'ఇరుముడి'తో జాక్‌పాట్ కొట్టిన రవితేజ | Ravi Teja Scores A Big Jackpot With Irumudi Success Despite Taking A Smaller Remuneration, Deets Inside | Sakshi
Sakshi News home page

Raviteja Irumudi: తీసుకున్న రెమ్యునరేషన్ తక్కువే కానీ

Aug 23 2026 12:47 AM | Updated on Aug 23 2026 11:41 AM

Raviteja Jackpot With Irumudi Movie Remuneration

చాన్నాళ్ల తర్వాత హీరోగా రవితేజ హిట్ కొట్టాడు. రెండు రోజుల క్రితం థియేటర్లలోకి వచ్చిన 'ఇరుముడి'కి దాదాపుగా పాజిటివ్ టాక్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో షోలన్నీ ఫుల్ అవుతున్నాయి. దీంతో రవితేజ ఫుల్ హ్యాపీస్. ఈ క్రమంలోనే తొలిరోజు రూ.26 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు కూడా తెలుస్తోంది. అయితే ఈ మూవీ కోసం ఇతడు తక్కువే రెమ్యునరేషన్ తీసుకున్నప్పటికీ అదిరిపోయే జాక్ పాట్ కొట్టినట్లు మాట్లాడుకుంటున్నారు.

ఈ సినిమాలో నటించినందుకుగానూ రవితేజ.. సాధారణంగా అందుకునే పారితోషికంలో మూడో వంతు మాత్రమే తీసుకున్నాడట. అదనంగా నైజాం థియేట్రికల్ హక్కులు దగ్గర పెట్టుకున్నాడు. ఇప్పుడు సక్సెస్ దక్కేసరికి రవితేజ రెగ్యులర్‌గా తీసుకునే రెమ్యునరేషన్ కంటే ఎక్కువనే రాబోతున్నట్లు తెలుస్తోంది. దాదాపు రూ.20 కోట్ల వరకు రవితేజకు దక్కనున్నట్లు సమాచారం.

'ఇరుముడి' విషయానికొస్తే.. సీలేరు దగ్గర పల్లెటూరిలో ఉండే త్రినాథ్ (రవితేజ) లగేజీ ఆటో డ్రైవర్. భార్య కావేరి(ప్రియా భవానీ శంకర్), కూతురు మణి(నక్షత్ర)తో కలిసి హ్యాపీగా బతికేస్తుంటాడు. ప్రతి ఏడాది అయ్యప్ప దీక్ష తీసుకుంటూ ఉంటాడు. ఏం జరిగినా తనతో చెప్పాలని కూతురితో చెబుతాడు. ఆమె కూడా ప్రతిదీ నాన్నకు చెబుతూ ఉంటుంది. త్రినాథ్ అయ్యప్ప మాల వేసిన తర్వాత తాను చదువుతున్న స్కూల్‌లో జరుగుతున్న ఓ సంఘటన గురించి కూతురికి తెలుస్తోంది. దానిని ఎలాగైనా నాన్నకు చెప్పాలనుకుంటుంది. ఇంతకీ మణి చెప్పాలనుకుంటున్న విషయమేంటి? త్రినాథ్‌కి వాటి గురించి ఎప్పుడు ఎలా తెలిసింది? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement