నవంబరులో గోంధళ్‌ | India Oscar entry to release in seven languages on November | Sakshi
Sakshi News home page

నవంబరులో గోంధళ్‌

Oct 29 2026 4:19 AM | Updated on Oct 29 2026 4:19 AM

India Oscar entry to release in seven languages on November

మరాఠీ హిట్‌ మూవీ ‘గోంధళ్‌’ నవంబరులో తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఇషితా దేశ్‌ముఖ్, యోగేష్‌ సోహోని, కిషోర్‌ కదమ్, సురేష్‌ విశ్వకర్మ, నిషాద్‌ భోయిర్, అనుజ్‌ ప్రభు, విఠల్‌ కాలే ప్రధాన పాత్రల్లో నటించారు. సంతోష్‌ దవఖర్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమా 2025 నవంబరు 14న మరాఠీలో విడుదలై, సూపర్‌ హిట్‌గా నిలిచింది. 

పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అందుకున్న ఈ చిత్రం 2026 అంతర్జాతీయ ఉత్తమ చిత్రం విభాగంలో భారతదేశం నుంచి ఆస్కార్‌ నామినేషన్‌ ఎంట్రీ పోటీకి ఎంపికైంది. ఈ మూవీ తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం, హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లో నవంబరు 13న విడుదల కానుంది. ‘కేజీఎఫ్, సలార్, కాంతారా’ వంటి భారీ బడ్జెట్‌ సినిమాలు నిర్మించిన హోంబలే ఫిలింస్‌ ‘గోంధళ్‌’ని రిలీజ్‌ చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement