breaking news
busy busy
-
ఎంతో చేయాలి.. సమయమే లేదు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే జో బైడెన్ పూర్తి స్థాయిలో పనిలో నిమగ్నమయ్యారు. డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలను తిరగతోడుతూ పాలనలో తనదైన ముద్ర వేసే దిశగా అడుగులు వేస్తున్నారు. చేయాల్సిందెంతో ఉంది, సమయమే తక్కువ ఉందని వ్యాఖ్యానించిన బైడెన్ తొలిరోజే బిజీ బిజీగా గడిపారు. కరోనా విసిరిన సవాళ్లను ఎదుర్కోవడానికి రేయింబవళ్లు పని చేయాలని అన్నారు. కోవిడ్–19పై పోరాటం నుంచి పారిస్ ఒప్పందంలో తిరిగి చేరేవరకు తొలిరోజే పలు నిర్ణయాలను తీసుకున్నారు. మొత్తం 17 ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా కట్టడికి ప్రజలందరూ మాస్కులు తప్పనిసరిగా ధరించాలన్న కార్యనిర్వాహక ఉత్తర్వుపై అధ్యక్షుడి హోదాలో బైడెన్ విలేకరుల ఎదుటే తొలి సంతకం చేశారు. బైడెన్ ప్రధాన నిర్ణయాలివే.. ► బహిరంగ ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్కు ధరించాలి. 100 రోజుల మాస్కు చాలెంజ్‌ని స్వీకరించాలి. ప్రభుత్వ కార్యాలయాల్లో భౌతికదూరం తప్పనిసరి. ఒబామా హయాంలో ఏర్పాటైన డైరెక్టరేట్ ఫర్ గ్లోబల్ హెల్త్ సెక్యూరిటీ అండ్ బయోడిఫెన్స్ పునరుద్ధరణ. అందరికీ వ్యాక్సిన్ అందేలా చర్యలు, ప్రపంచ ఆరోగ్య సంస్థలో తిరిగి చేరిక. ► 1.1 కోట్ల డాలర్ల రుణాలపై మారటోరియం, విద్యార్థి రుణాల రికవరీ గడువు సెప్టెంబర్ 30 వరకు పొడిగింపు ► ట్రంప్ హయాంలో మెక్సికో సరిహద్దుల్లో గోడ నిర్మాణం నిమిత్తం జాతీయ అత్యవస ర నిధి కింద విరాళాల సేకరణ నిలిపివేత ► పర్యావరణ పరిరక్షణకు పారిస్ ఒప్పందంలో తిరిగి చేరేలా ఉత్తర్వులు జారీ. గత ఏడాది ట్రంప్ ఈ ఒప్పందం నుంచి బయటకు వచ్చారు. బైడెన్ ఆ నిర్ణయాన్ని మారుస్తూ తిరిగి ఒప్పందంలో చేరాలని నిర్ణయించారు. అయితే అధికారికంగా ఈ ప్రక్రియ పూర్తి కావడానికి మరో నెలరోజులు పడుతుంది. కీస్టోన్ పైప్‌లైన్ ప్రాజెక్టు రద్దు చేశారు. ► మానవ హక్కులకు భంగం వాటిల్లకుండా చర్యలు. జాతి వివక్షకు తావు లేకుండా ప్రభుత్వం నిరంతర పర్యవేక్షణ. నిధుల విడుదల అన్ని ప్రాంతాలకు సక్రమంగా జరిగేలా ప్రభుత్వ సంస్థలు సమీక్షిస్తూ ఉండాలి. పని చేసే ప్రాంతాల్లో లింగ వివక్షకు తావు లేకుండా పకడ్బందీ చర్యలు. ఎల్జీబీటీక్యూ హక్కుల పరిరక్షణ ► జనాభా లెక్కల సేకరణ. వీరిలో అమెరికన్లు కాని వారిని కూడా చేర్చాలి. చట్టవిరుద్ధంగా అమెరికాలో ఉంటున్న వారిని జనాభా లెక్కల్లో చేర్చవద్దంటూ ట్రంప్ చేసిన ఆదేశాలు రద్దు చేస్తూ కొత్త ఉత్తర్వులు జారీ. ► లైబీరియా నుంచి వలస వచ్చి కొన్నేళ్లుగా అమెరికాలో స్థిరనివాసం ఉంటున్న వారిని తిరిగి స్వదేశానికి పంపించే కార్యక్రమం వచ్చే ఏడాది జూన్ 30 వరకు వాయిదా ► వివిధ ముస్లిం దేశాల నుంచి ట్రంప్ విధించిన ప్రయాణ ఆంక్షలు ఎత్తివేత. 2017లో ట్రంప్ అధికారంలోకి వచ్చిన వెంటనే సిరియా, ఇరాన్, ఇరాక్, సూడాన్, లిబియా, యెమన్ వంటి దేశాల నుంచి రాకపోకలపై నిషేధం విధించారు. అలా 13 దేశాల నుంచి రాకపోకలపై ఆంక్షలున్నాయి. వాటినన్నింటినీ ఎత్తివేస్తూ బైడెన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ దేశాల నుంచి వీసా దరఖాస్తులు తీసుకోవాలం టూ విదేశాంగ శాఖను ఆదేశించారు. వలస విధానం ప్రక్షాళన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తొలి రోజే వలస విధానాన్ని సమూలంగా సంస్కరిస్తూ రూపొందించిన కొత్త ఇమిగ్రేషన్ బిల్లుని కాంగ్రెస్‌కు పంపించారు. వలసదారులకు పూర్తిగా అండదండలుగా ఉండేలా పౌరసత్వ చట్టం 2021 పేరుతో ఈ బిల్లుని తీసుకువచ్చారు. సరిహద్దుల సక్రమ నిర్వహణ, కుటుం బాలను ఏకం చెయ్యడం, అమెరికా ఆర్థిక వ్యవస్థకి సహకరించే ప్రతీ ఒక్కరి ప్రయో జనాల పరిరక్షణ, శరణార్థులకి అమెరికా అండదండలు ఉంటాయన్న లక్ష్యాలతో ఈ బిల్లుని రూపొందించారు. దీని ప్రకారం చట్టవిరుద్ధంగా దేశంలో తలదాచుకుం టున్న 1.1 కోట్ల మందికి అమెరికా పౌరసత్వం లభిస్తుంది. అమెరికాలో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవాలనుకునే వారు ఇక ఏళ్ల తరబడి వేచి చూడనక్కర్లేదు. ఉద్యోగ ఆధారిత గ్రీన్‌కార్డుల జారీలో దేశాల కోటా పరిమితుల్ని రద్దు చేసే ప్రతిపాదన బిల్లులో ఉంది. దీంతో వేలాదిమంది భారత్ టెక్కీలకు ప్రయోజనం చేకూరనుంది. ఇక ఈ బిల్లులో హెచ్–1బీ వీసాదారుల భాగస్వాములకు పనిచేయడానికి అవకాశం, వారి పిల్లలకు వయసుతో నిమిత్తం లేకుండా ప్రభుత్వం కల్పించే సదుపాయాల్ని పొందే అవకాశం వస్తుంది. గ్రీన్ కార్డు వచ్చిన వారు మూడేళ్లలోనే అమెరికా పౌరసత్వానికి దరఖాస్తు కూడా చేసుకోవచ్చు. ఎంతో ఉదాత్తంగా రాశారు ట్రంప్ లేఖపై బైడెన్ ప్రశంసలు వాషింగ్టన్ : వైట్‌హౌస్ వీడి వెళ్లడానికి ముందు డొనాల్డ్ ట్రంప్ తనకు రాసిన లేఖ చాలా ఉదాత్తంగా, గొప్పగా ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రశంసించారు. ఆ లేఖలో ఏముందో ఆయన వెల్లడించలేదు. కొత్త అధ్యక్షుడిని అభినందించడం సహా అన్ని రకాల సంప్రదాయాలను తోసి రాజని శ్వేత సౌధాన్ని వీడి వెళ్లిన ట్రంప్ లేఖ రాసే ఆనవాయితీ మాత్రం పాటించారు. ఫ్లోరిడాకు వెళ్లే ముందు ఓవల్ ఆఫీసులోని రిజల్యూట్ డెస్క్ దగ్గర లేఖని ఉంచిన విషయం తెలిసిందే. ఐరాస హర్షం ఐక్యరాజ్యసమితి: ప్రపంచ ఆరోగ్య సంస్థలో తిరిగి చేరుతున్నట్టుగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తొలి రోజే ఉత్తర్వులు జారీ చేయడంపై ఐక్యరాజ్య సమితి హర్షం వ్యక్తం చేసింది. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుట్టెరస్కు బైడెన్ లేఖ రాశారు. డబ్ల్యూహెచ్ఒలో మళ్లీ చేరుతామని పేర్కొన్న ఆయన కరోనా కట్టడికి సంస్థ తీసుకుంటున్న చర్యల్ని ప్రశంసించారు. ప్రపంచ దేశాల ప్రజల ఆరోగ్యం కోసం డబ్ల్యూహెచ్ఓ చేస్తున్న కృషిని అభినందించారు. అమెరికా తిరిగి రావడాన్ని స్వాగతించిన గుట్టెరస్ ప్రపంచ దేశాల్ని అల్లకల్లోలం చేస్తున్న కరోనా మహమ్మారిని తరిమి కొట్టడానికి అందరూ సమైక్యంగా పోరాడాల్సిన సమయం ఇదేనని అన్నారు. డబ్ల్యూహెచ్ఓకు అగ్రరాజ్యమే అత్యధికంగా నిధులిస్తుంటుంది. -
ఆడా ఉంటా.. ఈడా ఉంటా!
‘‘కళను, కళాకారులను ఒక భాషకి, ఒక ప్రాంతానికి పరిమితం చేయకూడదు అంటారు. నిజమే.. కళాకారులకు ఎల్లలు ఉండవు. ఆర్టిస్ట్‌గా నేను ఏ ఒక్క ప్రాంతానికో, భాషకో పరిమితం కావాలనుకోవడంలేదు’’ అంటున్నారు పూజా హెగ్డే. ప్రస్తుతం తెలుగు, హిందీ సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారామె. తెలుగులో ప్రభాస్‌తో ‘రాధే శ్యామ్ (ఈ చిత్రాన్ని హిందీలోనూ తెరకెక్కిస్తున్నారు) అఖిల్‌తో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’, హిందీలో సల్మాన్ ఖాన్ తో ‘కభీ ఈద్ కభీ దీవాలి’, రణ్వీర్ సింగ్‌తో ‘సర్కస్’ చేస్తున్నారు. ఇలా రెండు భాషల్లో బిజీబిజీగా ఉండటం గురించి పూజా మాట్లాడుతూ – ‘‘తెలుగు ప్రేక్షకులు నా మీద చాలా ప్రేమను చూపిస్తున్నారు. ఇప్పటివరకూ చేసిన సినిమాల ద్వారా నన్ను ఎంతగానో ఆదరించారు. చిన్నప్పటి నుంచి హిందీ సినిమాలు చూస్తూ పెరిగాను. ఇప్పుడు వరుసగా హిందీ సినిమాల్లో నటిస్తున్నా. ఒకేసారి రకారకాల భాషల సినిమాల్లో, వివిధ ప్రాంతాల్లో షూట్ చేయడం మంచి అనుభవం. సినిమా ఇండస్ట్రీ అనేది ఒకటే. నేను ఏదో ఒక భాషకు చెందిన నటిగా కంటే ఇండియన్ యాక్టర్ అనిపించుకోవాలనుకుంటున్నాను. అదే నాకిష్టం’’ అన్నారు. ప్రస్తుతం చేస్తున్న తెలుగు సినిమాల షెడ్యూల్స్ గురించి చెబుతూ – ‘‘ఈ 25 వరకూ ‘రాధేశ్యామ్’ షూట్లో పాల్గొని, ఆ తర్వాత ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ షూట్లో జాయిన్ అవుతా. జనవరి నుంచి మళ్లీ ‘రాధే శ్యామ్’ సెట్లో ఉంటా’’ అన్నారు పూజా. సో.. పూజా ఆడా ఉంటా.. ఈడా.. ఉంటా అంటున్నారన్న మాట. మంచిదేగా! -
బిజీ బిజీ
అటు ప్రమోషన్స్ ఇటు షూటింగ్స్‌తో బిజీ బిజీగా ఉంటున్నారు రాశీఖన్నా. విజయ్‌సేతుపతి, రాశీ జంటగా ‘స్కెచ్’ ఫేమ్ విజయ్‌చందర్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తొలి షెడ్యూల్ హైదరాబాద్‌లో ముగిసింది. దీంతో విశాల్ ‘అయోగ్య’ (తెలుగు ‘టెంపర్’ తమిళ రీమేక్) సినిమా ప్రమోషన్స్ కోసం చెన్నై వెళ్లారు రాశీ. విజయ్ సేతుపతి సినిమా నెక్ట్స్ షెడ్యూల్ కూడా చెన్నైలో స్టార్ట్ కానుంది. అంటే.. కొన్ని రోజులు రాశీ అక్కడే ఉంటారా? అంటే కాదనే చెప్పాలి. ఎందుకంటే వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా కేఎస్. రవీంద్ర దర్శకత్వంలో ‘వెంకీమామ’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కోసం చెన్నై నుంచి రాశీ సూట్ కేస్ సర్దుకుని వేరే లొకేషన్లోకి వాలిపోవాల్సిందే. ఈ చిత్రంలో నాగచైతన్యకు జోడీగా నటిస్తున్నారు రాశీ. ఇలా గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నారీ బ్యూటీ. -
హస్తినలో గవర్నర్ నరసింహన్ బిజీ బిజీ
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం తొందరపడుతున్న పరిస్థితులలో రాష్ట్ర గవర్నర్ నరసింహన్ హస్తినలో బిజీబిజీగా ఉన్నారు. మూడు రోజులపాటు ఢిల్లీలోనే మకాంవేసిన గవర్నర్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దగ్గర నుంచి ముఖ్య నేతలందరిని కలిశారు. విభజనకు సంబంధించి కీలక అంశాలను ఆయన వారితో చర్చించినట్లు తెలుస్తోంది. గవర్నర్ తొలుత నార్త్‌బ్లాక్‌లో ఆర్థిక మంత్రి చిదంబరంతో సమావేశమయ్యారు. దాదాపు అరగంట పాటు ఆయనతో చర్చలు జరిగాయి. విభజనకు సంబంధించి అంశాలపైనే ఇద్దరి మధ్య చర్చ జరిగినట్టు సమాచారం. అయితే ఆయన బయటికి మాత్రం ఎటువంటి చర్చ జరగలేదని, కేవలం మర్యాదపూర్వకంగానే కలిశానని చెబుతున్నారు. చిదంబరంతో చర్చలు ముగిసిన వెంటనే గవర్నర్ యుపిఏ చైర్పర్సన్ సోనియా గాంధీతో సమావేశమయ్యారు. టెన్ జన్‌పథ్‌లో దాదాపు పావుగంట సేపు ఆమెతో చర్చించారు. అక్కడి నుంచి బయల్దేరి కేంద్ర హోం మంత్రి షిండేను కలిశారు. మంత్రుల బృందంలో ప్రత్యేక ఆహ్వానితుడు, కేంద్ర సిబ్బంది శాఖ మంత్రి వి.నారాయణస్వామి, ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ ఇబ్రహీంతోనూ నరసింహన్ సమావేశమయ్యారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్‌ను కూడా గవర్నర్ కలిశారు. చివరగా సాయంత్రం 6.30 గంటలకు గవర్నర్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. గవర్నర్ ఇలా దేశరాజధానిలో అందరినీ కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. విభజన ప్రక్రియ శరవేగంతో జరిగిపోతున్నట్లు అర్ధమవుతోంది.