ముచ్చటగా మూడోసారి ప్రెగ్నెన్సీ.. కరీనా కపూర్‌ పోస్ట్ వైరల్..! | Kareena Kapoor Breaks Silence On Pregnancy Buzz, Gives A Humorous Reply To Baby Bump Rumours, Post Went Viral | Sakshi
Sakshi News home page

Kareena Kapoor: ముచ్చటగా మూడోసారి ప్రెగ్నెన్సీ.. కరీనా కపూర్‌ పోస్ట్ వైరల్..!

Aug 22 2026 9:15 PM | Updated on Aug 23 2026 11:38 AM

Kareena Kapoor takes jibe at pregnancy claims goes Viral In social Media

బాలీవుడ్ ఫేమస్ జంటల్లో కరీనా కపూర్- సైఫ్ అలీ ఖాన్ ఒకరు. వీరిద్దరి ప్రేమ పెళ్లి చేసుకుని ప్రస్తుతం లైఫ్‌లో బిజీగా ఉన్నారు. వీరిద్దరికీ ఇప్పటికే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. తమ కెరీర్‌లో బిజీగా ఉన్న ఈ జంట ‍అప్పుడప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటోంది. తాజాగా మరోసారి కరీనా కపూర్‌ హాట్‌ టాపిక్‌గా మారింది. ఆమె త్వరలోనే మూడో బిడ్డకు జన్మనివ్వనుందని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.

ప్రస్తుతం 45 ఏళ్ల వయసులో ఉన్న బాలీవుడ్ భామ జిమ్ వీడియో ఇటీవలే నెట్టింట వైరలైంది. ఈ వీడియోలో ఆమెకు బేబీ బంప్‌తో ఉన్నట్లు కనిపించడంతో రూమర్స్ మొదలయ్యాయి. ఆమె మరోసారి గర్భం దాల్చిందంటూ బాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. అయితే ఈ రూమర్స్‌పై కరీనా కపూర్ ఆడపడచు సబా పటౌడీ స్పందించారు. ఆమె గర్భవతి అన్న ఊహాగానాలను నవ్వుతూ కొట్టిపారేశారు. కొంతమంది సోషల్ మీడియా యూజర్లు ప్రెగ్నెన్సీతో కనిపిస్తోందని పేర్కొన్నారు, కానీ అలాంటిదేం లేదని సబా స్పష్టం చేశారు.

(ఇది చదవండి: స్పిరిట్ వివాదం.. దీపికా పదుకొణె స్ట్రాంగ్ రియాక్షన్‌)

తాజాగా తనపై వస్తున్న ప్రెగ్నెన్సీ రూమర్లపై కరీనా కపూర్ సైతం స్పందించింది. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. కడుపు ఉబ్బినట్లుగా ఉన్న ఓ ఫోటోను పంచుకుంది. నవ్వుతున్న ఎమోజీలతో పాటు పిజ్జా ఎమోజీలు పోస్ట్ చేసింది. అంటే ఇది కేవలం ఫుడ్‌ ఎక్కువగా తినడం వల్లే వచ్చిన బేబీ బంప్ అంటూ పరోక్షంగా క్లారిటీ ఇచ్చేసింది. 

k
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement