నటనపై ఇష్టంతో జాబ్‌ వద్దనుకున్నా | 4 Letters Movie Hero Eshwar Interview | Sakshi
Sakshi News home page

నటనపై ఇష్టంతో జాబ్‌ వద్దనుకున్నా

Feb 16 2019 2:45 AM | Updated on Feb 16 2019 2:45 AM

4 Letters Movie Hero Eshwar Interview - Sakshi

ఈశ్వర్‌

ఈశ్వర్‌ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘4 లెటర్స్‌’. టువ చక్రవర్తి, అంకిత మహారాణా కథానాయికలుగా నటించారు. ఆర్‌.రఘురాజ్‌ దర్శకత్వంలో దొమ్మరాజు హేమలత, దొమ్మరాజు ఉదయ్‌ కుమార్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది. ఈశ్వర్‌ మాట్లాడుతూ– ‘‘బీబీఏ డిగ్రీ పూర్తి చేశాను. మంచి జాబ్‌ ఆఫర్స్‌ వచ్చాయి. కానీ నటనపై ఇష్టంతో సినిమా రంగంవైపు వచ్చాను. వైజాగ్‌లో సత్యానంద్‌గారి వద్ద మూడు నెలలు శిక్షణ తీసుకున్నాను. ‘4 లెటర్స్‌’ చిత్రానికి వస్తే... ఇంజినీరింగ్‌ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యంలో ఉంటుంది. విజువల్‌గా సినిమాలో ఎటువంటి వల్గారిటీ లేదు. కొన్ని డైలాగ్స్‌తో కామెడీ క్రియేట్‌ చేశామంతే.

ప్రతిభావంతులైన రఘురాజ్‌గారి దర్శకత్వంలో నా తొలి సినిమా చేయడం హ్యాపీగా అనిపించింది. ఆయన దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాను. ఈ సినిమాను మా నాన్నగారు (దొమ్మరాజు ఉదయ్‌కుమార్‌) నిర్మిస్తారని నాకు ఫస్ట్‌ తెలియదు. ప్రీ–ప్రొడక్షన్‌ వర్క్స్‌ పూర్తయిన తర్వాత ఈ విషయం చెప్పగానే సర్‌ప్రైజ్‌ అయ్యాను. సురేష్‌ ఉపాధ్యాయ రాసిన లిరిక్స్‌కు భీమ్స్‌ మంచి సంగీతం అందించారు. ఈ సినిమాలోని ఉందా లేదా? పాటను పాడాను. మా ట్రైలర్‌ను హీరో వెంకటేష్‌గారు చూసి నన్ను అభినందించడం మర్చిపోలేను. ఒక నటుడికి ఉండవలసిన లక్షణాల గురించి చెబుతూ ఆయన నాకో యాక్టింగ్‌ క్లాస్‌ ఇచ్చారు. అది నా కెరీర్‌కి హెల్ప్‌ అవుతుంది. నా తర్వాతి చిత్రం గురించి త్వరలో చెబుతా’’ అని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement