ఏ సినిమాకైనా ప్రమోషన్ చాలా అవసరం. అందరికీ ఇది తెలుసు. అయితే కొందరు హీరోయిన్లు వీటిలో పాల్గొనరు. అలాంటి వారిల నయనతార ఒకరు. నటించామా అన్నంతవరకే ఉండేది. కానీ రీసెంట్ టైంలో మెల్లమెల్లగా మారుతూ వస్తోంది. కొన్నిరోజుల క్రితం జరిగిన 'టాక్సిక్' ఈవెంట్ కోసం నయన్, బెంగళూరు వెళ్లి మరీ పాల్గొంది. ఇందుకు కారణం యష్ అని కూడా చెప్పింది. ఈ శుక్రవారం రిలీజయ్యే 'హాయ్' యూట్యూబ్ ఛానెళ్లకు ఇంటర్వ్యూలు కూడా ఇస్తోంది. దీనికి కారణం నయన్ కూడా ఓ నిర్మాత కావడం.
కవిన్, నయనతార జంటగా చేసిన చిత్రమే 'హాయ్'. తమిళంతో పాటు తెలుగులోనూ దీన్ని రిలీజ్ చేస్తున్నారు. నయనతార, ఈమె భర్త విఘ్నేశ్ శివన్, ఎస్ఎస్ లలిత్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంతో విష్ణు ఎడవన్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. యూనిట్ తో పాటు ప్రమోషన్లలో పాల్గొంటున్న నయన్.. చిత్రానికి హైప్ తీసుకునే ప్రయత్నం చేస్తోంది. ప్రేమ, వినోదం తదితర అంశాలతో తెరకెక్కిన ఈ రొమాంటిక్ కామెడీ మూవీ ఇప్పటికే అంచనాలు ఉన్నాయి. తాజాగా తెలుగు ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు.


