
ఒకానొక సమయంలో భార్య రమ జీతంపైనే ఆధారపడి బతికాడు ఎస్‌ఎస్ రాజమౌళి. కానీ ఇప్పుడు వెయ్యి కోట్లు అవలీలగా రాబట్టే సినిమాలను తెరకెక్కిస్తున్నాడు. (#SSRajamouli)

హాలీవుడ్ సినిమాలను తలదన్నేలా కళాఖండాలు సృష్టిస్తూ దేశం గర్వించదగ్గ దర్శకుడిగా ఎదిగాడు. (#HBDSSRajamouli) తెలుగు సినిమాను ఆస్కార్ వాకిట్లో నిలబెట్టాడు.

స్టూడెంట్ నెం.1, ఈగ, విక్రమార్కుడు, బాహుబలి, (#BaahubaliTheEpic) ఆర్‌ఆర్‌ఆర్.. ఇలా ఆయన తీసిన ప్రతి సినిమా సూపర్ హిట్టే! ఇప్పుడీ జక్కన్న మహేశ్‌బాబుతో సినిమా చేస్తున్నాడు.

అన్నట్లు.. రాజమౌళికి జక్కన్న అనే పేరును రాజీవ్ కనకాల పెట్టాడు.

'రాజమౌళి పని రాక్షసుడు.. సీన్లని జక్కన్నలా చెక్కుతున్నాడు' అని రాజీవ్ సరదాగా అంటే అదే ఆయన పేరులా స్థిరపడిపోయింది.

నేడు (అక్టోబర్ 10) ఎస్‌ఎస్ రాజమౌళి బర్త్‌డే సందర్భంగా కొన్ని స్పెషల్ ఫోటోలను ఇక్కడ చూసేయండి..



























