మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే ట్రీట్ వచ్చేసింది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మెగా 158’ టైటిల్‌ను ‘కాకా’గా ఖరారు చేశారు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేశారు. చిరంజీవి సరికొత్తగా కనిపిస్తున్నాడు. ‘గ్యాంగ్ లీడర్’లోని ‘గ్యాంగ్ గ్యాంగ్’ పాట రీమిక్స్ కూడా గ్లింప్స్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
తమన్ నేపథ్య సంగీతం యాక్షన్ సన్నివేశాలకు మరింత బలాన్ని ఇచ్చింది. అనస్వర రాజన్ కీలక పాత్రలో నటిస్తుండగా.. సునీల్, గెటప్ శ్రీను తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. వెంకట్ కె. నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు. ఈ అప్‌డేట్‌తో మెగా అభిమానుల్లో సందడి నెలకొంది.


