బిగ్‌బాస్ సీజన్-9.. ఐదేళ్ల రికార్డ్ బ్రేక్..! | Bigg boss 9 telugu season 9 creates record views in Ott | Sakshi
Sakshi News home page

Bigg boss 9 telugu: బిగ్‌బాస్ సీజన్-9.. ఐదేళ్ల రికార్డ్ బ్రేక్..!

Jan 2 2026 7:31 PM | Updated on Jan 2 2026 7:38 PM

Bigg boss 9 telugu season 9 creates record views in Ott

తెలుగు బుల్లితెర ప్రియులను అలరించే ఏకైక రియాలిటీ షో బిగ్‌బాస్. గతేడాది డిసెంబర్‌లో ముగిసిన ఈ సీజన్‌లో కామనర్‌గా హౌస్‌లో అడుగుపెట్టిన పడాల కల్యాణ్ విజేతగా నిలిచాడు. దాదాపు వంద రోజులకు పైగా హౌస్‌లోఉన్న పడాల కల్యాణ్ తెలుగు బిగ్‌బాస్ సీజన్-9 ట్రోఫీతో పాటు క్యాష్‌ప్రైజ్‌ను సొంతం చేసుకున్నారు. ఈ సీజన్‌ రన్నరప్‌గా తనూజ నిలిచింది. ఈ సీజన్ టాప్‌-5లో డీమాన్ పవన్, ఇమ్మాన్యూయేల్, సంజనా గల్రానీ నిలిచారు.

తెలుగు సినీ ప్రియులను అలరించిన ఈ రియాలిటీ షో అరుదైన రికార్డ్ సాధించింది. గతేడాది జరిగిన బిగ్‌బాస్ గ్రాండ్‌ ఫినాలే అత్యధిక రేటింగ్‌ సాధించింది. గత ఐదేళ్లలో ఇదే అతిపెద్ద రికార్డ్ అని నాగార్జున ట్వీట్ చేశారు. ఈ సీజన్ గ్రాండ్ ఫినాలేను జియో హాట్‌స్టార్‌లో 285 మిలియన్‌ నిమిషాల పాటు వీక్షించారు. అంతేకాకుండా స్టార్‌ మా టీవీ రేటింగ్స్‌లో 19.6 సాధించింది. ఈ సందర్భంగా నాగార్జున సంతోషం వ్యక్తం చేశారు. ఈ క్రేజీ రికార్డ్ సాధించిన ఈ షో యాజమాన్యానికి  ధన్యవాదాలు తెలిపారు. తమ ప్రేమ, మద్దతుతో ఈ సీజన్‌ను చారిత్రాత్మకంగా మార్చిన లక్షలాది మంది ప్రేక్షకులకు కూడా కృతజ్ఞతలు చెప్పారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement