జానపద కళాకారిణి మాధురి రాథోడ్
తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడంతోపాటు అకారణంగా దాడికి పాల్పడిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ జానపద కళాకారిణి మాధురి రాథోడ్ వేములవాడ టౌన్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు తెలిపిన వివరాలు.
ఈనెల 19న స్థానిక రెడ్డిభవన్‌లో ఈశ్వర్‌సాయి సతీమణి శరణ్య తనను అసభ్యకర పదజాలంతో దూషించి, దాడికి పాల్పడ్డారని మాధురి పేర్కొన్నారు. ఆ సమయంలో వీడియోలు చిత్రీకరించడమే కాకుండా, తన వద్ద ఉన్న రూ.50వేల విలువైన ఐఫోన్‌ను దొంగిలించారని ఆరోపించారు. ఆ వీడియోలను ఇన్‌స్ట్రాగామ్, ఫేస్‌బుక్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసి తన పరువు తీశారని ఆవేదన వ్యక్తం చేశారు.
అలాగే కొన్ని మీడియా సంస్థలు కూడా వాస్తవాలు తెలుసుకోకుండా తన వ్యక్తిగత గౌరవాన్ని కించపరిచేలా కథనాలు ప్రసారం చేశాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. మాధురి రాథోడ్ ఫిర్యాదుతో శరణ్యతోపాటు సంబంధిత మీడియాసంస్థలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్ సీఐ వీరప్రసాద్ శుక్రవారం తెలిపారు.
-రాజన్న సిరిసిల్ల జిల్లా
అభిమానులకు అదిరిపోయే ట్రీట్ వచ్చేసింది


