‘డాడీ కూల్’ సాంగ్ కోసం సౌతాఫ్రికా వెళ్తున్నారట కరీనా కపూర్. షారుక్ ఖాన్ హీరోగా సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న హిందీ చిత్రం ‘కింగ్’. ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఇందులోని ఓ స్పెషల్ సాంగ్ కోసం కరీనా కపూర్‌ను సిద్ధార్థ్ ఆనంద్ సంప్రదించగా, ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.
వచ్చే నెలలో సౌతాఫ్రికాలో షారుక్, కరీనాలపై ఈ ప్రత్యేక పాటను చిత్రీకరిస్తారని, ‘డాడీ కూల్..’ అంటూ ఈ పాట సాగుతుందని బాలీవుడ్ భోగట్టా. షారుక్ కుమార్తె సుహానా ఖాన్, దీపికా పదుకోన్, అభిషేక్ బచ్చన్, అనిల్ కపూర్ ‘కింగ్’లోని ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబరు 24న విడుదల కానుంది.


