4000 ఏళ్లు జీవించే పాత్ర నేపథ్యంలో | Immortal Movie Details By Gv Prakash Kumar | Sakshi
Sakshi News home page

Immortal Movie: 4000 ఏళ్లు జీవించే పాత్ర నేపథ్యంలో

Sep 1 2026 10:43 AM | Updated on Sep 1 2026 10:43 AM

Immortal Movie Details By Gv Prakash Kumar

జీవి ప్రకాష్‌ కుమార్‌, కయాదు లోహర్‌ జంటగా నటించిన తమిళ సినిమా 'ఇమ్మోర్టల్‌'. అరుణ్‌ కుమార్‌ ధనశేఖరన్‌ నిర్మించగా మారియప్పన్‌ చిన్నా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సామ్ సీఎస్‌ సంగీతమందించాడు. ఫాంటసీ థ్రిల్లర్‌ కథతో దీన్ని తీశారు. ఈ శుక్రవారమే థియేటర్లలో రిలీజ్ కానుంది. ప్రీ రిలీజ్‌ ఈవెంట్ ఆదివారం నిర్వహించారు. ఇందులోనే పలు ఆసక్తికర విషయాల్ని టీమ్ పంచుకుంది.

(ఇదీ చదవండి: పెళ్లయిన 5 నెలలకే 'సాహో' సింగర్ విడాకులు)

ఇది చాలా డిఫరెంట్ సినిమా. ఇండియన్‌ సినిమాకు కొత్తదైన వ్యాంపర్‌ జానర్‌లో రూపొందించారు. ఏడాది పాటు శ్రమించి సీజీ(కంప్యూటర్ గ్రాఫిక్స్), మాన్‌స్టర్‌ సన్నివేశాలను తెరకెక్కించాం. ఇది ఒక సర్వైవల్‌ థ్రిల్లర్‌. 4 వేల ఏళ్ల పాటు జీవించే ఒక పాత్ర చుట్టూ తిరిగే కథ ఇది. ఏ హాలీవుడ్‌ చిత్రానికి కాపీ కాదు అని హీరో జీవీ ప్రకాష్‌ కుమార్‌ చెప్పుకొచ్చాడు.

జీవీ ప్రకాశ్ విషయానికొస్తే.. రీసెంట్ సెన్సేషనల్ హిట్ 'ఇరుముడి'కి సంగీతమందించింది ఇతడే. ఇప్పుడు హీరోగా అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాడు. మరోవైపు కాయదు లోహర్ తమిళంలో ఒప్పుకొన్న తొలి సినిమా 'ఇమ్మోర్టల్'. కానీ విజువల్ ఎఫెక్ట్స్ కారణంగా ఇప్పుడు రిలీజ్ కానుంది. 

ట్రైలర్ బట్టి చూస్తే అద్దె గది కోసం వెతికే హీరో.. అనుకోకుండా హీరోయిన్‌తో పాటు రూమ్ షేర్ చేసుకుంటాడు. కొన్నాళ్లకు ఆమెతో రొమాన్స్ వరకు వెళ్తాడు. తర్వాత ఆమె గురించి కొన్ని షాకింగ్ నిజాలు తెలుస్తాయి. ఇంతకీ అవేంటి? హీరో అక్కడి నుంచి ఎలా బయటపడ్డాడు? అనేది స్టోరీలా అనిపిస్తుంది.

(ఇదీ చదవండి: మేం విడాకులు తీసుకున్నాం.. కానీ పాప విషయంలో:జీవీ ప్రకాశ్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement