‘ఇరుముడి’కి అదిరిపోయే ఓపెనింగ్‌.. తొలిరోజు కలెక్షన్లు ఇవే | Irumudi Box Office Collections Day 1 | Sakshi
Sakshi News home page

‘ఇరుముడి’కి అదిరిపోయే ఓపెనింగ్‌.. తొలిరోజు కలెక్షన్లు ఇవే

Aug 22 2026 1:27 PM | Updated on Aug 22 2026 1:29 PM

Irumudi Box Office Collections Day 1

రవితేజ కథానాయకుడిగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఇరుముడి’. ప్రస్తుతం బాక్సాఫీస్‌ వద్ద జోరు చూపిస్తోంది. విడుదలైన తొలిరోజుకే భారీ వసూళ్లు రాబట్టింది. ఇండియాలో రూ.14.80 కోట్లు నెట్‌ కలెక్షన్లు సాధించినట్లు సాక్‌నిల్క్‌ నివేదిక అంచనా వేసింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.24.20 కోట్లు గ్రాస్‌ వసూళ్లు సాధించినట్లు పేర్కొంది.

ఏపీ తెలంగాణ నుంచే రూ.15 కోట్లు
తొలిరోజు ‘ఇరుముడి’ వసూళ్లలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి రూ.15కోట్లు గ్రాస్‌ వచ్చినట్లు అంచనా. కర్ణాటక నంచి 1.5 కోట్లు, తమిళనాడు నుంచి రూ.34 లక్షలు, మిగతా ప్రాంతాల నుంచి 36 లక్షలు వసూళయ్యాయి. దీంతో ఇండియాలో మొత్తం గ్రాస్‌ రూ.17.20 కోట్లకు చేరింది. ఓవర్సీస్‌లో రూ.7 కోట్ల గ్రాస్‌ రావడంతో ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్లు రూ.24.20 కోట్లకు చేరాయి. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement