ఆడా ఉంటా.. ఈడా ఉంటా! | Actress Pooja Hegde talks about Indian Actress | Sakshi
Sakshi News home page

ఆడా ఉంటా.. ఈడా ఉంటా!

Dec 18 2020 12:23 AM | Updated on Dec 18 2020 4:57 AM

Actress Pooja Hegde talks about Indian Actress - Sakshi

‘‘కళను, కళాకారులను ఒక భాషకి, ఒక ప్రాంతానికి పరిమితం చేయకూడదు అంటారు. నిజమే.. కళాకారులకు ఎల్లలు ఉండవు. ఆర్టిస్ట్‌గా నేను ఏ ఒక్క ప్రాంతానికో, భాషకో పరిమితం కావాలనుకోవడంలేదు’’ అంటున్నారు పూజా హెగ్డే. ప్రస్తుతం తెలుగు, హిందీ సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారామె. తెలుగులో ప్రభాస్‌తో ‘రాధే శ్యామ్‌ (ఈ చిత్రాన్ని హిందీలోనూ తెరకెక్కిస్తున్నారు) అఖిల్‌తో ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’, హిందీలో సల్మాన్‌ ఖాన్‌ తో ‘కభీ ఈద్‌ కభీ దీవాలి’, రణ్‌వీర్‌ సింగ్‌తో ‘సర్కస్‌’ చేస్తున్నారు. ఇలా రెండు భాషల్లో బిజీబిజీగా ఉండటం గురించి పూజా మాట్లాడుతూ – ‘‘తెలుగు ప్రేక్షకులు నా మీద చాలా ప్రేమను చూపిస్తున్నారు. ఇప్పటివరకూ చేసిన సినిమాల ద్వారా నన్ను ఎంతగానో ఆదరించారు.

చిన్నప్పటి నుంచి హిందీ సినిమాలు చూస్తూ పెరిగాను. ఇప్పుడు వరుసగా హిందీ సినిమాల్లో నటిస్తున్నా. ఒకేసారి రకారకాల భాషల సినిమాల్లో, వివిధ ప్రాంతాల్లో షూట్‌ చేయడం మంచి అనుభవం. సినిమా ఇండస్ట్రీ అనేది ఒకటే. నేను ఏదో ఒక భాషకు చెందిన నటిగా కంటే ఇండియన్‌ యాక్టర్‌ అనిపించుకోవాలనుకుంటున్నాను. అదే నాకిష్టం’’ అన్నారు. ప్రస్తుతం చేస్తున్న తెలుగు సినిమాల షెడ్యూల్స్‌ గురించి చెబుతూ – ‘‘ఈ 25 వరకూ ‘రాధేశ్యామ్‌’ షూట్‌లో పాల్గొని, ఆ తర్వాత ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’ షూట్‌లో జాయిన్‌ అవుతా. జనవరి నుంచి మళ్లీ ‘రాధే శ్యామ్‌’ సెట్‌లో ఉంటా’’ అన్నారు పూజా. సో.. పూజా ఆడా ఉంటా.. ఈడా.. ఉంటా అంటున్నారన్న మాట. మంచిదేగా!

Advertisement
 
Advertisement
Advertisement