వాషింగ్టన్: అమెరికాలో నవంబర్ మూడో తేదీన జరగాల్సిన మధ్యంతర ఎన్నికలకు గాను అధ్యక్షుడు ట్రంప్ సారథ్యంలోని అధికార రిపబ్లికన్ పార్టీకి స్పేస్ ఎక్స్ అధిపతి ఎలాన్ మస్క్ అత్యధికంగా విరాళాలను అందజేసినట్లు వెల్లడైంది. ఆయన ఏకంగా 276 మిలియన్ డాలర్లు అంటే, రూ. 2,638 కోట్లు విరాళంగా సమకూర్చారు.
డెమోక్రాటిక్ పార్టీ నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొంటున్న రాష్ట్రాల్లో రిపబ్లికన్ పార్టీకి దన్నుగా ఉండేందుకు జూలై నుంచి ఈ మొత్తాన్ని అందజేస్తూ వచ్చారని న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో వెల్లడించింది. 2025–26 సంవత్సరాల్లో వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ప్రచారానికిగాను మస్క్ అత్యధికంగా రిపబ్లికన్లకు మొత్తమ్మీద 366 మిలియన్ డాలర్లు, అంటే రూ.3,500 కోట్లు ఇచ్చినట్లయిందని పేర్కొ ంది. 2024 ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో ప్రచారానికి గాను 290 మిలియన్ డాలర్లు, అంటే రూ.2,772 కోట్లు అందించారని కూడా తెలిపింది.


