టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తోన్న మూవీ స్పిరిట్. యానిమల్ తర్వాత ఆయన దర్శకత్వం వహిస్తోన్న సినిమా. ఈ చిత్రంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా కనిపించనుండగా.. యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ చిత్రంలో మొదట దీపికా పదుకొణెను హీరోయిన్‌గా ప్రకటించగా.. ఆ తర్వాత ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి అనూహ్యంగా తప్పుకుంది. అప్పట్లో ఇది పెద్దఎత్తున వివాదానికి దారితీసింది.
అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన సందీప్ రెడ్డి సోదరుడు, నిర్మాత ప్రణయ్ రెడ్డి.. దీపికా పదుకొణెపై విమర్శలు చేశారు. ఆమె ఈ మూవీకి భారీగా రెమ్యునరేషన్ అడిగారని.. అంతేకాకుండా లాభాల్లో 10 శాతం ఇవ్వాలని డిమాండ్ చేశారని సందీప్ సోదరుడు నిర్మాత ప్రణయ్ ఆరోపించారు. దీంతో ఈ వివాదం మరోసారి తెరపైకొచ్చింది.
తాజాగా ఈ వివాదంపై ఓ నెటిజన్ ఆసక్తికర పోస్ట్ చేసింది. హీరోలు ప్రాఫిట్ షేరింగ్ అడిగితే లేని విమర్శలు.. మహిళా నటులు అడిగితే ఎందుకు? అంటూ నెటిజన్ తన పోస్ట్‌లో ప్రశ్నించింది. ఆమె నో చెప్పడం వల్లే ఈగో సమస్యలు వచ్చాయి.. ఇది కేవలం పురుషాధిక్య అహంకారం మాత్రమేనంటూ పోస్ట్‌లో నెటిజన్ రాసుకొచ్చింది. ఇది చూసిన హీరోయిన్ దీపికా పదుకొణె ఆ పోస్ట్‌ను లైక్ చేసింది. దీంతో దీపికా సైతం తన అభిప్రాయం కూడా ఇదేనని వ్యక్తం చేస్తూ లైక్ కొట్టిందని నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


