సర్పంచ్, పోలీస్‌ కానిస్టేబుల్‌పై కేసు నమోదు | Woman Files Sexual Harassment Complaint Against Sarpanch and Police Constable in Suryapet | Sakshi
Sakshi News home page

సర్పంచ్, పోలీస్‌ కానిస్టేబుల్‌పై కేసు నమోదు

Nov 23 2026 8:17 AM | Updated on Nov 23 2026 8:17 AM

Woman Files Sexual Harassment Complaint Against Sarpanch and Police Constable in Suryapet

సూర్యాపేట టౌన్‌ : మహిళను లైంగిక వేధింపులకు గురిచేస్తున్న ఓ ప్రజాప్రతినిధితో పాటు పోలీస్‌ కానిస్టేబుల్‌పై సూర్యాపేట టూటౌన్‌ పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. వివరాలు.. చివ్వెంల మండలం ఉండ్రుగొండ గ్రామ సర్పంచ్‌ రామకృష్ణ, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఏఆర్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సూర్యాపేట పట్టణానికి చెందిన వీరబాబు తనను లైంగికంగా వేధిస్తున్నారని సూర్యాపేట పట్టణానికి చెందిన ఓ మహిళ సూర్యాపేట టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. 

బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని.. ఫిర్యాదులో పేర్కొన్న అంశాలు, అందజేసిన ఆధారాలను పరిశీలించి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ వెంకటయ్య తెలిపారు. పోలీస్‌ కానిస్టేబుల్‌పై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించి, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement