
టాలీవుడ్లో ప్రభాస్ తొలి సినిమా ఈశ్వర్లో మెప్పించిన కోలీవుడ్ ముద్దుగుమ్మ శ్రీదేవి విజయ్ కుమార్. అంతకుముందే తమిళంలో చాలా చిత్రాలు చేసిన శ్రీదేవి.. రుక్మిణి మూవీతో తెలుగులో అడుగుపెట్టింది. టాలీవుడ్లోనూ చాలా సినిమాల్లో తనదైన నటనతో మెప్పించింది. తెలుగులో చివరిసారిగా వీర చిత్రంలో కనిపించిన శ్రీదేవి.. చాలా ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తోంది. నారా రోహిత్ హీరోగా వస్తోన్న సుందరకాండ మూవీలో కనిపించనుంది.
ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన శ్రీదేవి విజయ్ కుమార్ ప్రభాస్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ప్రభాస్ కెరీర్లోనే బెస్ట్ సినిమాల్లో ఒకటని.. తొలి సినిమాతోనే మాస్ హీరోగా మెప్పించారని అన్నారు. ఆ సినిమా సమయంలోనే ప్రభాస్ స్టార్ అవుతాడని మేము అనుకున్నామని తెలిపింది. కానీ ఈ రేంజ్‌కు వెళ్తాడని ఎవరు కూడా ఊహించలేదని శ్రీదేవి వెల్లడించింది. ప్రభాస్ చాలా మంచి వ్యక్తి అని.. ఒకరికి చెడు జరగాలని అస్సలు అనుకోరని అన్నారు. ఆయనది చిన్నపిల్లాడి మనస్తత్వమని శ్రీదేవి పేర్కొంది.
కాగా. సుందరకాండ చిత్రాన్ని వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ కామెడీ ఎంటర్టైనర్లో శ్రీదేవి కీలక పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రంలో వృతి వాఘాని హీరోయిన్గా నటించారు. సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది.
We all know that #Prabhas is definitely going to be a Big Star but yiii range ki veltharu ani evvaru expect cheyyaledhu 😎💥
I think he deserves all this success..
- #SrideviVijayakumar about #PRABHAS
pic.twitter.com/3MleMOPE6I— Prabhas RULES (@PrabhasRules) August 19, 2025