నవీపేట్‌ రైల్వే గేట్‌ మూసివేత.. బాసరకు వెళ్లేవారికి అలర్ట్‌! | Nawipet Railway Gate Closed for Five Days for Repairs | Sakshi
Sakshi News home page

నవీపేట్‌ రైల్వే గేట్‌ మూసివేత.. బాసరకు వెళ్లేవారికి అలర్ట్‌!

Nov 23 2026 8:34 AM | Updated on Nov 23 2026 8:34 AM

Nawipet Railway Gate Closed for Five Days for Repairs

నిజామాబాద్ జిల్లా: నవీపేట్‌ మండల కేంద్రంలో బాసరకు వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న రైల్వే గేట్‌ను ఐదు రోజుల పాటు మూసివేయనున్నారు. రైల్వే గేట్‌ వద్ద మరమ్మతు పనులు చేపట్టేందుకు రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈ నెల 22వ తేదీ నుంచి 26వ తేదీ వరకు గేట్‌ను పూర్తిగా మూసివేయనున్నట్లు ఉమ్రి సెక్షన్‌ ఇన్‌ఛార్జి దుర్గాప్రసాద్‌ వెల్లడించారు.

మరమ్మతు పనులు పూర్తయ్యే వరకు ఈ మార్గంలో రాకపోకలకు అంతరాయం కలగనుంది. ముఖ్యంగా బాసరకు వెళ్లే ప్రయాణికులు, స్థానిక వాహనదారులు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు సూచించారు. గేట్‌ మూసివేత నేపథ్యంలో వాహనదారులు ముందుగానే ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని కోరారు. మరమ్మతు పనులకు సహకరించాలని ఉమ్రి సెక్షన్‌ ఇన్‌ఛార్జి దుర్గాప్రసాద్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement