బుల్లితెర జంట, బిగ్‌బాస్ ఫేమ్ మెరీనా అబ్రహం- రోహిత్ సాహ్ని గతేడాది పేరెంట్స్‌గా ప్రమోషన్ పొందారు. ఎనిమిదేళ్ల దాంపత్యానికి గుర్తుగా పండంటి పాపాయి జన్మించింది. తనకు టియారా అని నామకరణం చేశారు. తాజాగా తమ కూతురి మొదటి పుట్టినరోజును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు. అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
జీవితం పరిపూర్ణం
ఈ సందర్భంగా టియారా రాకతో తమ జీవితాల్లో వచ్చిన మార్పులు చెప్తూ భావోద్వేగానికి లోనయ్యారు. మెరీనా మాట్లాడుతూ.. తొలిసారి నిన్ను నా చేతుల్లోకి తీసుకున్నప్పుడు నా ప్రపంచమే మారిపోయింది. నన్ను మరింత స్ట్రాంగ్‌గా, అలాగే సాఫ్ట్‌గా, పరిపూర్ణంగా మార్చేశావు. మా జీవితాలను ఎంతో అద్భుతంగా మార్చావు. నా ప్రపంచమే నువ్వయిపోయావు అని పేర్కొంది.

లవ్యూ టియారా: రోహిత్
'టియారా.. నువ్వు ఈ ప్రపంచంలోకి వచ్చాక నిన్ను చూసిన మొదటిరోజు ఇంకా నా కళ్ల ముందే ఉంది. భగవంతుడు ఎంతో అందమైన బహుమతిని నీ రూపంలో ఇచ్చాడు. మమ్మల్ని నీ పేరెంట్స్‌గా ఎంచుకున్నందుకు థాంక్యూ.. వి లవ్యూ టియారా' అని రోహిత్ ఎమోషనలయ్యాడు.
సీరియల్, సినిమా
అమెరికా అమ్మాయి సీరియల్‌తో ఆకట్టుకుంది. సిరిసిరి మువ్వలు, ప్రేమ వంటి సీరియల్స్‌లో యాక్ట్ చేసింది. ఓ సినిమా సమయంలో రోహిత్‌తో పరిచయం ప్రేమగా మారింది. వీరిద్దరూ పెద్దలను ఒప్పించి 2017లో పెళ్లి చేసుకున్నారు. తర్వాత తెలుగు బిగ్‌బాస్ ఆరో సీజన్‌లో జంటగా పార్టిసిపేట్ చేసింది. మెరీనా మధ్యలోనే ఎలిమినేట్ అవగా రోహిత్ మాత్రం ఫైనల్స్ వరకు వెళ్లాడు. సీరియల్స్‌కు దూరమైన వీరిద్దరూ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉన్నారు. రోహిత్ హీరోగా ఓ సినిమా కూడా చేస్తున్నాడు.


