హోటల్‌లో 18 ఏళ్ల టీనేజ్‌ అమ్మాయితో స్టార్‌ హీరో.. | Kartik Aaryan And Rumoured Girlfriend Karina Kubiliute Stayed In Same Hotel | Sakshi
Sakshi News home page

హోటల్‌లో 18 ఏళ్ల టీనేజ్‌ అమ్మాయితో స్టార్‌ హీరో..

Jan 9 2026 7:20 PM | Updated on Jan 9 2026 7:37 PM

Kartik Aaryan And Rumoured Girlfriend Karina Kubiliute Stayed In Same Hotel

బాలీవుడ్‌ నటుడు కార్తిక్‌ ఆర్యన్‌ తెలుగువారికి కూడా బాగా పరిచయమే.. నటి శ్రీలీలతో ఆయన డేటింగ్‌లో ఉన్నారంటూ కొద్దిరోజుల క్రితం పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే, ఆ వార్తలను వారు ఖండించారు. అయితే, తాజాగా కార్తిక్‌ ఆర్యన్‌ డేటింగ్‌ గురించి బాలీవుడ్‌లో బిగ్‌ న్యూస్‌ వైరల్‌ అవుతుంది. UKకి చెందిన టీనేజ్ అమ్మాయి కరీనా కుబిలియుటే(18)తో కార్తీక్ ఆర్యన్ ప్రేమలో ఉన్నాడనే పుకార్లు వైరల్‌ అవుతున్నాయి. దీంతో అతను సోషల్‌మీడియాలో ఆమెను అన్‌ఫాలో చేసినట్లు తెలుస్తోంది.

35ఏళ్ల కార్తిక్‌ ఆర్యన్‌ టీనేజ్‌ అమ్మాయితో గోవా బీచ్‌లో కెమెరా కంటపడ్డారు. ఈ నెల ప్రారంభంలో ఇద్దరూ గోవాలోని సెయింట్ రెగిస్ హోటల్‌లో దాదాపు ఒకే సమయంలో బస చేశారని, కానీ.. వేర్వేరు గదుల్లో వారిద్దరూ ఉన్నారని సమాచారం.  సోషల్‌మీడియాలో వారు షేర్‌ చేసిన ఫోటోలలో సారూప్యత ఉండటంతో ఈ వార్తలు వెలుగులోకి వచ్చాయి. అయితే, UKకి చెందిన  కరీనా కుబిలియుటే వయసు 17ఏళ్లు మాత్రమేనని కొందరు అభిప్రాయ పడుతున్నారు. మైనర్‌ అమ్మాయితో డేటింగ్‌ చేయడం ఏంటి అంటూ కార్తిక్‌ ఆర్యన్‌కు మెసేజ్‌లు పెడుతున్నారు.

బాలీవుడ్‌ మీడియా నివేదిక ప్రకారం, కార్తీక్‌తో పాటు ఆ అమ్మాయి కూడా గోవాలోని సెయింట్ రెగిస్ హోటల్‌లో ఒకే సమయంలో అతిథులుగా ఉన్నారని ప్రకటించాయి. అయితే, ఇద్దరూ వేర్వేరు గదుల్లో బస చేశారని కథనాలు వచ్చాయి. డేటింగ్ పుకార్లు వెలువడిన తర్వాత, కరీనా తన ఇన్‌స్టాగ్రామ్ బయోలో, "నాకు కార్తీక్ తెలియదు, నేను అతని ప్రియురాలిని కాదు, నేను నా కుటుంబంతో సెలవులో ఉన్నాను" అని పేర్కొంది.  కొంత సమయం తర్వాత ఆమె తన బయోను "నాకు కార్తీక్ తెలియదు" అని రాసింది. ఆపై కరీనా తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లకు కామెంట్స్‌ను ఆపేసింది. కానీ, కార్తిక్‌ ఆర్యన్‌ మాత్రం ఎలాంటి వివరణ ఇవ్వలేదు.

సండే గార్డియన్ నివేదిక ప్రకారం, కరీనా UK లోని కార్లైల్ కాలేజీలో చదువుతోంది. ఆమె చీర్లీడర్ కూడా. ఆమె వయస్సు ముఖ్యంగా అందరి దృష్టిని ఆకర్షించిందని పేర్కొంది. కరీనాకు 18 సంవత్సరాలు, కార్తీక్ ప్రస్తుతం 35 సంవత్సరాలు అని అందులో తెలిపింది. గతంలో, కార్తీక్ ఆర్యన్ సారా అలీ ఖాన్, అనన్య పాండే, పష్మీనా రోషన్, శ్రీలీల, జాన్వీ కపూర్‌లతో సహా పలువురు నటీమణులతో డేటింగ్‌లో ఉన్నాడని వార్తలు వచ్చాయి.

కార్తీక్‌ ఆర్యన్‌ విషయానికి వస్తే.. ప్యార్‌ కా పంచనామా, లూకా చుప్పీ, పతీ పత్నీ ఔర్‌ ఓ, భూల్‌ భులయ్యా 2, భూల్‌ భులయ్యా 3, షెహజాదా(అల వైకుంఠపురములో హిందీ రీమేక్‌), లూకా చుప్పి, ధమాకా.. ఇలా అనేక సినిమాలతో టాప్‌ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఇటీవల కార్తీక్‌ 'తూ మేరీ మైన్‌.. తేరా మైన్‌ తేరా తు మేరీ' మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే బాక్సాఫీస్‌ వద్ద ధురంధర్‌ హవా కారణంగా ఈ సినిమా నిలదొక్కుకోలేకపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement