క్లియరెన్స్ పొందుతుంది. రోడ్లు కొంత కఠినంగా ఉన్నప్పటికీ ఇది సౌకర్యవంతంగా ప్రయాణించడానికి సహాయపడుతుంది.

బజాజ్ ప్లాటినా 110 (రూ.69,284)
బజాజ్ ప్లాటినా 110 అనేది ప్లాటినా 100 కంటే కొంచెం అప్‌గ్రేడ్ వెర్షన్. ఇందులో 115.45cc ఇంజిన్ ఉంటుంది, ఇది 8.6hp పవర్ అందిస్తుంది. ఇందులో 5-స్పీడ్ గేర్‌బాక్స్ ఉండటం వల్ల హైవే రైడింగ్ కూడా కొంచెం స్మూత్‌గా ఉంటుంది. సస్పెన్షన్ కూడా మెరుగ్గా ఉండటం వల్ల ఎక్కువ దూరం ప్రయాణానికి ఇది అనుకూలంగా ఉంటుంది.

బజాజ్ పల్సర్ 125 (రూ.79,048 - రూ.87,527)
పల్సర్ 125 ఈ జాబితాలో స్పోర్టీ లుక్ కలిగిన బైక్. ఇది 124.4cc ఇంజిన్‌తో 11.8hp పవర్ అందిస్తుంది. ఇది కేవలం కమ్యూటర్ బైక్ మాత్రమే కాదు, కొంచెం స్టైల్ అండ్ రోడ్ ప్రెజెన్స్ కూడా ఇస్తుంది. డిజైన్ కూడా పెద్ద పల్సర్ 150 మాదిరిగా ఉంటుంది. యువతకు బాగా నచ్చిన బైకుల్లో ఇది ఒకటి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement