బాలీవుడ్ స్టార్ సల్మాన్‌ఖాన్ హీరోగా, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఎస్‌వీసీ63 (వర్కింగ్ టైటిల్) సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌లో ఓ అనూహ్య ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. పలు యాక్షన్ సన్నివేశాలను బాడీ డబుల్(డూప్) సాయంతో చిత్రీకరిస్తుండగా స్టట్ పర్ఫార్మర్ అస్వస్థతకు గురై గుండెపోటు వచ్చినట్లు సమాచారం.
యాక్షన్ సన్నివేశాలను స్వయంగా..
బాడీ డబుల్ ప్రస్తుతం యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొనే పరిస్థితి లేకపోవడంతో చిత్రబృందానికి ఇబ్బంది కలగకుండా సల్మన్ ఖాన్ స్వయంగా కొన్ని యాక్షన్ సన్నివేశాలు చేస్తున్నట్లు సమాచారం. గతంలోనూ తన సినిమాల్లో పలు యాక్షన్, స్టంట్ సన్నివేశాలను స్వయంగా చేసిన సల్మన్. ఈ చిత్రంలోనూ అదే పంథాను కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.
‘మాన్‌స్టర్’గా పేరు..
సల్మాన్, వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘మాన్‌స్టర్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఇదే టైటిల్ ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై చిత్రబృందం స్పందించాల్సి ఉంది.
ఇదీ చదవండి: అభిమానులకు అదిరిపోయే ట్రీట్ వచ్చేసింది


