Eshwar
-
‘సూర్యాపేట్ జంక్షన్’రిలీజ్ డేట్ ఫిక్స్
ఈశ్వర్, నైనా సర్వర్ జంటగా అభిమన్యు సింగ్ కీలక పాత్రలో నటించిన మూవీ ‘సూర్యాపేట్ జంక్షన్’. యోగాలక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై అనీల్ కుమార్ కాట్రగడ్డ, ఎన్ శ్రీనివాసరావు నిర్మాణంలో, రాజేష్ నాదెండ్ల దర్శకత్వంలో రూపోందిన ఈ మూవీ ఈ నెల 25న థియేటర్ లలో విడుదల కాబోతుంది. ప్రముఖ నటుడు అభిమన్యు సింగ్ కీలక పాత్రలో నటించారు. గ్లోబల్ సినిమాస్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా తెలుగు రాష్ట్రాలలో గ్రాండ్ గా విడుదల కానుంది.ఈ సందర్భంగా హీరో ఈశ్వర్ మాట్లాడుతూ...ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్ కు డిజిటిల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్ గా రిలీజైన "మ్యాచింగ్.. మ్యాచింగ్" సాంగ్ తో పాటు టీజర్ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. మంచి కథ ఉంటే తెలుగు ప్రేక్షకులు అదరిస్తారు, హిట్టు చేస్తారని ఎన్నో సార్లు రుజువైంది. అందుకే ఈ సినిమా చేశాం. సినిమాలో యాక్షన్ సీన్స్ కూడా చాలా సహజంగానే ఉంటాయి. ఈ నెల 25న రిలీజ్ అయ్యే ఈ సినిమాను థియేటర్ లలో చూసి మీరందరూ మమ్మల్ని అదరిస్తారని ఆశిస్తున్నాను.’’ అని అన్నారు.ప్రొడ్యూసర్ అనిల్ కుమార్ కాట్రగడ్డ మాట్లాడుతూ... "మా సూర్యాపేట్ జంక్షన్ మూవీ ఈ నెల 25న ఆంధ్రా, తెలంగాణాలలో గ్లోబల్ సినిమా డిస్ట్రిబ్యూషన్ లో విడుదల కావడం ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా సునీల్ గారికి, రాంమోహన్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. మా సూర్యాపేట్ జంక్షన్ సినిమాని థియేటర్ లలో ప్రతి ఒక్కరూ చూడాలని విజ్ఞప్తి చేస్తున్నాం" అని అన్నారు. -
ఈశ్వరాజ్ఞ
రజతాచలం పైని వనాంతర సీమలలో వసంతం నిండుగా కమ్ముకుని ఉంది. ఆ ప్రకృతి రామణీయకతలో ఒకచోట దాగి ఏకాంత క్షణాలను గడుపుతూ, ఆనందిస్తున్నారు శివపార్వతులు. వారి ఏకాంతాన్ని ఎవరూ భంగపరచకుండా నంది కాపు కాస్తున్నాడు. అలాఉండగా, అది రజతాచలమని, అక్కడ మదనారియైన శివుడు వసిస్తూ ఉంటాడనే ఆలోచన మరచి, ఆవసంత శోభను తాము కూడా ఆనందించి తరించాలనే ఉద్దేశంతో గంధర్వ గణాలు ఒక్కసారిగా వచ్చి గిరిపై పడ్డాయి. తమ అరుపులతో, కేరింతలతో ఆ వన ప్రాంతంలో అట్టహాసం చేయసాగాయి. ఆ శబ్దానికి ఉలిక్కిపడిన నంది, కోపగించి, వారిపై మాటల దూషణలతో విరుచుకుపడ్డాడు. ’అంధులా మీరు? లోకేశ్వరుడైన ఈశ్వరుడు, ఈశ్వరితో ఏకాంతంలో ఉండగా, ఇలా వచ్చి గోల చేయడం తగిన పనికాదు. ఆలస్యం చేయక, ఇక్కడి నుండి వెంటనే దూరంగా వెళ్ళిపొండి!’ అని మందలించాడు. నంది మాటలను వారు లెక్క చేసే స్థితిలో లేరు. గంధర్వ గణాల ఆ స్థితిని ఆత్మలో ఎరిగిన శంకరుడు, ఉగ్రుడై చెంతనే పడివున్న గడ్డిపోచలను పిడికిట పట్టి ‘పిశా చాలుగా మారండని’ శపించి వారిపై విసిరాడు. కనువిందు చేసే అంద మైన రూపాలు కాస్తా అంతలోనే అంతరించిపోయి, రూపురేఖలు తప్పి వికటాంగులయ్యారు గంధర్వులు. ఆ సందర్భాన్ని తెనాలి రామకృష్ణకవి ఇలా వర్ణించాడు ఉద్భటారాధ్య చరిత్రలో. కం. కొఱకును బోవం బడిక /ల్లుఱక పయింబడిన కరణి నొకపనికై రా నుఱుమని పిడుగై వారికి /గఱకంఠుని చేత నీచగతి వాటిల్లెన్.పక్షులు ఎఱను ఏరి తినడానికని వెళ్ళగా, ఇంతలో ఎక్కడి నుండి వచ్చిందో తెలియని పడికల్లు – తుపాకి గుండు – వేగంగా వచ్చి వెంటాడి మీద పడినట్లుగా, రజతాచలంపైని వసంత శోభను ఆనందించాలనే ఒక పని మీద రాగా, ఉరుము లేకుండానే మీద పడిన పిడుగు చందంగా,శంకరుడి శాపం తగిలి నీచ గతి ప్రాప్తించింది కదా అని గంధర్వ గణాలు బాధపడడం పై పద్యం భావం. ఏదైనా తప్పుతుందేమో కాని ఈశ్వరాజ్ఞ తప్పదు కదా!– భట్టు వెంకటరావుఈశ్వరాజ్ఞ -
రామ రామ.. ఏమిటీ డ్రామా!
సాక్షి టాస్క్ ఫోర్స్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అనంతపురం జిల్లా కణేకల్లు మండలం హనకనహాళ్ శ్రీరాములోరి రథం దగ్ధం కేసును పోలీసులు పక్కదారి పట్టిస్తున్నారు. రథానికి నిప్పు పెట్టిన ఘటనలో సూత్రధారులు, పాత్రధారులు టీడీపీ సానుభూతిపరులేనంటూ సర్వత్రా కోడై కూస్తున్నా.. పోలీసులు మాత్రం ఆ నెపాన్ని ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్సీపీపై నెట్టేస్తున్నారు. అధికార పార్టీ పెద్దల సూచనలకు అనుగుణంగా పోలీసులు ఇలా వ్యవహరిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో ఈశ్వర్‌రెడ్డి అనే వ్యక్తిని బుధవారం అనంతపురంలో మీడియా ఎదుట హాజరు పరిచారు. రథానికి నిప్పు పెట్టడంలో ఈశ్వర్‌రెడ్డి పాత్ర ఉందని, ఇతను వైఎస్సార్సీపీకి చెందిన వాడని జిల్లా ఎస్పీ జగదీష్ ప్రకటించారు. వాస్తవంగా ఈశ్వర్‌రెడ్డి గత ఎన్నికల్లో టీడీపీకి పని చేశాడని, ఆ విషయాన్ని పోలీసులు దాచి.. వైఎస్సార్సీపీ ముద్ర వేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రథం దగ్ధం తర్వాత పోలీసులు ఆధారాల సేకరణ కోసం డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దింపారు. పోలీసు జాగిలాలు గ్రామంలోని నలుగురి ఇళ్ల వద్దకు వెళ్లాయి. ఆ నాలుగిళ్లూ టీడీపీ సానుభూతిపరులవే కావడం గమనార్హం. పోలీసుల ప్రాథమిక విచారణలోనూ టీడీపీకి చెందిన వారే ఈ పని చేసినట్లు తేలినప్పటికీ వారెవ్వరినీ నిందితులుగా చూపలేదు. ఆ పార్టీ పెద్దల ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటూ కేసును తప్పుదారి పట్టిస్తున్నట్లు సమాచారం. అన్ని వేళ్లూ వారి వైపే.. హనకనహాళ్ గ్రామంలో శ్రీరాములోరి రథం పట్ల ముందు నుంచీ తీవ్ర వ్యతిరేకతతో ఉన్నది టీడీపీ వారే కావడం గమనార్హం. ఈ విషయం గ్రామస్తులందరూ చెబుతున్నప్పటికీ వైఎస్సార్సీపీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరులైన మూలింటి ఎర్రిస్వామిరెడ్డి బ్రదర్స్ 2022లో రూ.19 లక్షల సొంత నిధులతో రథాన్ని తయారు చేయించారు. వైఎస్సార్సీపీ సానుభూతి పరులే ఈ రథాన్ని తయారు చేయించినప్పుడు అదే పార్టీకి చెందిన వారు ఎందుకు నిప్పు పెడతారని ప్రజలు సూటిగా ప్రశ్నిస్తున్నారు. పక్కా ప్రణాళిక ప్రకారం టీడీపీ వారే రథానికి నిప్పు పెట్టి.. ఆ నెపం వైఎస్సార్సీపీ మద్దతుదారులపై నెట్టేలా వ్యూహం పన్నినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో గ్రామంలో ఇలాంటి సంఘటనలెన్నడూ జరగలేదని, టీడీపీ అధికారంలోకి వచ్చాకే ఇలాంటివి జరుగుతున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.సీఎం చెప్పిందొకటి..జరిగింది మరొకటి..కేసును నిష్పక్షపాతంగా విచారించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఒకవైపు చెప్పినప్పటికీ, మరోవైపు అందుకు భిన్నంగా జరుగుతోంది. దోషులు టీడీపీ వారేనని తేలినప్పటికీ, ఈ విషయాన్ని బహిర్గతం చేస్తే ప్రభుత్వానికి మచ్చ రావడం ఖాయమని, వైఎస్సార్‌సీపీపైకి నెపం నెట్టాలని టీడీపీ పెద్దలు చెప్పడంతో పోలీసులు జీ హుజూర్ అన్నట్లు సమాచారం. సీఎం వ్యాఖ్యలకు అర్థం ఇదేనని సర్వత్రా అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే అధికార పార్టీ నేతల మెప్పు కోసం పోలీసు యంత్రాంగం ఈశ్వర్‌రెడ్డిని అరెస్ట్ చేసి, అతను వైఎస్సార్సీపీ అని చెప్పడం గమనార్హం. పోలీసుల తీరు పట్ల గ్రామంలో ఎప్పుడేం జరుగుతుందోనని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.రథానికి నిప్పు ఘటనలో ఒకరి అరెస్ట్: ఎస్పీ జగదీష్అనంతపురం: అనంతపురం జిల్లా కణేకల్లు మండలం హనకనహాళ్ గ్రామంలో శ్రీరాముల వారి రథానికి నిప్పంటించిన కేసులో అదే గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు బి.ఈశ్వరరెడ్డిని అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ పి.జగదీష్ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. హనకనహాళ్లో ఈ నెల 23వ తేదీ అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తాళాలను పగులగొట్టి మండపంలోకి ప్రవేశించి.. రథంపై పెట్రోల్/కిరోసిన్ పోసి నిప్పు పెట్టారని తెలిపారు. వెంటనే గ్రామస్తులు మంటలు ఆర్పారని, అప్పటికే రథం ముందు భాగం కాలిపోయిందన్నారు. ఈ ఘటనపై కణేకల్లు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారన్నారు. ఘటనా స్థలంలో ఆధారాల సేకరించామని చెప్పారు. రథాన్ని 2022లో గ్రామానికి చెందిన ఎర్రిస్వామి రెడ్డి సోదరులు రూ.20 లక్షలు వెచ్చించి తయారు చేయించారని తెలిపారు. గ్రామంలో ఏ ఒక్కరి సహాయ సహకారాలు తీసుకోకుండా వారి కుటుంబ సభ్యులే రథాన్ని స్వయంగా తయారు చేయించారన్నారు. దీంతో గ్రామస్తుల్లో విభేదాలు ఏర్పడ్డాయని చెప్పారు. ఈ ఘటనలో గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బోడిమల్ల ఈశ్వర రెడ్డి పాత్ర ఉన్నట్లు తెలియడంతో అరెస్ట్ చేశామని స్పష్టం చేశారు. పోలీస్ కస్టడీలోకి తీసుకుని, ఈ నేరంలో ఇంకా ఎవరి పాత్రయినా ఉందా అనే అంశంపై విచారిస్తామన్నారు. -
ఫోటోగ్రాఫర్..!
చాలా ఏళ్ళ నా కల FRAMES ఫొటో స్టూడియో. ఆ రోజే ఓపెనింగ్. మా గురువుగారు విచ్చేసి స్టూడియోకి ఒక కాప్షన్‌ని కానుకగా ఇచ్చారు.‘There's more to life that meets the camera eye!’. ‘ఈ కాప్షన్కి అర్థమేంటి గురువు గారు?’ అడిగాను నేను.'You don't have to know everything. You'll know it when you see it' అన్నారాయన.ఆయన ఎందుకలా అన్నారో నాకు అప్పుడు అర్థం కాలేదు. ఎప్పటికైనా సరే, ఈ కాప్షన్ ఎందుకు పెట్టారో తెలుసుకోవాలనిపించింది. స్టూడియో ఓపెనింగ్ రోజున గంగిరెద్దుల్ని ఆడించే ఆయనొచ్చాడు. నాకు శుభసూచకంగా అనిపించింది. చిన్నప్పటి నుండి సంక్రాంతి వచ్చిందంటే చాలు వారితో వీధులు కళకళలాడిపోయేవి. అందుకే వారిని చూసినప్పుడల్లా శుభానికి చిహ్నాలుగా నా స్మృతిపథంలో మిగిలిపోయారు. ఆ గంగిరెద్దులాయన నా ముందు తన కోరికను వెలిబుచ్చాడు.‘బాబయ్యా, మా బసవణ్ణతో ఒక్క ఫొటో తీసిపెట్టవా? బసవడితో ఒక్క ఫోటో దిగాలన్న కోరిక అలాగే మిగిలిపోయుండాది.’నేను సమాధానం ఇచ్చేలోపే మా గురువుగారు అడ్డుపడ్డారు. ‘ఫ్రేమ్ అప్పర్స్ అని ఫ్రేమ్ డౌనర్స్ అని ఉంటారు. ఫొటోగ్రాఫర్ మొదటి ఫ్రేమ్ అందంగా ఉండాలి. రోజూ చూసే మొహాల్ని ఏం తీస్తాం చెప్పు’అంటూ నవ్వాడు ఆయనొక్కడే.ఆ గంగిరెద్దులాయనే కాదు నేను కూడా ఎంతగానో నొచ్చుకున్న సందర్భం అది. కానీ గురువుగా ఆయననే ఆహ్వానించాను కాబట్టి, ఆ రోజున ఆయన మాటకు ఎదురు చెప్పలేకపోయాను. బాధతో నిష్క్రమించిన ఆ గంగిరెద్దులాయన మాత్రం నా మస్తిష్కం అనే ఫొటోస్టూడియోలో ఫ్రేమ్‌గా మిగిలిపోయాడు.నేనొక ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్‌ని. పైగా నాస్తికుడిని కూడా. నాకు ఫొటోగ్రఫీ నేర్పించిన గురువుగారి ప్రభావం నాపై చాలా ఉండేది. ఆయన ఏం చేస్తే అది చేస్తూ ఉండేవాణ్ణి. ఆయన ఎథీస్ట్ అని తెలిసింది ఒక రోజున. ఆ ఇంగ్లిష్ పదానికి అర్థం తెలియకపోయినా నేనూ అదేనంటూ ప్రగల్భాలు పలికా నా మిత్రుడితో. అతను పరమ భక్తుడు. వెంటనే నవ్వేశాడు.‘ఎందుకు నవ్వుతున్నావ్?’ ‘ఆ పదానికి అర్థం కూడా తెలీకుండా నేనూ అదే అంటూవుంటే నవ్వొచ్చిందిరా!’‘అయినా దేవుడు ఎక్కడున్నాడురా? క్లాస్‌లో మన సర్ చెప్పింది వినలేదా? ఆయన లాజిక్ నూటికి నూరు శాతం కరెక్ట్. కనిపించని వాటిని నమ్మకపోవటమే నయం.’ ‘ఒకటి లేదు అంటున్నావంటేనే దాని ఉనికిని నువ్వు అంగీకరిస్తున్నట్టే లెక్క కదరా..‘‘అర్థం కాలేదు!’ ‘ఒకప్పుడు ఉండటం అంటూ జరిగితేనే కదా ఇప్పుడు లేకపోవటం అంటూ జరిగేది. ఒక వస్తువు ఇక్కడ పెట్టావు. అదిప్పుడు లేదు. ఒక అరగంట క్రితం ఇక్కడే ఉంది. ఇప్పుడు నీ ముందు లేదంతే. ఎక్కడో ఉంది. అది నీకు కనబడట్లేదు.’‘అర్థం అవుతున్నట్టే ఉంది. కానీ నువ్వు భక్తుడివి కాబట్టి నేను కన్విన్స్ అవ్వట్లేదురా..’ ‘ఉంది అన్నా, లేదు అన్నా దాని ఉనికిని అంగీకరిస్తున్నట్టే అవుతుంది కదరా! అసలు ఆ బ్రహ్మ పదార్థం ఉందో లేదో అనుభవం ఉన్నవాళ్లు చెప్పాలి. దైవత్వం అనుభవంలోకి వస్తే ఇంకా మాటలెందుకు మిగులుతాయి చెప్పు..? కాబట్టి వ్యర్థమైన వాదనలతో కాలాన్ని వృథా చేసుకోకు. ఆయన గురువే కావొచ్చు. ఆయన చెప్పిన దాంట్లో నీకు పనికొచ్చే విషయాల్ని మాత్రమే తీసుకో! అనవసరం అయిన వాటి జోలికి వెళ్ళకు. మిత్రుడిగా నీ మంచి కోరి చెబుతున్నా. ఇక నీ ఇష్టం!’వాడి మాటల్లో ఏం మాయ ఉందో తెలీదు కానీ, కేవలం ఫొటోగ్రఫీ పైనే దృష్టి పెడుతూ మిగతా విషయాల్ని పక్కన పెట్టేశాను. అప్పటి నుండి మంచి ఫొటోగ్రాఫర్ అవ్వటమే లక్ష్యంగా పనిచేశాను. అలాంటి నేను ఇప్పుడు చేతిలో పనిలేకుండా అయిపోయాను. రోజూ స్టూడియోకి వెళుతున్నాను. పని ఉండట్లేదు. దానికి కారణం స్మార్ట్‌ఫోన్ డిజిటల్ ఫొటోగ్రఫీ అని నా ప్రగాఢ నమ్మకం.ఇన్నేళ్లల్లో స్మార్ట్‌ఫోన్‌ని నేనెప్పుడూ వాడలేదు. ఎందుకో ఆ స్మార్ట్‌ఫోన్ భూతాన్ని చూస్తేనే చిరాకు. నాలాంటి ఎంతోమంది ఫొటోగ్రాఫర్లకు పనిలేకుండా చేస్తోంది. ఒకప్పుడు పాస్‌పోర్ట్ సైజు ఫొటో కోసం ఎగబడేవాళ్లు. ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌తోనే తీసి అప్లోడ్ చేసి పంపించేస్తున్నారు చాలామంది. ఒకప్పుడు ఫ్రెండ్స్ కలిసి గుర్తుగా ఫొటోలు దిగేవాళ్ళు మా స్టూడియోలో. మా స్టూడియోకొచ్చిన వాళ్లతో ఎటువంటి సంబంధం లేని ఒక ఫొటోగ్రాఫర్ తన నిర్మలమైన దృష్టితో ఒక ఫొటో తీస్తాడు. అంటే ఆ కాలాన్ని తన కంటితో బంధిస్తున్నాడు. ఆ క్షణానికి సొంతమైన ఒక నిజాన్ని ఫ్రేమ్ చేస్తున్నాడు. ఇది ఒక ఘనతే అనుకోవచ్చు. అలాంటి కళను మా నుండి దూరం చేసిన భావన కలిగింది ఈ స్మార్ట్‌ఫోన్ డిజిటల్ ఫొటోగ్రఫీ ఎక్కువైపోయాక! అందుకే నా జీవితంలో ఈ స్మార్ట్‌ఫోన్ భూతాన్ని దరిజేరనివ్వను అని శపథం చేశాను. అలాంటి నేను ఆ స్మార్ట్‌ఫోన్ చేతిలోనే అంత ఘోరంగా ఓడిపోతానని కలలో కూడా ఊహించలేదు.నాకు పొద్దున్నే న్యూస్ పేపర్ చదవటం అలవాటు. న్యూస్‌లో కూడా క్రైమ్ సెక్షన్ అంటే ప్రత్యేకమైన ఇంట్రెస్ట్. ఒకరోజు పొద్దున్నే ఒక క్రైమ్ న్యూస్ కవరేజ్ నన్ను అమితంగా ఆకర్షించింది. పుణేలోని ఒక డెలివరీ బాయ్ దాదాపు 15 లక్షలు విలువ చేసే 18 స్మార్ట్‌ఫోన్స్ చోరీ చేశాడు అన్నది ఆ వార్త. ఇదంతా ఒక రెండు నెలల వ్యవధిలో జరిగిందట.కస్టమర్స్ స్మార్ట్‌ఫోన్ ఆర్డర్ చేశాక రీప్లేస్మెంట్ పెట్టుకునే ఆప్షన్ ఒకటుంది. వాళ్లకి హ్యాండ్ సెట్ నచ్చని పక్షంలో! ఈ సదుపాయాన్ని ఆ డెలివరీ బాయ్ దుర్వినియోగం చేశాడు. ఆ డెలివరీ బాయ్ స్మార్ట్‌ఫోన్‌ని తనే దోచేసి, కస్టమర్ రీప్లేస్మెంట్ పెట్టినట్టుగా సృష్టించాడట! అలా హ్యాండ్ సెట్ రీప్లేస్మెంట్ ఉన్న కస్టమర్ల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూపోయే సరికి ఈ అబ్బాయి మీద అనుమానం పెరిగి చివరికి అరెస్ట్ చేశారు.క్రైమ్ న్యూస్ ఇప్పటికి చాలాసార్లు చదివాను. కానీ ఎప్పుడూ కలగని ఓ ఆలోచన ఈసారి మాత్రమే కలిగింది. నాకు కూడా స్మార్ట్‌ఫోన్ చోరీ చేద్దాం అనిపించింది. నేను ఇంతవరకు స్మార్ట్‌ఫోన్ వాడలేదు. ఇంట్లో వాళ్ళని కూడా అడగలేదు. ఇన్నేళ్లల్లో స్మార్ట్‌ఫోన్‌కు, నాకూ మధ్యనున్న ఒక తెలియని దూరం శతృత్వంగా స్థిరపడిపోయింది నా మదిలో. నాకు పనిలేకుండా చేసిన ఆ స్మార్ట్‌ఫోన్‌ని ఇంకొకరికి దూరం చేసి దానిపై నాకుండిపోయిన పగ సాధిద్దాం అనిపించింది.నాకు తెలిసిన ఒక డెలివరీ బాయ్ ఒకరోజు తను డెలివరీ చెయ్యాల్సిన ఐటమ్స్‌లో ఆ ఖరీదైన ఒక స్మార్ట్‌ఫోన్‌ని తీసుకుని అదేదో నా కోసమే అన్నట్టుగా మా స్టూడియోకొచ్చాడు. ‘అన్నా, ఇవ్వాళ వర్క్ లోడ్ ఎక్కువైపోయింది. అన్ని ఆర్డర్లు డోర్ డెలివరీ చేయగలిగాను కానీ చివరిగా ఒక్క స్మార్ట్‌ఫోన్ మిగిలిపోయింది. ఇది మీరు ఇంటికెళ్ళే దారిలోనే ఉన్న అడ్రస్. చాలా సందులు, గొందులు తిరగాలి. దయచేసి ఈ ఒక్కసారికి ఇచ్చేస్తావా?’ అని అడిగాడు. ‘సరే.. అడ్రస్ ఎక్కడన్నావ్?’‘అదే అన్నా.. మీ ఇంటి దగ్గర నేతి గారెల షాప్ బాగా ఫేమస్ కదా! ఆ సందులోనే చివరి ఇల్లు. శివుడి ఇల్లు అని అడిగితే ఎవరైనా చెబుతారంట మరి!’‘శివుడి ఇల్లా? అది కైలాసం కదా..’ అన్నాను.‘ఇంటి దొంగను ఈశ్వరుడు అయినా పట్టలేడు అంటారు. వీళ్ళ ఇంటికి ఆ ఇబ్బందేం లేదనుకుంటా’ అంటూ నవ్వాడు వాడు.స్మార్ట్‌ఫోన్ కొట్టేద్దామనే నా ఆలోచన పసిగట్టినట్టే సామెత చెప్పాడేంటీ అని ముచ్చెమటలు పట్టాయి నాకు. దేవుడనే వాడుండి.. జరగబోయేదాన్ని ఇలా ముందుగానే పలికిస్తాడా ఏంటీ.. అనిపించింది. ‘శివుడు ఆయన పేరా?’ మళ్ళీ అడిగాను.‘అదే తెలియట్లేదన్నా.. శివుడి ఇల్లు అని అడిగితే ఎవరైనా చెబుతారని ఇందాక కస్టమరే చెప్పాడు ఫోన్లో అక్కడికెళ్ళాక డౌట్ వస్తే నాకు కాల్ చెయ్’ అన్నాడు.నేను ధైర్యం చేశాను. స్టూడియో కట్టేసి ఆ స్మార్ట్‌ఫోన్ తీసుకుని రోజూ నేను వెళ్లే దారిలోనే వెళుతున్నాను. కానీ, అవ్వాళ నా మనసు మనసులో లేదు. ధ్యాస అంతా దొంగతనంపైనే ఉంది. నేను వెళ్లే దారిలో శివుడి గుడి ఒకటుంటుంది. ప్రతిరోజూ, అక్కడి నుండి ఏదో ఒకటి వినిపిస్తూనే ఉంటుంది. ఆరోజు మొట్టమొదటిసారి చెవులు రిక్కించి వింటున్నానో.. మరేంటో తెలియదు కానీ గుడిలో జరుగుతున్న ప్రవచనంలో నుండి కొన్ని మాటలిలా వినబడ్డాయి.. ‘ఎదుటివాడికి మోసం చెయ్యాలనే బుద్ధి పుట్టినప్పుడే మనం మోసం చేసేసినట్టు.ఏ కర్మ చెయ్యాలన్నా అది మనసులో నుండి పుట్టాలి. అలాంటి కర్మ చెయ్యాలి అనే ప్రేరణను బుద్ధి మనకిస్తుంది. అది మంచి అయినా.. చెడు అయినా! ఆ బుద్ధికి ప్రేరణను దేవుడే కలిగిస్తున్నాడనుకుంటాడు మనిషి. అందుకే, చెడు కూడా ఆయనే చేయిస్తున్నాడన్న భ్రమలో బతుకుతాడు. నిజానికి నువ్వు చేసే మంచికి ఆయన కారణం కాదు. నువ్వు చేస్తున్న చెడుకి ఆయన కారణం కాదు. ఎవరి కర్మానుసారం వారు ప్రవర్తిస్తూంటారు. భగవంతుడు మనలో ఉండే ఆత్మ చైతన్య శక్తి మాత్రమే!’ఆగి ఒక్క నిమిషం అటు వైపుగా చూశాను. నాలో ఉదయించబోయే కాంతికి ఆయన వాక్యాలు సంకేతాలుగా కనబడ్డాయి. అనుకోకుండా ఆ ప్రవచనకర్త వైపు చూశాను. లిప్త కాలమైనా సరే ఏదో తెలియని అలౌకిక స్థితి నెలకొన్నది నాలో. ఆ భావాన్ని ఏమంటారో చెప్పలేని మనఃస్థితి నాది. ఇన్ని విషయాలు నా గుండెకేం తెలుస్తాయి.. కన్నీటి రూపంలో వెల్లడయ్యాయి.జ్ఞానం వచ్చే లోపే అహం అడ్డొస్తుంది. అహం దహనం అయితే తప్ప అజ్ఞానం తొలగదు. అజ్ఞానం పూర్తిగా తొలిగితే తప్ప జ్ఞానం రాదు. అప్పుడు నాకదే జరిగింది. కన్నీళ్లు తుడుచుకుని సరాసరి ఆ నేతి గారెల షాప్ వరకు వెళ్లాను.. ఏ ఆలోచనను రానివ్వకుండా! అక్కడ ఒకతను కనిపించాడు. ‘శివుడి గారిల్లు తెలుసా అండి?’ అడిగానో లేదో ‘నేను ఆయనింటికే వెళుతున్నానండీ.. ఇంతకీ మీరెవరు?’ తిరిగి ప్రశ్నించాడు. ‘ఆయనకో పార్సెల్ ఇవ్వటానికి వచ్చానండీ..’ అని చెప్పేసి ఆ వస్తువును అక్కడే పెట్టేసి అక్కడి నుండి వెళ్ళిపోయాను భయం భయంగా. ఆయన నన్ను పిలుస్తున్నా సరే వెనక్కి తిరిగి చూడలేదు. కొంత దూరం నడిచాక మళ్ళీ వెనక్కి తిరిగొచ్చాను. నేతి గారెల షాప్‌లో చుట్టూ చూశాను. ఆయన కనబడలేదు. ఈసారి షాప్ ఓనర్ని శివుడి ఇల్లు చిరునామా అడిగాను. చెప్పాడు.ఆయన చెప్పిన వీధిలో వెళుతూంటే శివుడి ఇల్లు కనబడింది దూరం నుంచి. ఎవరో ఒకాయన ఒక వస్తువును ఆ ఇంటి ప్రహరీగోడపై ఉంచి మాట్లాడుతూన్నాడు. శివుడితోటే కాబోలు. ఆ వస్తువును గోడపై ఉంచిన విషయం మరిచిపోయి ఆయన, శివుడు ఇరువురూ ఇంట్లోకి కదిలారు. వెంటనే నేను నా ముఖం కనిపించకుండా చొక్కాని పైకి లాక్కుని.. మెల్లగా ఆ వస్తువును తీసుకుని అక్కడి నుండి పరిగెత్తాను. వెనక్కి తిరిగి చూడకుండా అలా చీకట్లో ఎంత సేపు పరిగెత్తానో తెలీదు. ఇంటికి చేరిపోయాను.శివుడి దగ్గరుండాల్సిన ఆ వస్తువు ఇప్పుడు నా దగ్గరుంది. తెరిచి చూశాను. స్మార్ట్‌ఫోన్.. నిజంగానే నా కంటికి భూతంలా కనిపించింది. చార్జింగ్ పెట్టి వాడదామనుకున్నాను. ఇప్పుడు దాన్ని చూస్తూంటే పరమశివుడి చేతిలో ఉండే డమరుకం గుర్తుకొస్తోంది. శివుడు అనే ఆ కస్టమర్ ఎలా ఉంటాడో తెలీదు. ఆయన దగ్గరుండాల్సిన వస్తువును నేను తస్కరించాను అనే భావనే నాకు నిద్రపట్టనివ్వట్లేదు. వెనక్కి తిరిగొచ్చి దొంగతనం చేసింది కేవలం స్మార్ట్‌ఫోన్ పై నాకున్న పగ, ద్వేషం వల్లనే. దొంగలించిన తర్వాత మాత్రం స్మార్ట్‌ఫోన్ మీదున్న నా పగ ఏమైందో నాకు అర్థం కాలేదు. దొంగతనం చేశానన్న భావన నన్ను కుంగదీయసాగింది.దేవుడిపై నమ్మకం లేకపోయినా ఈ రాత్రి గడిస్తే చాలురా దేవుడా అనుకున్నాను. అతికష్టం మీద నిద్రపట్టింది. నిద్రలో కల.. గంగిరెద్దులాయన నా ఫొటోస్టూడియోకొచ్చాడు. ‘బాబయ్యా, నా ఫొటో వచ్చినాది’ అన్నాడు.‘అవునా? ఎక్కడ? చూపించు..?’ అడిగాను. ‘ఇదిగో..’ అంటూ తన స్మార్ట్‌ఫోన్‌లో తను దిగిన సెల్ఫీని చూపిస్తూ ఆనందబాష్పాలతో నన్ను చూశాడు. ‘నేను, నా బసవడు’ అంటూ నా ముందే మరొక సెల్ఫీ దిగాడు. కెమెరా షట్టర్ సౌండ్ వచ్చింది. ‘రోజూ కనిపించే మేము ఎంత అందంగా వచ్చామో చూడయ్యా’ అన్నాడు నాతో.ఆ మాట ఎక్కడో గుచ్చుకుంది నాకు. సమాధానం బలంగా తెలుస్తున్నట్టు అనిపించినా ‘నీ పేరేంటి?’ అడిగాను.‘శివుడు’ నిండుగా నవ్వాడు. ‘ఇదే నా సిత్రం’ అంటూ ఆ సెల్ఫీని చూపించాడు. ‘వెళ్ళొస్తాను’ అంటూ నవ్వుతూ తన బసవడితో వెళ్తూ ఒకసారి వెనక్కి తిరిగి.. మా ఫొటోస్టూడియో బోర్డు చూసి ఆగిపోయాడు. నా దగ్గరికొచ్చి నాకు మాత్రమే వినబడేలా.. ‘There's more to life that meets the camera eye!’ అన్నాడు.మా గురువుగారు ఇచ్చిన ఆ కాప్షన్కి అర్థం ఇన్నాళ్లకి.. అది కలలో తెలిసింది. దిగ్గున లేచాను. మధ్యరాత్రని కూడా చూడకుండా నేతి గారెల షాప్ మీదుగా శివుడి ఇల్లున్న వీధికి చేరుకున్నాను. చీకటిగా ఉండటంతో శివుడి ఇల్లు అంత త్వరగా కనబడలేదు. నంబర్ 10 అన్న సంఖ్య గుర్తుండటంతో పదో నెంబర్ ఇల్లు కనబడే దాకా వెళ్లాను. అలా ఇంటి గేట్ దగ్గరికి వెళ్ళానో లేదో ఇంటి వరండా ముందరి జీరో బల్బ్ వెలిగింది. తలుపు తీస్తూ మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ ఒక వ్యక్తి గేట్ వైపుగా వస్తున్నాడు. నేను భయపడుతూన్నాను. నా ముఖం కనిపించకుండా గుడ్డ అడ్డుపెట్టుకుని ఉన్నాను. ఆ వ్యక్తి సరిగ్గా గేట్ దగ్గరికి చేరగానే స్ట్రీట్ లైట్ వెలిగింది. గేట్‌కి అటువైపునున్న ఆయన.. చేయి చాచాడు. నా చేతిలోని స్మార్ట్ ఫోన్‌ని ఆయనకు అందించాను.‘ఎప్పటి నుండో పాడైన మా వీధి దీపం ఇప్పుడే వెలిగింది. పోయిన వస్తువు తిరిగి చేరాల్సిన చోటికే చేరింది. చీకటి పడింది. ఇక వెళ్ళిపో బాబయ్యా..’ అన్నాడు. ఆ గంగిరెద్దులాయనే ఈ శివుడన్న విషయం నిర్ధారణయ్యి వెనుదిరుగుతున్న నాకు అప్పుడే జ్ఞానోదయం అయ్యింది. – ఈశ్వరచంద్రఇవి చదవండి: ఇది.. 'మట్టిదిబ్బ' అనుకుంటున్నారా!? -
ఏసీబీకి చిక్కిన మునిసిపల్ ఏఈ
విజయవాడస్పోర్ట్స్: ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ వర్క్ ఆర్డర్ కోసం రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఎన్టీఆర్ జిల్లా విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ ఇన్చార్జ్ ఏఈ తోట ఈశ్వర్‌కుమార్ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఈశ్వర్‌కుమార్ డివిజన్–4 వెహికల్ డిపో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయంలో ఇన్చార్జ్ ఏఈగా పని చేస్తున్నాడు. కార్పొరేషన్ పరిధిలోని న్యూ అజిత్‌సింగ్‌నగర్‌కు చెందిన ఏఎస్ ఎకో మేనేజ్మెంట్ ఇంజనీరింగ్ సొల్యూషన్ యజమాని షేక్ సద్దాంహుస్సేన్ నగరంలో ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించే వర్క్ ఆర్డర్ కోసం అగ్రిమెంట్ ప్రాసెస్ చేయాలని డివిజన్–4 వెహికల్ డిపో ఈఈ కార్యాలయానికి దరఖాస్తు చేసుకున్నారు. అగ్రిమెంట్ ప్రాసెస్ కోసం రూ.50 వేలను ఇవ్వాలని ఈశ్వర్‌కుమార్ పట్టుబట్టాడు. దీంతో సద్దాంహుస్సేన్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ అధికారులు వల పన్ని కార్యాలయంలోనే రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా ఏఈ ఈశ్వర్‌కుమార్‌ను సోమవారం అదుపులోకి తీసుకుని ఏసీపీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపర్చారు. -
మంత్రి ఈశ్వర్ వ్యాఖ్యలు హాస్యాస్పదం ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌పై రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని, కాంగ్రెస్ పార్టీ దళితులకు ఏం చేసిందని ప్రశ్నించడం విడ్డూరంగా ఉందని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే దళితుల సంక్షేమం అమలైందన్న విషయాన్ని ఈశ్వర్ గుర్తుంచుకోవాలని అన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంలో దళితులకు ఎన్ని ఇళ్లు ఇచ్చారో, గత మూడేళ్లలో ఎంతమందికి దళిత, బీసీ, మైనార్టీ బంధు పథకాలు అమలు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇళ్లు కట్టిన ప్రాంతాల్లో తాము ఓట్లు అడుగుతామని, బీఆర్ఎస్కు దమ్ముంటే డబుల్బెడ్రూం ఇళ్లు కట్టిన చోట్ల ఓట్లు అడగాలన్నారు. గత నాలుగేళ్లుగా ఏమీ పట్టించుకోకుండా ఎన్నికల ముందు హడావుడి చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వం పేదలకు ఒక్క రేషన్‌కార్డు కూడా ఇవ్వలేకపోయిందని విమర్శించారు. దళితుల జనాభా ఆధారంగా రిజర్వేషన్లు అమలు చేస్తామని కేసీఆర్ మాట తప్పారని, వాటిని తాము అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించడంతో ఆయన ఉలిక్కిపడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీని కాకుండా దళితులకు అన్యాయం చేసిన కేసీఆర్‌ను ఈశ్వర్ ప్రశ్నించాలని జీవన్‌రెడ్డి సూచించారు. -
ఐటం సాంగ్‌కు రీల్స్ చేయండి, లక్ష పట్టండి.. ఎప్పటివరకు పాల్గొనవచ్చంటే?
ఈశ్వర్, నయన సర్వర్ జంటగా నటించిన చిత్రం "సూర్యాపేట్ జంక్షన్ ". అభిమన్య సింగ్ ముఖ్య పాత్రలో నటిస్తుండగా పూజ ఐటమ్ సాంగ్‌లో కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్, టీజర్, మ్యాచింగ్ మ్యాచింగ్ లిరికల్ సాంగ్ విడుదలవగా మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలో కాలేజ్ సాంగ్‌ను, ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా పూర్తి చేసుకున్న "సూర్యా పెట్ జంక్షన్" మూవీనీ ఈ నెలాఖరులో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. చిత్రయూనిట్ మరిన్ని విశేషాలు వెల్లడిస్తూ.. 'ప్రమోషన్లో బాగంగా మ్యాచింగ్ మ్యాచింగ్ ఐటమ్ సాంగ్‌కు సోషల్ మీడియాలో ప్రకటించిన రీల్స్ పోటీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ కాంటెస్ట్ విజేతలను త్వరలోనే ప్రకటించి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒకరికి లక్ష రూపాయలు, మిగతా పది మందికి 10 వేల రూపాయల చొప్పున, అలాగే మరో పది మందికి 5 వేల రూపాయల చొప్పున అందివ్వనున్నాం. ఏప్రిల్ 25 వరకు ఈ పోటీలో పాల్గొనవచ్చు' అని ఈ చిత్ర యూనిట్ తెలిపింది. -
Hyderabad-Constable: ఈశ్వర్ లీలలు ఎన్నెన్నో..!
సాక్షి, హైదరాబాద్: నల్లగొండ పోలీసులు అరెస్టు చేసిన హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ కానిస్టేబుల్ మేకల ఈశ్వర్ లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తెలియక చోరీ సెల్ఫోన్లు ఖరీదు చేసిన వారిని బెదిరించడంతో మొదలైన ఇతడి వ్యవహారం స్నాచింగ్ గ్యాంగ్స్ నిర్వహించే వరకు వెళ్లింది. 2010 బ్యాచ్‌కు చెందిన ఈశ్వర్ ఆది నుంచీ వివాదాస్పదుడే. గడిచిన పుష్కరకాలంలో అతగాడు దాదాపు రూ.20 కోట్లకు పైగా విలువైన ఆస్తులు కూడగట్టాడని తెలుస్తోంది. ‘ఉద్యోగం ఉన్నా పోయినా నాకు పెద్ద ఫరక్ పడదు’ అంటూ ఇతగాడు సహోద్యోగుల్నే కాదు అధికారులనూ బెదిరించే వాడని సమాచారం. బెదిరింపు వసూళ్లతో మొదలై... ఈశ్వర్ టాస్క్‌ఫోర్స్‌లోకి రావడానికి ముందు ఎస్సార్‌నగర్, బేగంపేట సహా వివిధ పోలీసుస్టేషన్లలో పని చేశాడు. అప్పట్లో చోరీ ఫోన్లు ఖరీదు చేసిన వాళ్లను బెదిరించడంతో ఇతడి దందాలు మొదలయ్యాయి. ఇతగాడు తనకున్న పరిచయాలను వినియోగించుకుని తస్కరణకు గురైన ఫోన్ల ఐఎంఈఐ నెంబర్లు సేకరించే వాడు. వీటి ఆధారంగా అవి ప్రస్తుతం ఎవరు వాడుతున్నారో గుర్తించే వాడు. సెకండ్ హ్యాండ్ మార్కెట్లలో లభిస్తున్న సెల్ఫోన్లలో అనేకం చోరీ ఫోన్లు కూడా ఉంటున్నాయి. విషయం తెలియక ఇలాంటి చోట వాటిని ఖరీదు చేసి, వినియోగిస్తున్న వారి నెంబర్లు ఈశ్వర్ వద్దకు చేరేవి. ఆ ఫోన్లు వాడుతున్న వారిని పిలిపించుకునే ఇతగాడు ఫోన్ తీసుకోవడంతో పాటు కేసు పేరుతో భయపెట్టి కనీసం రూ.25 వేలు వసూలు చేసేవాడు. ఇలా రికవరీ చేసిన ఫోన్‌ను సైతం అమ్ముకుని సొమ్ము చేసుకునే వాడు. చదవండి: (సినీ నటి జీవిత టార్గెట్‌గా.. జియో పేరుతో టోకరా!) వసతులు, ‘జీతాలు’ ఇచ్చి నేరాలు... ఇలా చోరీ ఫోన్ల మార్కెట్‌పై ఇతడికి పట్టువచ్చింది. దీంతో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకల్లో ఉన్న స్నాచర్లతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. ఓ ప్రాంతానికి చెందిన వారిని మరోచోటుకు పంపేవాడు. అక్కడ వారికి అద్దె ఇంటిలో ఆవాసం కల్పించేవాడు. ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం నాలుగు స్నాచింగ్స్ చేయాలని టార్గెట్ పెట్టేవాడు. వీటిలో ఒక ఫోన్‌ను వారికి జీతంగా లెక్కించి దాని విలువకు సమానమైన మొత్తాన్ని వారికి ఇచ్చేవాడు. ఈ చోరీ ఫోన్లను విక్రయించడానికి ఈ నాలుగు రాష్ట్రాల్లో ఉన్న సెకండ్ హ్యాండ్ మార్కెట్లలోని వ్యాపారులతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. వీరి నుంచీ ప్రతి నెలా మామూళ్లు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. దేవాలయాలు, పబ్లిక్ మీటింగ్స్ జరిగే ప్రాంతాలనే ఎక్కువగా టార్గెట్ చేయించే ఈశ్వర్ సెల్ఫోన్లతో పాటు బంగారు నగలను స్నాచింగ్ చేయించే వాడు. ఒక్కో సీడీఆర్ రూ.50 వేలకు విక్రయం... దొంగల ముఠాకు నాయకుడిగా ఉన్న ఈశ్వర్ మరో దందా కాల్ డిటైల్ రికార్డ్స్ (సీడీఆర్) విక్రయమని తెలుస్తోంది. వీటిని పొందాలంటే ఉన్నతాధికారుల ఈ–మెయిల్ నుంచి సర్వీస్ ప్రొవైడర్‌కు అభ్యర్థన వెళ్లాల్సిందే. అయితే ఈశ్వర్‌కు మాత్రం ఇవి చాలా తేలిగ్గా వచ్చి చేరుతున్నాయని సమాచారం. చోరులకు సంబంధించిన సీడీఆర్‌ల ద్వారా వారి నుంచి సొత్తు కొనే రిసీవర్లను గుర్తిస్తున్న ఇతగాడు బెదిరింపు వసూళ్లకు పాల్పడుతున్నాడు. వీటి ద్వారానే కొత్త చోరుల వివరాలు తెలుసుకుని వారి తనకు అనుకూలంగా వాడుకునే వాడు. అలాగే కొన్ని డిటెక్టివ్ ఏజెన్సీలకు ఒక్కో సీడీఆర్‌ను రూ.50 వేలకు అమ్ముతున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. ఇలా అనేక అక్రమాలకు పాల్పడిన ఈశ్వర్ రూ.20 కోట్లకు పైగా కూడగట్టిన ఆస్తుల్లో అనేకం బినామీ పేర్లతోనే ఉన్నాయని తెలిసింది. ఇతడిని సస్పెండ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న అధికారులు అంతర్గత విచారణ మొదలెట్టారు. -
కానిస్టేబుల్ ఈశ్వర్.. ఇతని రూటే సెపరేటు.. దొంగలతో చేతులు కలిపి
సాక్షి, హైదరాబాద్: ప్రజలను రక్షించే బాధ్యత పోలీసులదే. ఎక్కడ ఏ అన్యాయం, నేరం జరిగినా ముందుండేది ఖాకీలే. సమాజంలో శాంతి భద్రతలను కాపాడటంలో వీరిదే కీలక పాత్ర. పోలీస్ వృత్తికి, యూనిఫామ్‌కు ఉన్న గౌరవం అలాంటిం. అయితే అభాగుల్యకు, బాధితులకు న్యాయం చేయాల్సిన పోలీసులే దారితప్పుతున్నారు. తక్కువ కాలంలో కోట్లు సంపాదించాలనే దురుద్దేశంతో అక్రమ మార్గాలు తొక్కుతున్నారు. నేరస్తుల పంచన చేరి తోడు దొంగలుగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి కోవకు చెందిన వ్యక్తే కానిస్టేబుల్ ఈశ్వర్.. వృత్తి పోలీస్ అయినా చేసేవన్నీ దొంగ పనులు. ప్రస్తుతం హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ విభాగంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. హఫీజ్‌పేటలో నివాసముంటున్న ఈశ్వర్ స్వస్థలం ఏపీలోని బాపట్ల జిల్లా స్టూవర్ట్‌పురం. గౌరవనీయమైన పోలీస్ వృత్తిలో ఉంటూ దొంగలతో చేతులు కలిపి నెలసరీ మామూళ్లు వసూళ్లు చేయడం ప్రారంభించాడు. కొన్నేళ్లకు ఈశ్వర్ ప్రవర్తన మీద ఉన్నతాధికారులకు అనుమానం రావడంతో పోలీస్ ఆపరేషన్స్‌కు దూరంగా పెట్టారు. టాస్క్‌ఫోర్స్ విభాగానికి అటాచ్ చేశారు. ముఠా నేతగా అయినా ఈ కానిస్టేబుల్ తన వక్ర బుద్దిని మార్చుకోలేదు. అంతేనా రూటు మార్చి కొత్త పద్దతులో డబ్బు సంపాదనకు శ్రీకారం చుట్టాడు. ఇబ్బందుల్లో ఉన్న వారికి ఆర్థిక సాయం చేస్తూ ఆ కుటుంబంలో ఉన్న యువకులు, మైనర్లను తన ఇంటికి తీసుకొచ్చేవాడు. వీరందరితో ఓ ముఠా ఏర్పాటు చేసి చోరీలకు పథకాన్ని రచించేవాడు. ఆ గ్యాంగ్‌కు లీడర్‌గా వ్యవహరించేవాడు. వారితో దొంగతనాలు, చైన్ స్నానింగ్లు వంటివి చేయించేవాడు. దొంగతనం చేసిన సొమ్ము లక్షల్లో అతని చేతిలోకి రాగానే ఒక్కొక్కరికి రూ. 40 వేల నుంచి 50 వేల వరకు చెల్లించి చేతులు దులుపుకునేవాడు. మాయమాటలు చెప్పి బెయిల్ ఒకవేళ దొంగలు పోలీసులకు పట్టుబడితే తానే స్వయంగా రంగంలోకి దిగుతాడు. పట్టుబడిన నిందితులు తనకు కావాల్సిన వారని, దగ్గరి బంధువులంటూ ఏదో మాయమాటలు చెప్పి వారిని కేసు నుంచి తప్పించడం, బెయిల్‌పై బయటకు తీసుకురావడం చేసేవాడు. అంతేగాకుండా అంతరాష్ట్ర దొంగలను పట్టుకునేందుకు బయల్దేరగానే వారికి ముందుగానే సమాచారమిచ్చి తప్పించుకునేలా సహకరించేవాడని కూడా ఈశ్వర్‌పై ఆరోపణలున్నాయి. చదవండి: Hyderabad: టీచర్ల నిర్వాకం.. విద్యార్థులతో పారిశుద్ధ్య పనులు..! అధికారుల పరిచయాలతో చివరికి ఈశ్వర్ చోరీలు, దోపిడీలకు పాల్పడుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇప్పటికే అతనిపై చీరాల, బేగంపేట, హుమాయిన్‌నగర్ తదితర పోలీస్ స్టేషన్లో గృహహింస, కిడ్నాప్ కింద కేసులు నమోదైనట్లు గుర్తించారు. దీంతో ఐదుసార్లు సస్పెన్షన్ వేటు వేశారు. అయితే తనకున్న ఉన్నతస్థాయి అధికారుల పరిచయాలతో నెలల వ్యవధిలోనే మళ్లీ కొలువులో చేరేవాడు. నల్గొండ పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు కూడా సీఐ..ఏ సీపీ స్థాయిలో ఉన్న అధికారులను బదిలీ చేయించగల సత్తా తనకుందని.. తాను దొంగతనం చేయం ఏంటని బుకాయించి తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. ఇతడు చేసే నేరాల్లో మరో కానిస్టేబుల్ కూడా సహకరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అతనిపై కూడా పోలీసులు అంతర్గత విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది. వీరిద్దరిపై శాఖపరమైన చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులు సిద్ధమవుతునట్లు సమాచారం -
ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అవుతాడని ఊహించలేదు: కృష్ణం రాజు
ప్రభాస్ తొలి సినిమా(ఈశ్వర్) చూశాక తప్పకుండా పెద్ద హీరో అవుతాడని అనుకున్నాం కానీ.. పాన్ ఇండియా స్టార్ అవుతాడని ఊహించలేదు. అతని పట్టుదల, శ్రమతో పాటు అభిమాలను అండదండలతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. ప్రభాస్‌ని చూస్తుంటే గర్వంగా, ఆనందంగా ఉంది’అని రెబల్ స్టార్ కృష్ణంరాజు అన్నారు. ప్రభాస్ హీరోగా తొలిసారి కెమెరా ముందుకు వచ్చి సరిగ్గా నేటితో( జూన్ 28) 20ఏళ్లు పూర్తయింది. 2002 జూన్ 28న రామానాయుడు స్టూడియోలో ప్రభాస్ హీరోగా పరిచయం అవుతూ ఈశ్వర్ అనే సినిమాని మొదలుపెట్టారు. (చదవండి: అది చెత్త సినిమా.. దానివల్ల ఏడాది పాటు ఆఫర్స్ రాలేదు: పూజా హెగ్డే) ప్రభాస్ హీరోగా అడుగుపెట్టి నేటికీ 20 ఏళ్ళు పూర్తవడంతో అయన అభిమానులు ఈ ఇరవై ఏళ్ల ఆనందాన్ని సంబరంగా జరుపుకున్నారు. ఆలిండియా రెబెల్ స్టార్ కృష్ణం రాజు, ప్రభాస్ ఫాన్స్ అధ్యక్షడు జె ఎస్ ఆర్ శాస్త్రి ( గుంటూరు ) ఆధ్వర్యంలో మంగళవారం రోజు హైద్రాబాద్ లో కృష్ణం రాజు ఇంట్లో ఈ సెలెబ్రేషన్స్ జరిగాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కొందరు అభిమానులతో పాటు ఈశ్వర్ సినిమాను తెరకెక్కించి, ప్రభాస్ ని హీరోగా పరిచయం చేసిన దర్శకుడు జయంత్ సి పరాన్జీ, నిర్మాత అశోక్ కుమార్ లతో పాటు రెబెల్ స్టార్ కృష్ణం రాజు పాల్గొన్నారు. ఈ సందర్బంగా కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్బంగా రెబెల్ స్టార్ కృష్ణం రాజు మాట్లాడుతూ .. ప్రభాస్ హీరోగా పరిచయం అయి అప్పుడే 20 ఏళ్ళు గడచిపోయాయా అన్న సందేహం కలుగుతుంది . నిజంగా ఆ రోజు ప్రభాస్ ని హీరోగా పరిచయం చేద్దామని ముందు మేమె అనుకున్నాం. మా గోపి కృష్ణ బ్యానర్ లో ప్రభాస్ ని పరిచయం చేయాలనీ అనుకున్న తరువాత ఒకరోజు నిర్మాత అశోక్ కుమార్, దర్శకుడు జయంత్ వచ్చి ప్రభాస్ ని పరిచయం చేసే అవకాశం మాకు ఇవ్వమని అడిగారు. ఈశ్వర్ కథ చెప్పినప్పుడు బాగా నచ్చింది. మంచి మాస్ ఎలిమెంట్స్ ఉన్న కథ, తప్పకుండా అందరికి బాగా నచ్చుతుందన్న నమ్మకంతో అశోక్ కుమార్ కు ఓకే చెప్పాం. జయంత్, అశోక్ ఇద్దరు కలిసి ఎంతో బాధ్యతగా తీసిన ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుని ప్రభాస్ ని హీరోగా నిలబెట్టింది. ప్రభాస్ మొదటి సినిమా చూసాకా తప్పకుండా పెద్ద హీరో అవుతాడని అనుకున్నాం కానీ ఎవరు ఊహించని విధంగా ఇలా పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడంటే అతని శ్రమ, పట్టుదల ముఖ్యంగా మా అభిమానుల అండదండలు ఉన్నాయి. ప్రభాస్ ని చుస్తే చాలా ఆనందంగా ఉంది. ఒక నటుడిగానే కాకుండా సాటివారి పట్ల సహాయం చేసే గొప్ప గుణం ఉంది. ప్రభాస్ ఇంకా ఇలాగే మరింత ఎత్తుకు ఎదగాలని మంచి విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నాను ’అన్నారు. -
నటనపై ఇష్టంతో జాబ్ వద్దనుకున్నా
ఈశ్వర్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘4 లెటర్స్’. టువ చక్రవర్తి, అంకిత మహారాణా కథానాయికలుగా నటించారు. ఆర్.రఘురాజ్ దర్శకత్వంలో దొమ్మరాజు హేమలత, దొమ్మరాజు ఉదయ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది. ఈశ్వర్ మాట్లాడుతూ– ‘‘బీబీఏ డిగ్రీ పూర్తి చేశాను. మంచి జాబ్ ఆఫర్స్ వచ్చాయి. కానీ నటనపై ఇష్టంతో సినిమా రంగంవైపు వచ్చాను. వైజాగ్‌లో సత్యానంద్‌గారి వద్ద మూడు నెలలు శిక్షణ తీసుకున్నాను. ‘4 లెటర్స్’ చిత్రానికి వస్తే... ఇంజినీరింగ్ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యంలో ఉంటుంది. విజువల్‌గా సినిమాలో ఎటువంటి వల్గారిటీ లేదు. కొన్ని డైలాగ్స్‌తో కామెడీ క్రియేట్ చేశామంతే. ప్రతిభావంతులైన రఘురాజ్గారి దర్శకత్వంలో నా తొలి సినిమా చేయడం హ్యాపీగా అనిపించింది. ఆయన దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాను. ఈ సినిమాను మా నాన్నగారు (దొమ్మరాజు ఉదయ్‌కుమార్) నిర్మిస్తారని నాకు ఫస్ట్ తెలియదు. ప్రీ–ప్రొడక్షన్ వర్క్స్ పూర్తయిన తర్వాత ఈ విషయం చెప్పగానే సర్ప్రైజ్ అయ్యాను. సురేష్ ఉపాధ్యాయ రాసిన లిరిక్స్‌కు భీమ్స్ మంచి సంగీతం అందించారు. ఈ సినిమాలోని ఉందా లేదా? పాటను పాడాను. మా ట్రైలర్‌ను హీరో వెంకటేష్‌గారు చూసి నన్ను అభినందించడం మర్చిపోలేను. ఒక నటుడికి ఉండవలసిన లక్షణాల గురించి చెబుతూ ఆయన నాకో యాక్టింగ్ క్లాస్ ఇచ్చారు. అది నా కెరీర్‌కి హెల్ప్ అవుతుంది. నా తర్వాతి చిత్రం గురించి త్వరలో చెబుతా’’ అని అన్నారు. -
యూత్‌ని ఆకట్టుకునేలా ‘4 లెటర్స్’
ఓం శ్రీ చక్ర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.1గా ఉదయ్ కుమార్ దొమ్మరాజు , ఆర్. రఘురాజ్ దర్శకత్వంలో ‘4 లెటర్స్’ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 22న విడుదలకు సిద్దమైంది. ఈ సందర్భంగా హీరో ఈశ్వర్ మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు... గతేడాది వైజాగ్ సత్యానంద్ గారి వద్ద మూడు నెలల పాటు యాక్టింగ్ లో శిక్షణ తీసుకున్నాను. వారి దగ్గరే సినిమా గురించి, యాక్టర్‌కి కావాల్సిన డిసిప్లేన్, డెడికేషన్ తో పాటు యాక్టర్ చేయాల్సిన హార్డ్ వర్క్ గురించి తెలుసుకున్నాను. అలాగే యుఎస్ లో ఉన్నప్పుడు స్టేజ్ ప్రోగ్రామ్స్ కూడా చేశాను. ఆ అనుభవం ఈ సినిమాకు చాలా హెల్పయింది. నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యాక... ఇండియా కెళ్లి నా సినిమా ట్రైల్స్ నేను చేసుకుంటాను అని మా ఫ్యామిలీతో చెప్పాను. మా ఫ్యామిలీ కి కూడా సినిమాలంటే చాలా ఇంట్రస్ట్ ఉండటంతో ఓకే అన్నారు. సరే ఎవరో ఎందుకు మనమే ఒక బేనర్ పెట్టి సినిమా చేద్దాం అని ఈ సినిమా చేశారు. రఘురాజ్ గారు ఫుల్ స్క్రిప్ట్, లొకేషన్స్, షెడ్యూల్స్ తో సహా వచ్చి కలిసారు. ఫస్ట్ సిటింగ్ లో వారి క్లారిటీ అందరికీ నచ్చడంతో ఓకే చేశాం. అందులో తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో పది సినిమాలకు పైగా చేశారు. అంత ఎక్స్పీరియన్స్ ఉన్న దర్శకుడితో సినిమా చేస్తే బావుంటుందనిపించింది. నేను ఈ సినిమాకు డబ్బింగ్ చెప్పానన్నా, మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వగలిగానన్నా రఘురాజే గారే కారణం. కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో జరిగే కథ ఇది. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ లైఫ్ ఎలా ఉంది. ఏంటి? అన్న కథాంశానికి లవ్, ఎంటర్ టైన్ మెంట్ మిక్స్ చేసి ‘4లెటర్స్’ సినిమాను తెరకెక్కించారు. స్టూడెంట్స్ తలచుకుంటే ఏమైనా చేయగలరు అనే సందేశంతో సినిమా రూపొందింది. యూత్‌ను ఆకట్టుకునే అంశాలు చాలా ఉన్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా సినిమా ఉంటుంది. క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. చాలా కంఫర్ట్ గా అనిపించింది. ఇంట్లోనే నాన్న, బాబాయి అన్నట్టు ఉండేవాళ్లం. సెట్స్ మీదకు వెళితే... చాలా ఫ్రొఫెషనల్ గా ఉండేవాళ్లం. మా ఫాదరే ప్రొడ్యూసర్ కావడంతో ఫస్ట్ నుంచి ప్రొడక్షన్ గురించి తెలుసుకునే అవకాశం కలిగింది. ప్రతీది ప్లానింగ్ ప్రకారం వెళ్లడంతో ఎక్కడ మనీ వేస్ట్ కాకుండా అనుకున్న టైమ్ కు సినిమా తీయగలిగాం. బెంగాల్ టైగర్, పేపర్ బాయ్, గరుడవేగ (డియో డియో) చిత్రాలకు పని చేసిన భీమ్స్ గారు మా సినిమాకు మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తోంది. అలాగే ఆర్ ఆర్ కూడా అద్భుతంగా ఇచ్చారు. అలాగే సినిమాటోగ్రఫీ, గణేష్ మాస్టర్ కొరియోగ్రఫీ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. విక్టరీ వెంకటేష్ గారికి ట్రైలర్ చూపించాం. మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. చాలా అడ్వైజెస్ కూడా ఇచ్చారు. మాట్లాడిన కొద్దిసేపైనా ఒక యాక్టింగ్ క్లాస్ లా అనిపించింది. ఈ నెల 22న రిలీజ్ చేస్తున్నాం. కొంచెం టెన్షన్ అయితే ఉంది. హిట్టయితే నాన్నకు నేనిచ్చే రిటన్ గిఫ్ట్ ఈ సినిమా అవుతుంది. -
4 లెటర్స్ హిట్ కావాలి
ఈశ్వర్ హీరోగా, టువ చక్రవర్తి, అంకిత మహారాణా హీరోయిన్లుగా ఆర్. రఘురాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘4 లెటర్స్’. ‘కుర్రాళ్ళకి అర్థమవుతుందిలే’ అన్నది ఉప శీర్షిక. దొమ్మరాజు హేమలత, దొమ్మరాజు ఉదయ్‌కుమార్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22న విడుదలవుతోంది. ఈ సినిమా టీజర్, ట్రైలర్లను హీరో వెంకటేశ్ చూసి, కథానాయకుడు, దర్శక, నిర్మాతలను అభినందించారు. ఈ సినిమా మంచి హిట్ కావాలని ఆకాంక్షించారు. దొమ్మరాజు హేమలత, దొమ్మరాజు ఉదయ్‌కుమార్ మాట్లాడుతూ– ‘‘ఓం శ్రీచక్ర క్రియేషన్స్ పతాకంపై నిర్మించిన తొలి చిత్రమిది. మా సినిమా టీజర్‌ని దర్శకులు రాఘవేంద్రరావుగారు విడుదల చేయటం మాకెంతో ఆనందంగా ఉంది. కమర్షియల్ హంగులతో యూత్ సహా అన్ని వర్గాలను ఆకట్టుకునే ఎంటర్టైనర్గా ఈ సినిమా రూపొందించాం’’ అన్నారు. ‘‘కలుసుకోవాలని’ సినిమా తర్వాత తెలుగులో నేను డైరెక్ట్ చేసిన చిత్రం ‘4 లెటర్స్’. ప్రేమ, పెళ్లి విషయాల్లో నేటితరం ఆలోచనలు, అభిప్రాయాలు, వాస్తవాలు ఏమిటనే విషయాలను వాస్తవానికి దగ్గరగా ఉండేలా చిత్రీకరించాం. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు ఆలోచన రేకెత్తించేలా సినిమా ఉంటుంది’’ అని ఆర్. రఘురాజ్ అన్నారు. ‘‘మా సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు ఈశ్వర్. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: చిట్టిబాబు.కె. -
‘4 లెటర్స్’ విజయవంతం కావాలి : వెంకటేష్
ఓం శ్రీ చక్ర క్రియేషన్స్ బ్యానర్ ప్రొడక్షన్ నెం.1గా రూపొందుతోన్న చిత్రం ‘4 లెటర్స్’. ఈశ్వర్, చక్రవర్తి, అంకిత మహారాణా హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని ఆర్.రఘురాజ్ దర్శకత్వంలో దొమ్మరాజు హేమలత, దొమ్మరాజు ఉదయ్‌కుమార్ నిర్మిస్తున్నారు. ప్రముఖ కథానాయకుడు విక్టరీ వెంకటేష్ టీజర్, ట్రైలర్‌ను చూసి చిత్ర కథానాయకుడు, దర్శక, నిర్మాతలను అభినందించి, చిత్రం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ ట్రైలర్‌ను ఈ రోజు (మంగళవారం) సాయంత్రం విడుదల చేయనున్నారు. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ‘A ’ సర్టిఫికెట్ ను పొందింది. ఫిబ్రవరి 22 న చిత్రం ను విడుదల చేస్తున్నట్లు నిర్మాత ఉదయ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా... నిర్మాతలు దొమ్మరాజు హేమలత, ఉదయ్‌కుమార్ మాట్లాడుతూ - ‘మా బ్యానర్లో నిర్మిస్తోన్న తొలి చిత్రం 4 లెటర్స్. ఈ చిత్రం టీజర్ ను సుప్రసిద్ధ దర్శకులు శ్రీ రాఘవేంద్ర రావు గారు విడుదల చేయటం మాకెంతో ఆనందంగా ఉంది. ఆయనకు కృతఙ్ఞతలు. చిత్రం ద్వారా ఈశ్వర్‌ను హీరోగా పరిచయం చేయడం ఆనందంగా ఉంది. చాలా చక్కగా నటించాడు. సత్యానంద్‌గారి వద్ద శిక్షణ తీసుకున్న ఈశ్వర్.. ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశాడు. కమర్షియల్ హంగులతో యూత్ సహా అన్నీ వర్గాలను ఆకట్టుకునే ఎంటర్టైనర్గా ఈ సినిమా రూపొందించాం అన్నారు. హీరో ఈశ్వర్ మాట్లాడుతూ.. ‘విక్టరీ వెంకటేష్ గారి ఆశీస్సులు అందుకోవటం ఎంతో ఆనందంగా ఉంది. చిత్రం కూడా ప్రేక్షకాదరణకు నోచుకుంటుందనే నమ్మకం ఉందని అన్నారు. దర్శకుడు ఆర్.రఘురాజ్ మాట్లాడుతూ ‘కలుసుకోవాలని తర్వాత తెలుగులో నేను డైరెక్ట్ చేసిన మూవీ ఈ 4 లెటర్స్. ఇది నేటితరం ప్రేమకథాచిత్రం. ప్రేమ, పెళ్లి విషయాలలో నేటితరం యువత ఆలోచనలు, అభిప్రాయాలు, వాస్తవాలు ఏమిటన్నది విషయాలను వాస్తవానికి దగ్గరగా ఉండేలా చిత్రీకరించటం జరిగింది. -
ఆ కష్టాలనుంచి పుట్టిన కథ
‘‘ఓ రోజు నేను హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్నప్పుడు క్యాబ్‌లో రాసున్న ఓ కొటేషన్ గురించి క్యాబ్ డ్రైవర్ని అడిగా. ‘నేను బీటెక్ చదివాను. ఉద్యోగం దొరక్క నెలకి రూ.10 వేలకి క్యాబ్ డ్రైవర్‌గా చేస్తున్నా. నాలాంటి వాళ్లు చాలామంది చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు.. ఇంజినీరింగ్‌కి విలువ లేదు’ అని చెప్పగానే ఆశ్చర్యపోయా’’ అని డైరెక్టర్ రఘురాజ్ అన్నారు. ఈశ్వర్ హీరోగా, అంకిత, టువ హీరోయిన్లుగా ఆర్. రఘురాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘4 లెటర్స్’. ‘కుర్రాళ్ళకి అర్థమవుతుందిలే..’ అన్నది ఉపశీర్షిక. దొమ్మరాజు హేమలత, దొమ్మరాజు ఉదయ్ కుమార్ నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా రఘురాజ్ మాట్లాడుతూ– ‘‘నాతో పైవిధంగా అన్న క్యాబ్ డ్రైవర్‌తో కొన్నిరోజులు ట్రావెల్ చేసి, ఇంజినీరింగ్ చేసిన వారి కష్టాలు తెలుసుకున్నాను. అలా ఈ స్టోరీ పుట్టింది. ఇంజినీరింగ్ స్టూడెంట్స్‌కి మా సినిమాలో ఒక మెసేజ్ కూడా ఉంటుంది. ‘లవ్ అట్ ఫస్ట్ సైట్’ అంటుంటారు. కానీ, అవన్నీ బ్రేకప్ అవుతున్నాయి. ‘లవ్ అట్ సెకండ్ లుక్’ అనే కొత్త కథాంశంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాం. మా సినిమా యూత్‌కే కాదు.. పెద్దవాళ్లకు కూడా నచ్చుతుంది. వంద సంవత్సరాల సినిమా చరిత్రలో ఎవరూ చేయని సాహసం మా సినిమాలో చేశాం. అది ఏంటన్నది సినిమా చూస్తేనే అర్థమవుతుంది. థాయిల్యాండ్‌లోని ప్రత్యేకమైన ప్రదేశాల్లో పాటలు షూట్ చేశాం. నేను ఏదడిగినా కాదనకుండా అన్నీ సమకూర్చుతూ మమ్మల్ని ముందుకు నడిపించిన మా నిర్మాతలు ఉదయ కుమార్, హేమలత గార్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు’’ అన్నారు. నిర్మాత ఉదయ్ కుమార్ పాల్గొన్నారు. -
ఇంజినీరింగ్ విద్యార్థులకు ఈ చిత్రం అంకితం
‘‘ఈశ్వర్‌కు హీరో కావాలనే గొప్ప కల ఉంది. ఆ కలను అతని తల్లి దండ్రులు ప్రోత్సహిస్తున్నారు. సినిమా ఫీల్డ్‌లోనే కాదు. ఏ రంగంలో అయినా తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఆశీర్వాదం లేకుంటే రాణించడం కష్టం’’ అని డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి అన్నారు. ఈశ్వర్ హీరోగా పరిచయమవుతోన్న చిత్రం ‘4 లెటర్స్’. ‘కుర్రాళ్ళకి అర్థమవుతుందిలే..’ అన్నది ఉపశీర్షిక. అంకిత, టువ హీరోయిన్లుగా నటించారు. ఆర్. రఘురాజ్ దర్శకత్వంలో దొమ్మరాజు హేమలత, దొమ్మరాజు ఉదయ్ కుమార్ నిర్మించారు. భీమ్స్ సిసిరోలియో స్వరపరచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. బ్యానర్ లోగోను నిర్మాత కిరణ్, ట్రైలర్‌ను ఎస్వీ కృష్ణారెడ్డి ఆవిష్కరించారు. ఆడియో బిగ్ సీడీని నిర్మాత అచ్చిరెడ్డి, ఎస్వీ కృష్ణారెడ్డి విడుదల చేశారు. ‘‘చిన్న చిత్రాలు హిట్టయితే ఇండస్ట్రీకి మంచిది. ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుంది’’ అన్నారు అచ్చిరెడ్డి. ఆర్. రఘురాజ్ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రాన్ని 75 రోజుల్లో పూర్తి చేశాం. టీమ్ ఎంతగానో సహకరించారు. ఇందులో మంచి సందేశం ఉంది. ఈ సినిమాను ఇంజినీరింగ్ స్టూడెంట్స్‌కి అంకితం ఇవ్వాలనుకుంటున్నాం. ఈ సినిమా సెకండాఫ్‌లో ఓ డిఫరెంట్ పాయింట్‌ను టచ్ చేశాం’’ అన్నారు. ‘‘ఇంజినీరింగ్ స్టూడెంట్స్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ఫిబ్రవరి 8న సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు ఉదయ్ కుమార్. ‘‘తొలి సినిమాలోనే అన్నపూర్ణమ్మ, పోసాని, సురేష్‌గార్ల వంటి సీనియర్ నటులతో నటించడం హ్యాపీ. ఈ చిత్రంలో మంచి పాత్ర చేశాను. సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు ఈశ్వర్. ‘మా’ అధ్యక్షుడు శివాజీ రాజా, నటుడు సురేశ్, కొరియోగ్రాఫర్ గణేశ్ మాస్టర్, గీత రచయిత చంద్రబోస్, నిర్మాత బెక్కెం వేణుగోపాల్, సంగీత దర్శకుడు భీమ్స్, అంకిత, టువ మాట్లాడారు. -
యువత మనోభావాలకు అద్దం పట్టేలా ఉంది
ఈశ్వర్, టువ చక్రవర్తి, అంకిత మహారాణా హీరో హీరోయిన్లుగా ఆర్. రఘురాజ్ దర్శకత్వంలో దొమ్మరాజు హేమలత, దొమ్మరాజు ఉదయ్‌కుమార్ నిర్మించిన చిత్రం ‘4 లెటర్స్’. ‘కుర్రాళ్ళకి అర్థమవుతుందిలే’ అనేది ఉపశీర్షిక. చిత్రీకరణ పూర్తయింది. ఈ నెల 30న ఆడియోను, వచ్చే నెల రెండో వారంలో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సినిమా టీజర్‌ను ప్రముఖ దర్శకులు కె. రాఘవేంద్రరావు విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘ప్రవాస భారతీయుడైన ఉదయ్‌కుమార్‌గారు నిర్మించిన ఈ చిత్రం టీజర్ యువతరం మనోభావాలకు అద్దం పట్టేలా ఉంది. సత్యానంద్ శిష్యరికం కాబట్టి హీరోగా ఈశ్వర్ చక్కని ప్రతిభ కనబరిచాడు. ఈశ్వర్‌కు ఉజ్వలమైన భవిష్యత్ ఉంది. ఉదయ్‌కుమార్–రఘురాజ్లు ఈ చిత్రంతో మంచి విజయాన్ని అందుకోవాలి’’ అని అన్నారు. ‘‘రాఘవేంద్రరావుగారి చేతులమీదుగా మా సినిమా టీజర్ విడుదల కావడం ఆనందంగా ఉంది. ఈశ్వర్ ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశారు’’ అన్నారు నిర్మాతలు. ‘‘రాఘవేంద్రరావుగారి చేతులమీదుగా మా సినిమా టీజర్ రిలీజ్ అవ్వడం శుభసూచికం. ప్రేమ, పెళ్లి విషయాల్లో నేటియువత ఆలోచనలు, అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? వాస్తవాలు ఏంటి? అనే అంశాలను సినిమాలో చూపించాం’’ అని రఘురాజ్ అన్నారు. భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకు సంగీతం అందించారు. -
బెజవాడలో రౌడీల హల్చల్.. హోటల్‌పై దాడి
-
బెజవాడలో రౌడీల హల్చల్.. హోటల్‌పై దాడి
విజయవాడ: నగరంలోని వన్‌టౌన్ పంజా సెంటర్లో రౌడీలు హల్చల్ సృష్టించిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. గతరాత్రి ఓ హోటల్లో పనిచేస్తున్న సిబ్బందిపై రౌడీలు కర్రలతో దాడిచేశారు. ఈ దాడిలో హోటల్లో పనిచేస్తున్న ఈశ్వర్ అనే వ్యక్తికి గాయాలయ్యాయి. దాంతో బాధితులు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గాయపడిన ఈశ్వర్ని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.