‘ప్రేమనే ఊరిలో’ చిత్రంలో ఓ దృశ్యం
శ్రీ రామ్, రామికా శివు, తపస్విని పూనాచ, రంగాయణ రఘు ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం ‘ప్రేమనే ఊరిలో’. మనోజ్ కుమార్ దర్శకత్వంలో మహారత్న ప్రోడక్షన్స్, ఎస్.కె. పిక్చర్స్, వనిల్లా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై చందు శ్రీనివాస్, సురేష్ కొండేటి, మమత దేవేంద్ర ఎం. నిర్మించారు. ఈ మూవీ టీజర్‌ని నటుడు, రచయిత తనికెళ్ల భరణి విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘ప్రేమనే ఊరిలో’ టీజర్ బాగుంది.
తండ్రే తల్లిలా పెంచిన కథతో ఈ సినిమా తీశారు. తండ్రి గొప్పదనం చక్కగా చూపించారనిపిస్తోంది. ఈ చిత్రాన్ని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు. ‘‘ప్రేక్షకులకు మంచి సినిమా ఇవ్వాలనే ఉద్దేశంతోనే ‘ప్రేమనే ఊరిలో’ని తీసుకు వస్తున్నాం’’ అని చందు శ్రీనివాస్ తెలిపారు. ‘‘ప్రేమనే ఊరిలో’ టీజర్‌కి శ్రీకాంత్‌గారి వాయిస్ ఓవర్ అద్భుతంగా కుదిరింది. ది బెస్ట్ మ్యూజికల్ లవ్ స్టోరీగా ఈ చిత్రం నిలుస్తుందని నమ్మకంగా ఉన్నాం’’ అని సురేష్ కొండేటి చెప్పారు.


