
ఇమ్యూనిటీ కోసం గేమ్స్ పెడితే ఇమ్మాన్యుయేల్ గెలిచి ఈ వారం నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యాడు. రాము కెప్టెన్ కాబట్టి దర్జాగా ఉన్నాడు. మిగిలినవారందరికీ గేమ్స్ పెట్టకుండా ఖాళీగా వదిలేస్తే రియాలిటీ షోను కాస్త ఫ్యామిలీ సీరియల్ డ్రామాగా మార్చేలా ఉన్నారని బిగ్‌బాస్‌కు భయం పట్టుకుంది. అమ్మ, నాన్న, అన్న, కొడుకు ఇలా ఏవేవో బంధుత్వాలు కలిపేసుకుని అక్కడే ఆగిపోయారు. అందుకే వీళ్లకు కొన్ని గేమ్స్ పెట్టారు. మరి హౌస్‌లో నిన్న (అక్టోబర్ 9న) ఏం జరిగిందో చూసేద్దాం..

కూతుర్ని బుజ్జగించిన నాన్న
తనూజ నాన్న (భరణి)పై అలక బూనింది. దీంతో అతడు కూతుర్ని బుజ్జగించే ప్రయత్నం చేశాడు. నువ్వు నమ్మినా, నమ్మకపోయినా ఈ హౌస్‌లో నువ్వంటే నాకు చాలా ఇష్టం అంటూ కాసేపు మాట్లాడాడు. ఇంతలో బిగ్‌బాస్ నాచోరే నాచోరే అని ఓ టాస్క్ ఇచ్చాడు. ఈ గేమ్‌లో కల్యాణ్ గెలిచాడు. తర్వాతి స్థానాల్లో దివ్య, డిమాన్, సుమన్ ఉన్నారు. సంజనా టీమ్‌కు ఒక్క పాయింట్ కూడా రాలేదు. లీడర్ బోర్డ్‌లో మొదటి స్థానంలో ఉన్న దివ్య- భరణికి బిగ్‌బాస్ ఒక పవర్ ఇచ్చాడు.
నావల్ల కాదు: సంజనా
పట్టికలో చివరి రెండు స్థానాల్లో ఉన్న ఫ్లోరా- సంజనా, శ్రీజ- సుమన్‌లలో నుంచి ఒక జట్టును రేసు నుంచి తొలగించవచ్చన్నాడు. దీంతో వాళ్లు ఫ్లోరా- సంజనాను తీసేశారు. తన కష్టమంతా వృథా కావడంతో సంజనా తట్టుకోలేకపోయింది. ఒంటరి కూర్చుని ఏడ్చేసింది. ఫిజికల్ టాస్కులు ఉంటాయని నాకు తెలీదు. అబ్బాయిల శరీరంపై నుంచి ఎలా దూకాలి బిగ్‌బాస్? నేనెప్పుడూ అలా చేయలేదు. ఇలాగైతే నేనుండలేను, ఇంటికెళ్లిపోతాను.

తనూజ గెలుపు.. ఏడ్చేసిన రీతూ
సుమన్ శెట్టిపై నేనెలా దూకాలి? అమ్మాయిలతో అయితే పర్లేదు కానీ, అబ్బాయిలతో ఎలా? ఇలాగైతే నన్ను ఇంటికి పంపించండి అని ఏడ్చింది. తర్వాత పిరమిడ్ కట్టు-పాయింట్స్ పట్టు గేమ్‌లో తనూజ- కల్యాణ్ గెలిచారు. ఈ గేమ్‌లో డిమాన్- రీతూ నాలుగో స్థానంలో నిలబడ్డారు. గేమ్ నీ వల్లే పోయిందన్నట్లుగా డిమాన్ చిరాకుపడటంతో రీతూ ఏడ్చింది. ఇక ఇంతటితో గేమ్స్ పూర్తయినట్లు ప్రకటించాడు బిగ్‌బాస్. లీడర్ బోర్డ్‌లో దివ్య- భరణి ఫస్ట్ ప్లేస్‌లో , తనూజ- పవన్ కల్యాణ్ సెకండ్ ప్లేస్‌లో ఉన్నారు.
తనూజ త్యాగం
మొదటి స్థానంలో ఉన్నవారు డేంజర్ జోన్ నుంచి మెయిన్ హౌస్‌కి వెళ్లొచ్చన్నారు. రెండో ప్లేస్‌లో ఉన్న జట్టులో ఒక్కరికే సేఫ్ జోన్‌లోకి వెళ్లే ఛాన్స్ ఉంటుందని ట్విస్ట్ ఇచ్చాడు. సేఫ్ జోన్‌లో ఉంటానని కల్యాణ్ అనగానే తనూజ ఏమాత్రం ఆలోచించకుండా ఓకే చెప్పేసింది. ఇక్కడ శ్రీజ ప్లాన్ వర్కవుట్ అయింది. శ్రీజ- కల్యాణ్ ఒక టీమ్‌గా జత కడితే ఎవరో ఒకరు నష్టపోయే ఛాన్స్ ఉంటుందని ముందే ఆలోచించింది. అందుకనే ఇద్దరూ వేర్వేరు టీమ్స్‌గా ఏర్పడ్డారు. దాంతో ఇప్పుడు కల్యాణ్ సేఫ్ జోన్‌లో ఎంటరయ్యాడు. ఇక కెప్టెన్ రాము, ఇమ్యూనిటీ గెలిచిన ఇమ్మాన్యుయేల్, భరణి, దివ్య, కల్యాణ్ మాత్రమే ప్రస్తుతానికి సేఫ్ జోన్‌లో ఉన్నారు. మిగిలినవారంతా డేంజర్ జోన్‌లో ఉన్నారు.
చదవండి: అందుకే బిగ్‌బాస్ ఇంటికి తాళం.. ఒకరోజు గ్యాప్‌తో మళ్లీ షురూ