ఓటీటీలోకి మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా 'కాలమ్‌కావల్' రానుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. స్టార్ హీరో మమ్ముట్టి, సైకో పాత్రలో నటించిన ఈ మూవీ.. డిసెంబరు 5న థియేటర్లలో రిలీజై హిట్ అయింది. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబట్టింది. ఇందులో మమ్ముట్టితో పాటు 'జైలర్' ఫేమ్ వినాయకన్ కీలక పాత్ర చేశాడు.

మలయాళ బ్లాక్ బస్టర్ సినిమా 'కాలమ్‌కావల్' జనవరి 16న సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, హిందీలో విడుదల కానుంది. ఈ మేరకు తాజాగా ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. జితిన్ కె.జోసే దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది. 2025లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన జాబితాలో ఈ చిత్రం టాప్-5లో ఉంది.
'కాలమ్‌కావల్' విషయానికొస్తే.. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. కేరళ - తమిళనాడు సరిహద్దు గ్రామాల్లో మహిళలు వరుసగా హత్యలకు గురౌతుంటారు. ఒకప్పుడు సంచలనంగా మారిన ఈ కేసు సినిమాతో మరోసారి వెలుగులోకి వచ్చింది. పైకి సౌమ్యుడిగా కనిపించే స్త్రీ లోలుడు.. సైకో కిల్లర్‌గా మారి అమ్మాయిల్ని, మహిళల్ని చంపేస్తుంటాడు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఓ పోలీస్ ఆఫీసర్ కనుక్కొనే విస్తుపోయే నిజాలు ఏంటనేది మెయిన్ స్టోరీ. సైకోగా మమ్ముట్టి కనిపించగా.. పోలీస్‌గా వినాయకన్ చేశాడు. ఒకప్పుడు దేశంలో సంచలనం సృష్టించిన సైనేడ్ మోహన్ స్టోరీని ఈ సినిమా కోసం కొంచెం స్ఫూర్తిగా తీసుకున్నారు.


