బలగం ఫేమ్ వేణు యెల్దండి తెరకెక్కిస్తోన్న మరో చిత్రం ఎల్లమ్మ. తాజాగా ఈ మూవీ గ్లింప్స్ రిలీజ్ చేశారు. సంక్రాంతి కానుకగా అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఈ చిత్రంలో హీరోగా సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ కనిపించనున్నారు. ఈ చిత్రంలో దేవీశ్రీ ప్రసాద్ డప్పు కళాకారుడు పర్షి క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. ఈ మూవీని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నారు.
తాజాగా రిలీజైన గ్లింప్స్ చూస్తుంటే సినీ ప్రియులను తెగ ఆకట్టుకుంటోంది. ఇందులో కొమ్ములు తిరిగిన పొట్టేలు మరింత ఆసక్తిని పెంచుతోంది. నది ఒడ్డున వర్షంలో దేవీశ్రీ ప్రసాద్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.


