4 లెటర్స్‌ హిట్‌ కావాలి | 4 Letters Film Is Going To Be Successful | Sakshi
Sakshi News home page

4 లెటర్స్‌ హిట్‌ కావాలి

Feb 6 2019 5:56 AM | Updated on Feb 6 2019 5:56 AM

4 Letters Film Is Going To Be Successful - Sakshi

ఈశ్వర్‌ హీరోగా, టువ చక్రవర్తి, అంకిత మహారాణా హీరోయిన్లుగా ఆర్‌. రఘురాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘4 లెటర్స్‌’. ‘కుర్రాళ్ళకి అర్థమవుతుందిలే’ అన్నది ఉప శీర్షిక. దొమ్మరాజు హేమలత, దొమ్మరాజు ఉదయ్‌కుమార్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22న విడుదలవుతోంది. ఈ సినిమా టీజర్, ట్రైలర్‌లను హీరో వెంకటేశ్‌ చూసి, కథానాయకుడు, దర్శక, నిర్మాతలను అభినందించారు. ఈ సినిమా మంచి హిట్‌ కావాలని ఆకాంక్షించారు. దొమ్మరాజు హేమలత, దొమ్మరాజు ఉదయ్‌కుమార్‌ మాట్లాడుతూ– ‘‘ఓం శ్రీచక్ర క్రియేషన్స్‌ పతాకంపై నిర్మించిన తొలి చిత్రమిది.

మా సినిమా టీజర్‌ని దర్శకులు రాఘవేంద్రరావుగారు విడుదల చేయటం మాకెంతో ఆనందంగా ఉంది. కమర్షియల్‌ హంగులతో యూత్‌ సహా అన్ని వర్గాలను ఆకట్టుకునే ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందించాం’’ అన్నారు. ‘‘కలుసుకోవాలని’ సినిమా తర్వాత  తెలుగులో నేను డైరెక్ట్‌ చేసిన చిత్రం ‘4 లెటర్స్‌’. ప్రేమ, పెళ్లి విషయాల్లో నేటితరం ఆలోచనలు, అభిప్రాయాలు, వాస్తవాలు ఏమిటనే విషయాలను వాస్తవానికి దగ్గరగా ఉండేలా చిత్రీకరించాం. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు ఆలోచన రేకెత్తించేలా సినిమా ఉంటుంది’’ అని ఆర్‌. రఘురాజ్‌ అన్నారు. ‘‘మా సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు ఈశ్వర్‌. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో, కెమెరా:  చిట్టిబాబు.కె.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement