90 దేశాలు.. 70 లక్షల మంది మెచ్చిన బైక్! | TVS Apache Range Crosses 70 Lakh Customers Globally | Sakshi
Sakshi News home page

90 దేశాలు.. 70 లక్షల మంది మెచ్చిన బైక్!

Jul 7 2026 9:40 PM | Updated on Jul 7 2026 9:42 PM

TVS Apache Range Crosses 70 Lakh Customers Globally

2005లో లాంచ్ అయిన టీవీఎస్ అపాచీ అమ్మకాల్లో అరుదైన మైలురాయిని చేరుకుంది. ఈ బైకుకు ప్రపంచ వ్యాప్తంగా 70 లక్షల కస్టమర్లు ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది.

ప్రస్తుతం అపాచీ సిరీస్‌లో ఆర్‌టీఆర్‌ 160, ఆర్‌టీఆర్‌ 160 4వీ, ఆర్‌టీఆర్‌ 180, ఆర్‌టీఆర్‌ 200 4వీ, ఆర్‌టీఆర్‌ 310, ఆర్ఆర్ 310తో పాటు ఇటీవల విడుదలైన ఆర్‌టీఎక్స్ అడ్వెంచర్ టూరర్ వంటి మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. 160 సీసీ నుంచి 310 సీసీ వరకు వివిధ ఇంజిన్ సామర్థ్యాలతో ఈ బైకులు అమ్ముడవుతున్నాయి. కాగా ప్రస్తుతం అపాచీ బైకులు ప్రపంచంలోని 90కి పైగా దేశాల్లో అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి.

అపాచీ ఆకట్టుకునే డిజైన్ కలిగి ఉంటుంది. ఈ ఫ్యూయల్ ఇంజెక్షన్, డ్యూయల్ ఛానల్ ఏబీఎస్, రైడింగ్ మోడ్స్, టీవీఎస్ SmartXonnect కనెక్టివిటీ, ట్రాక్షన్ కంట్రోల్, కీ లెస్ రైడ్ వంటి ఆధునిక ఫీచర్లతో వస్తుంది. ఇంజిన్ కూడా మంచి పనితీరును అందిస్తుంది. ఈ కారణంగానే ఎక్కువమంది ఈ బైక్ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement