కేరాఫ్ కంచరపాలెం డైరెక్టర్‌ కొత్త మూవీ.. హీరోయిన్‌గా పుష్ప-2 ఫేమ్ | Care Of Kancharapalem Director next Movie Title Revealed | Sakshi
Sakshi News home page

Attahasam Movie: కేరాఫ్ కంచరపాలెం డైరెక్టర్‌ కొత్త మూవీ.. హీరోయిన్‌గా పుష్ప-2 ఫేమ్

Oct 6 2026 9:21 PM | Updated on Oct 6 2026 9:21 PM

Care Of Kancharapalem Director next Movie Title Revealed

కేరాఫ్ కంచరపాలెం మూవీతో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ వెంకటేశ్ మహా. ఈ చిత్రంతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. ఆయన తాజాగా మరో చిత్రాన్ని ప్రకటించారు. సరికొత్త కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తాజా చిత్రానికి అట్టహాసం అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. దీంతో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ కూడా రిలీజ్ చేశారు.

కంచరపాలెం తరహాలోనే ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు  పేర్కొన్నారు. ఈ మూవీలో కేరాఫ్ కంచరపాలెం ఫేమ్ కార్తీక్ రత్నం, పుష్ప ఫేమ్ పావని కరణం ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వీరితో దర్శకుడు వెంకటేశ్ మహా, సోషల్ మీడియా ఇన్‌‌ఫ్లుయెన్సర్ స్రవంతి పెపకాయల కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ మూవీని చింతా గోపాలకృష్ణ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి స్మరణ్ సంగీతం అందిస్తున్నారు. 2027 వేసవి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement