క్రేజీ డైరెక్టర్‌తో మెగాస్టార్ సినిమా.. ఫ్యాన్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్ | Srikanth Odela Special Wishes To Megasta Chiranjeevi, Drops Surprise Update On T-REX, Check Out His Post Went Viral | Sakshi
Sakshi News home page

Chiranjeevi: క్రేజీ డైరెక్టర్‌తో మెగాస్టార్ సినిమా.. ఫ్యాన్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్

Aug 22 2026 8:30 PM | Updated on Aug 22 2026 8:48 PM

Srikanth Odela special Wishes To Megasta Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి బర్త్‌ డే సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులతో పాటు టాలీవుడ్ ప్రముఖులు ఆయనకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఇవాళ స్పెషల్ డే కావడంతో మెగా158 మూవీ టైటిల్ రివీల్ చేశారు. బాబీ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాకు కాకా అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ మేరకు స్పెషల్‌ గ్లింప్స్ రిలీజ్ చేశారు. అంతేకాకుండా విశ్వంభరకు సంబంధించిన అప్‌డేట్ కూడా ఇచ్చారు.

అయితే ఇదంతా పక్కనపెడితే మరో డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల చేసిన ట్వీట్‌ ఆసక్తిగా మారింది. గతంలో బాబీ కంటే ముందే అనౌన్స్‌ చేసిన మూవీకి సంబంధించిన తాజాగా అప్‌డేట్ ఇచ్చాడు. మెగాస్టార్‌కు బర్త్ ‍డే విషెస్ చెప్పిన శ్రీకాంత్ ఓదెల.. మెగాస్టార్‌తో పని చేసేందుకు రెడీగా ఉన్నానని తెలిపారు. టి-రెక్స్ సినిమా షూటింగ్ ప్రారంభించి.. మీతో జీవితాంతం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకాలను సృష్టించుకోవడానికి ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నానంటూ ట్వీట్ చేశారు. దీంతో ఈ ప్రాజెక్ట్‌ ఆగిపోయిందనుకున్న అభిమానులకు బిగ్‌ సర్‌ప్రైజ్ ఇచ్చినట్లైంది. ఈ ట్వీట్‌కు మెగాస్టార్ సైతం రిప్లై ఇచ్చారు. దీంతో ఫ్యాన్స్ పండుగు చేసుకుంటున్నారు. మరి ఈ ప్రాజెక్టు ఎప్పుడు మొదలవుతుందో వేచి చూడాల్సిందే. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement