
‘‘సినిమా వ్యాపారం అంటేనే రిస్క్. ‘అరి’ చిత్రంతో అలాంటి రిస్క్ చేశారు నిర్మాతలు. వారికి ఈ సినిమా మంచి విజయం అందివ్వాలి. తగినన్ని ప్రోత్సాహకాలు ఇస్తూ, సినిమా పరిశ్రమను కాపాడుకోవడంతో పాటు అభివృద్ధి చెందేలా చూసుకోవాలి. అప్పుడే స్థానికంగా ఉన్న ప్రతిభావంతులకు అవకాశాలు వస్తాయి’’ అని తెలంగాణ రాష్ట్ర మంత్రి జి. వివేక్ తెలిపారు. వినోద్ వర్మ, అనసూయ, సాయికుమార్, శ్రీకాంత్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘అరి’.
జయశంకర్ దర్శకత్వం వహించారు. రామిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి (ఆర్‌వీ రెడ్డి) సమర్పణలో శ్రీనివాస్ రామిరెడ్డి, డి. శేషురెడ్డి మారంరెడ్డి, డా. తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, బీరం సుధాకర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఏషియన్–సురేష్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా నేడు రిలీజ్ అవుతోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘అరి’లాంటి మంచి చిత్రాలను ప్రోత్సహిస్తే ఈ కోవలో మరిన్ని సినిమాలు వస్తాయి’’ అని చెప్పారు.
‘‘మంచి సందేశం ఇచ్చేలా రూపొందిన ‘అరి’ విజయం సాధించాలి’’ అని ఎమ్మెల్యే వెంకట రమణా రెడ్డి ఆకాంక్షించారు. ‘‘మంచి కథతో ఈ చిత్రాన్ని రూ΄÷ందించారు జయశంకర్’’ అన్నారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. ‘‘అరిషడ్వర్గాల నేపథ్యంలో తీసిన ‘అరి’కి మంచి విజయాన్ని అందిస్తారని ఆశిస్తున్నాం’’ అని తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, శ్రీనివాస్ రామిరెడ్డి తెలి΄ారు. ‘‘నా 50 ఏళ్ల నట జీవితంలో ‘అరి’ లాంటి చిత్రంలో నటించినందుకు గర్వపడుతున్నాను’’ అని నటుడు సాయికుమార్ చె΄్పారు. ఈ వేడుకలో దర్శకుడు జయశంకర్, త్రిదండి అహోబిల రామానుజ జీయర్ స్వామి, తెలంగాణ స్టేట్ ΄్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ జి. చిన్నారెడ్డి తదితరులు మాట్లాడారు.