
కొన్ని సినిమాలు ఒక్కసారి చూస్తే చాలు.. కానీ, కొన్ని మాత్రం వన్స్‌మోర్ అనిపించేలా ఉంటాయి. మిరాయ్ మూవీ (Mirai Movie) కూడా అదే కోవలోకి వస్తుంది. యాక్షన్, ఎమోషన్స్, థ్రిల్లింగ్ మూమెంట్స్.. ఇలా అన్నింటి మేళవింపులతో ఈ మూవీ తెరకెక్కింది. తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటించగా రితికా నాయక్ హీరోయిన్‌గా యాక్ట్ చేసింది. మంచు మనోజ్ విలన్‌గా మెప్పించాడు. గౌర హరి సంగీతం అందించాడు.
ఓటీటీలో మిరాయ్
సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రూ.150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అయితే ముందస్తు డీల్ ప్రకారం నెలరోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియోహాట్‌స్టార్‌లో శుక్రవారం (అక్టోబర్ 10) రిలీజైంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో అందుబాటులోకి వచ్చింది.
కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేసిన ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. శ్రియ, జగపతిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. మరి ఓటీటీలో ఈ సినిమా ఏమేరకు అదరగొడుతుందో చూడాలి! ఈరోజు మిరాయ్ ఒక్కటే కాదు, సన్ నెక్స్ట్‌లో త్రిబాణధారి బార్బరిక్, నెట్‌ఫ్లిక్స్‌లో కురుక్షేత్రం అనే యానిమేడెట్ సిరీస్ కూడా రిలీజయ్యాయి. అటు వార్ 2 మూవీ గురువారమే (అక్టోబర్ 9) నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. వీకెండ్‌లో మీకు నచ్చిన సినిమాలపై ఓ లుక్కేయండి.
చదవండి: అందుకే బిగ్‌బాస్ ఇంటికి తాళం.. రెండురోజుల్లో మళ్లీ షురూ