'టాక్సిక్' హైదరాబాద్ ఈవెంట్‌లో ప్రమాదం | Toxic Movie Pre Release Event Turns Chaotic In Hyderabad As Massive Sound Setup Collapses, Four Injured | Sakshi
Sakshi News home page

Toxic Movie Event Accident: 'టాక్సిక్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అపశృతి

Aug 22 2026 11:47 PM | Updated on Aug 23 2026 11:40 AM

Toxic Pre Release Event Hyderabad Accident

యష్ హీరోగా చేసిన లేటెస్ట్ మూవీ 'టాక్సిక్'. వచ్చే బుధవారం (ఆగస్టు 26) పాన్ ఇండియా వైడ్ థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికే ట్రైలర్, పాటలు రిలీజ్ చేశారు. తాజాగా హైదరాబాద్‌లోని మల్లారెడ్డి యూనివర్సిటీలో శనివారం రాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో యష్ మాట్లాడుతుండగా భారీ సౌండ్ బాక్స్ సెట్ కుప్పకూలింది. ఈ క్రమంలోనే ఇద్దరు యువకులు కాళ్లు విరిగినట్లు తెలుస్తోంది. మరో ఇద్దరమ్మాయిలకి గాయలవగా.. వీళ్లలో ఒకామె స్పృహ కోల్పోయింది. వీళ్లని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో ఈవెంట్ ప్రాంగణంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తీసిన 'టాక్సిక్' సినిమాలో తండ్రికొడుకులుగా యష్ ద్విపాత్రాభినయం చేశాడు. నయనతార, రుక్మిణి వసంత్, కియారా అడ్వాణీ, తారా సుతారియా, హ్యుమా ఖురేషి హీరోయిన్లు. రవి బస్రూర్ సంగీతమందించాడు. గీతూ మోహన్ దాస్ దర్శకురాలు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement