దక్షిణాది చిత్రసీమలో ప్రముఖ కథానాయికగా గుర్తింపు పొందిన నటి సమంత కొత్త బాధ్యతలను స్వీకరించారు. ప్రముఖ రియల్ ఎస్టేట్ నిర్మాణ సంస్థ ‘ఎంపీ డెవలపర్స్’(MP Developers) తమ అధికారిక బ్రాండ్ అంబాసిడర్‌గా సమంతను నియమించినట్లు ప్రకటించింది.
ఈ భాగస్వామ్యానికి ఒక ప్రత్యేకమైన, భావోద్వేగ అనుబంధం ఉందని కంపెనీ చెప్పింది. ఎంపీ డెవలపర్స్ సంస్థ ప్రస్థానం, నటి సమంత కెరీర్.. రెండూ చెన్నైలోని పల్లవరం ప్రాంతం నుంచే ప్రారంభం కావడం విశేషం. చెన్నై మూలాల నుంచి ప్రపంచ స్థాయి గుర్తింపు సాధించే దిశగా సాగుతున్న తమ ప్రయాణానికి సమంత చేరిక కొత్త ఉత్తేజాన్ని ఇస్తుందని కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు.
14 ఏళ్ల విశ్వసనీయత.. 250కి పైగా ప్రాజెక్టులు
కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. 2012లో స్థాపించిన ఎంపీ డెవలపర్స్ గత 14 ఏళ్ల కాలంలో రియల్ ఎస్టేట్ రంగంలో విశేష పురోగతిని సాధించింది. ఇప్పటివరకు 250కి పైగా నివాస ప్రాజెక్టులను పూర్తి చేసింది. 3,000 కంటే ఎక్కువ కుటుంబాల నమ్మకాన్ని గెలుచుకుంది. చెన్నై, కోయంబత్తూర్ నగరాల్లో ప్రస్తుతం 1.5 మిలియన్ చదరపు అడుగుల (15 లక్షల చ.అ) కంటే ఎక్కువ విస్తీర్ణంలో వివిధ ప్రాజెక్టుల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి.
ఈ సందర్భంగా ఎంపీ డెవలపర్స్ యాజమాన్యం స్పందిస్తూ.. ‘ఇల్లు అనేది కేవలం నాలుగు గోడల భవనం మాత్రమే కాదు; అది ఒక కుటుంబం భవిష్యత్తు కలలకు పునాది. అత్యుత్తమ లొకేషన్, సమర్థవంతమైన డిజైన్, నిర్మాణ నాణ్యత, కస్టమర్ల సుదీర్ఘకాల ప్రయోజనాలే లక్ష్యంగా మేము పనిచేస్తున్నాం’ అని తెలిపింది.
గ్రోత్ గ్యారెంటీ హోమ్స్
సొంతింటి కలను నెరవేర్చుకోవడంతోపాటు ఇల్లు కొనడాన్ని భవిష్యత్తుకు బలమైన పెట్టుబడిగా మార్చే దిశగా ఎంపీ డెవలపర్స్ ‘గ్రోత్ గ్యారెంటీ హోమ్స్’ అనే వినూత్న భావనను అందుబాటులోకి తెచ్చింది.

ఈ ప్రాజెక్టుల ప్రధాన ముఖ్యాంశాలు
అధిక అభివృద్ధి అవకాశాలు ఉన్న ప్రాంతాలను ఎంపిక చేయడి.
మెరుగైన రవాణా / కనెక్టివిటీ సౌకర్యాలు కల్పించడం.
ఆచరణాత్మకమైన, స్థలాన్ని సమర్థవంతంగా వినియోగించే గృహాలను రూపొందించడం.
విస్తరణ దిశగా అడుగులు
ఈ సందర్భంగా ఎంపీ డెవలపర్స్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రవీణ్ మలినేని మాట్లాడుతూ.. ‘మా 14 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఈ రోజు ఒక కీలకమైన కొత్త అధ్యాయం ప్రారంభమైంది. 250కి పైగా ప్రాజెక్టులు పూర్తి చేసి 3,000 కుటుంబాల విశ్వాసాన్ని పొందడం మా బాధ్యతను మరింత పెంచింది. సమంతతో ఈ కొత్త భాగస్వామ్యం మా బ్రాండ్ గుర్తింపును మరింత బలోపేతం చేస్తుంది. ఇది ‘గ్రోత్ గ్యారెంటీ హోమ్స్’ సందేశాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తుంది. తమిళనాడులోని ద్వితీయ శ్రేణి నగరాలతో పాటు ఎన్‌ఆర్‌ఐ వినియోగదారులను ఆకట్టుకునేలా అంతర్జాతీయ స్థాయిలో విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేశాం’ అన్నారు. ‘Built for Living. Guaranteed for Growth’ అనే స్పష్టమైన విధానంతో నాణ్యమైన ఇళ్లను అందిస్తున్నట్లు చెప్పారు. ప్రతి కుటుంబం భవిష్యత్తు పురోగతికి విలువ జోడించడమే లక్ష్యంగా ఎంపీ డెవలపర్స్ తన తదుపరి ప్రయాణాన్ని వేగవంతం చేస్తోందన్నారు.
ఇదీ చదవండి: ఒక్కరోజులో మారిన బంగారం ధరలు..


