హీరోయిన్ త్రిష మరో ఓ వెబ్ సిరీస్‌లో నటించనున్నారు. సూపర్ నేచురల్ థ్రిల్లర్ (అతీంద్రియ శక్తులు) నేపథ్యంలో రూ పొందనున్న ఈ తెలుగు వెబ్ సిరీస్‌కి నందినీ రెడ్డి దర్శకత్వం వహించనున్నారట. త్రిష తన కెరీర్‌లో ఇప్పటివరకు పలు థ్రిల్లర్ మూవీస్‌లో నటించిన సంగతి తెలిసిందే. ఆమె ప్రధానపాత్రలో నటించిన తొలి వెబ్ సిరీస్ ‘బృంద’. ఆ తర్వాత ఆమె మరో వెబ్ సిరీస్‌లో నటించలేదు.
ఇప్పుడు నందినీ రెడ్డి డైరెక్షన్‌లో సిరీస్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. అతీంద్రియ శక్తుల నేపథ్యంలో రూపొందనున్న ఈ సిరీస్ వీక్షకులకు కొత్త అనుభూతినిచ్చేలా ఉంటుం దట. బలమైన భావోద్వేగాలు, ఆకట్టుకునే కథనంతో ఈ సిరీస్‌ని తెరకెక్కించనున్నారని టాక్. ఇప్పటివరకూ త్రిష చేసినపాత్రలతో పోలిస్తే ఈ సిరీస్‌లో ఆమెపాత్ర సరికొత్తగా ఉంటుందని తెలుస్తోంది. ఈ సిరీస్ గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.


