అక్కినేని కోడలు శోభిత ధూళిపాళ పెళ్లి తర్వాత చేస్తున్న ఫస్ట్ ప్రాజెక్ట్ చీకటిలో. ఈ సినిమా థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజవుతోంది. సోమవారం (జనవరి 12న) ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులో శోభిత క్రైమ్ యాంకర్ సంధ్యగా కనిపించింది. మొదట జర్నలిస్ట్‌గా పనిచేసినా.. తర్వాత జాబ్ నచ్చలేదని మానేసి పాడ్‌కాస్ట్ ప్రారంభించింది. ఆ పాడ్‌కాస్ట్‌కు చీకటిలో అన్న టైటిల్ ఖరారు చేసింది.
క్రైమ్ యాంకర్‌గా శోభిత
సమాజంలో జరుగుతున్న నేరాల గురించి అందులో మాట్లాడింది. ఎంత పెద్ద క్రిమినల్ అయినా ఏదో ఒక తప్పు చేస్తాడు అంటూ ఓ సీరియల్ కిల్లర్ గురించి ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టింది. దీంతో సదరు సీరియల్ కిల్లర్.. చిమ్మ చీకటిలో ఇంకో ప్రాణం గాల్లో కలిసిపోతుందని ముందుగానే వార్నింగ్ ఇస్తాడు. మరి అతడిని హీరోయిన్ పట్టుకుంటుందా? అదే సమయంలో అతడి బారి నుంచి తనను తాను రక్షించుకుంటుందా? అన్న విశేషాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే!
సినిమా
చీకటిలో మూవీలో శోభితతో పాటు విశ్వదేవ్ రాచకొండ, చైతన్య విశాలక్ష్మి, ఈషా చావ్లా, జాన్సీ, ఆమని, వడ్లమాని శ్రీనివాస్, రవీంద్ర విజయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించగా శ్రీచరణ్ పాకాల సంగీతం అందించాడు. ఈ సినిమా జనవరి 23న నుంచి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి రానుంది.
చదవండి: పీరియడ్స్.. నీళ్లలో తడిచా.. బట్టలు మార్చుకుంటానంటే..: హీరోయిన్


