మాత రాజేశ్వరి సమర్పణలో భూమాత ఆర్ట్స్ పతాకంపై తెరకెక్కనున్న చిత్రం ‘ఓస్కార్ మిస్సింగ్’. పసుపులేటి రాధాకృష్ణ, శివాని జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి చంద్రమౌళి పి.జి దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ మాత, నితిన్ మాత నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలతో శనివారం ఘనంగా ప్రారంభమైంది.
డిసెంబర్ చివరి నాటికి
ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ.. ‘ఓస్కార్ మిస్సింగ్’ చిత్రాన్ని పూర్తిస్థాయి హాస్యభరిత వినోదాత్మక చిత్రంగా రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఇందులో కొన్ని నిజ జీవిత పాత్రలు కూడా కనిపిస్తాయని, సినిమా ఆద్యంతం ప్రేక్షకులను నవ్వించడమే ప్రధాన లక్ష్యంగా కథను సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు.
డిసెంబర్ చివరి నాటికి షూటింగ్ ముగించి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. కాగా ఈ చిత్రంలో అలీ, చిత్రం శ్రీను, బిత్తిరి సత్తి, జబర్దస్త్ ఫణి, రాము, దుర్గారావు, శోభ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
(ఇదీ చదవండి: రామాయణలో ‘బ్రహ్మ’ ఏఐ టెక్నాలజీ..! అసలేంటీ విధానం?)


