శర్వానంద్ హీరోగా వస్తోన్న సంక్రాంతి సినిమా నారీ నారీ నడుమ మురారి. ఈ చిత్రంలో సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే ట్రైలర్ రిలీజవ్వగా ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమా జనవరి 14న రిలీజ్ కానుంది.
ఈ నేపథ్యంలో నారీ నారీ నడుమ మురారి మేకర్స్ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఏపీలో ఆత్రేయపురంలో జరిగిన ఈ వేడుకలో హీరోయిన్స్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరోయిన్ సంయుక్త తన కోరికను ఆడియన్స్‌తో పంచుకుంది. తనకు ఇక్కడ ఫేమస్ అయిన పూతరేకులు కావాలని అడిగింది. ఎవరైనా ఇంట్లో తయారు చేసిన పూత రేకులు తెచ్చిఇవ్వాలని ఫ్యాన్స్‌ను కోరింది. డ్రై ఫ్రూట్స్‌తో చేసిన పూతరేకులు తీసుకువస్తే.. హైదరాబాద్‌కు పట్టుకెళ్లిపోతానంటూ కామెంట్స్ చేసింది. హీరోయిన్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
#NariNariNadumaMurari is a Perfect Sankranthi Feast 🤩❤️🔥
-Beautiful @iamsamyuktha_ at the Trailer launch 😍
Watch Trailer here 🔗 https://t.co/Q9gnNSPYip
Lets Celebrate in theatres from Jan 14 | 5:49 PM onwards ✨🍿#SharwaSankranthi
Charming Star @ImSharwanand @AnilSunkara1… pic.twitter.com/XF9d8LIS2Z— AK Entertainments (@AKentsOfficial) January 12, 2026


