బతుకమ్మ సంబురాలు.. రూ.3 లక్షలు గెలిచే ఛాన్స్..! | FDC Chairman Dil raju unvealed Bathukamma celebrations Poster | Sakshi
Sakshi News home page

Dil Raju: బతుకమ్మ సంబురాలు.. రూ.3 లక్షలు గెలిచే ఛాన్స్..!

Aug 22 2026 7:27 PM | Updated on Aug 22 2026 7:27 PM

FDC Chairman Dil raju unvealed Bathukamma celebrations Poster

ఈ ఏడాది బతుకమ్మ పండగ సందర్భంగా తెలంగాణ ఫిల్మ్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక పోస్టర్ ఆవిష్కరించారు. ఈ ఏడాది యంగ్‌ ఫిల్మ్‌ మేకర్‌ ఛాలెంజ్‌ 2026 - సీజన్ 2 పోటీలను నిర్వహిస్తున్నట్లు ఎఫ్‌డీసీ చైర్మన్‌ దిల్‌ రాజు తెలిపారు. ఈ సందర్బంగా  ఎఫ్‌డీసీ ఎండీ, జీ ముకుంద రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ క్రెయేటివ్ డైరెక్టర్ రాజ్ కొండా, ఎఫ్‌డీసీ ఈడీ కిషోర్ బాబులతో కలిసి పోస్టర్ ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై, తెలంగాణ చరిత్ర, సంస్కృతి, పండుగలు, కళారూపాలపై షార్ట్‌ ఫిలిం, పాటల పోటీలు ఉంటాయన్నారు. ఈ సారి కొత్తగా జానపద పాటలు, రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై ఇన్‌ఫ్లుయెన్సర్ల వీడియోస్, వ్యాసాలకు చోటు కల్పించారు. ఈ పోటీలను యువ ప్రతిభావంతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ఈ సందర్భంగా క్రియేటివ్ డైరెక్టర్ రాజ్ కొండా మాట్లాడుతూ..'ఈ పోటీలు యువతకు భవిష్యత్తులో సినీ రంగంలో అవకాశాలను సృష్టిస్తాయని, సృజనాత్మక కంటెంట్‌కు వేదికగా నిలుస్తాయి. తెలంగాణ సంప్రదాయాలు, సంస్కృతి, పండగలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు విస్తృత స్థాయిలో ప్రాచుర్యం పొందేందుకు ఈ పోటీలు దోహదం చేస్తాయని' అని అన్నారు.

ఈ పోటీలకు పంపే లఘు చిత్రాల నిడివి 3 నిమిషాలు, పాటల రన్‌టైమ్‌ 5 నిమిషాలకు మించకూడదు. ఆయా వీడియోలు 4కే రిజల్యూషన్ కలిగి ఉండాలి. ఆసక్తి కలిగిన వారు వాటిని 2026 సెప్టెంబర్ 15లోపు youngfilmmakerschallenge@gmail.com మెయిల్‌కు గానీ, 8125834009 వాట్సాప్ నంబరుకు గానీ పంపాలి. అనంతరం నిపుణులతో కూడిన జ్యూరీ విజేతలను ప్రకటిస్తుంది. ఈ పోటీలలో ప్రథమ బహుమతి రూ.3 లక్షలు, ద్వితీయ బహుమతి రూ.2 లక్షలు, తృతీయ బహుమతి రూ.లక్ష ఉండనుంది. వీటితో పాటు మరో ఐదుగురికి కన్సోలేషన్ బహుమతిగా రూ.20 వేలతో పాటు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు ప్రదానం చేయనున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement