ఆంధ్రప్రదేశ్‌లో భోగి పండుగ వేడుకలను వైఎస్సార్‌సీపీ వైవిధ్యభరితంగా నిర్వహించింది.
చంద్రబాబు సర్కార్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ కోసం తెచ్చిన జీవో ప్రతులను భోగి మంటల్లో దహనం చేసింది.
కూటమి ప్రభుత్వపు అహం ఈ మంటల్లో తొలగిపోవాలని..
జీవోను వెనక్కి తీసుకునేలా చంద్రబాబుకి దేవుడు మంచి బుద్ధి ప్రసాదించాలని..
ఈ ఏడాదిలోనైనా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ నేతలు కోరుకున్నారు.


