బండోడా అని అమ్మ తిట్లు.. కళ్లు తిరిగి పడిపోయా! | Director Karan Johar Says He One Fainted in college while Dieting | Sakshi
Sakshi News home page

అమ్మ ఎప్పుడూ తిట్టేది.. డైటింగ్‌ వల్ల కళ్లు తిరిగి పడిపోయా!

Jan 12 2026 2:43 PM | Updated on Jan 12 2026 2:50 PM

Director Karan Johar Says He One Fainted in college while Dieting

బాలీవుడ్‌ దర్శకనిర్మాత కరణ్‌ జోహార్‌ మొదట్లో కాస్త లావుగా ఉండేవాడు. కానీ కఠినమైన డైట్‌ పాటించి, వర్కవుట్స్‌ చేసి చాలా సన్నబడ్డాడు. గతేడాది అతడి ట్రాన్స్‌ఫర్మేషన్‌ చూసి అందరూ ముక్కున వేలేసుకున్నారు. తాజాగా తన వెయిట్‌ లాస్‌ జర్నీ గురించి ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడాడు.

సరైన సమయం దొరక్క..
కరణ్‌ జోహార్‌ మాట్లాడుతూ.. బరువు తగ్గడం అనేది చాలా ఈజీ. కానీ నా వృత్తిలో సరైన టైమింగ్స్‌ అంటూ ఉండవు, సెలవులు ఉండవు, పండగ హాలీడేస్‌ ఉండవు.    అర్జంట్‌ అంటూ తరచూ ఫోన్లు వస్తుంటాయి. కాబట్టి నేను డైటింగ్‌ను తు.చ తప్పకుండా పాటించడం కాస్త కష్టమైంది. అయితే మా నాన్న.. నేను లావుగా ఉన్నప్పటికీ హ్యాండ్సమ్‌గానే ఉన్నాననేవారు. 

అమ్మ తిట్టేది
అమ్మ మాత్రం ఒప్పుకోకపోయేది. ఏం మాట్లాడుతున్నావ్‌? వాడు చాలా లావుగా, బండలా ఉన్నాడనేది. నేను హీరో కావాలని మా నాన్న కోరుకుంటే అమ్మ మాత్రం.. నన్ను ఎగాదిగా చూసి అది జరగదని తేల్చిపడేసేది. ఆమె ఎప్పుడూ నన్ను తిడుతూనే ఉండేది. కాలేజీకి మంచి డ్రెస్‌ వేసుకుని వెళ్లినప్పుడు అందరూ నాకంటే సన్నగా కనిపించేవారు. 

కళ్లు తిరిగి పడిపోయా..
అప్పుడు తొలిసారి బరువు తగ్గాలనుకున్నాను. ఎన్నో డైట్స్‌ ప్రయత్నించాను, కానీ ఏదీ వర్కవుట్‌ కాలేదు. ఒక నెలపాటు డైటింగ్‌ చేయగానే అనారోగ్యానికి గురయ్యేవాడిని. ఒకసారి కాలేజీలో నా క్లాస్‌రూమ్‌లో కళ్లు తిరిగి కింద పడిపోయాను. అప్పుడే మా అమ్మ నన్ను తిట్టి డైట్‌ మాన్పించింది. నేను చికిత్స ద్వారా బరువు తగ్గానని చాలామంది అనుకుంటారు, కానీ అది నిజం కాదు. 

వాటి వల్లే బరువు తగ్గా..
కాకపోతే బరువుకు కారణమేంటి పరీక్షలు చేయించుకుంటే థైరాయిడ్‌ ఉన్నట్లు తేలింది. శరీరంలో గ్లూటెన్‌ ఎక్కువగా ఉందని నిర్ధారణ అయింది. దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేశాను. అందుకు బాదం పాలు తోడ్పడ్డాయి. చక్కెర తగ్గించేశాను. వర్కవుట్స్‌ చేశాను. గేమ్స్‌ ఆడాను, ఈత కొట్టాను. బరువు తగ్గాను అని కరణ్‌ జోహార్‌ చెప్పుకచ్చాడు.

చదవండి: ఓటీటీ మూవీ చీకటిలో.. ట్రైలర్‌ చూశారా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement