ఆదివారం స్వామిని దర్శించుకున్న 80,400 మంది
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఆది వారం భక్తులు పోటెత్తారు. సెలవు రోజుతో పాటు పవిత్ర కార్తీక మాసం కావడంతో ఏకంగా 80,400 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
భక్తుల రద్దీ కారణంగా ధర్మ దర్శనానికి 5 గంటలు, వీఐపీ దర్శనానికి గంటన్నర సమయం పట్టింది. మాడ వీధులు, క్యూకాంప్లెక్స్, ప్రసాద విక్రయశాల వంటి ప్రదే శాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. వాహనాల రద్దీ పెరగడంతో రింగ్ రోడ్డు, పార్కింగ్ ప్రాంతాలు నిండిపోయాయి. ఆలయానికి రూ. 59,51,025 నిత్యాదాయం సమకూరినట్లు అధికారులు వెల్లడించారు.


