మెగాస్టార్ చిరంజీవి, వెంకటేశ్ నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రానికి టికెట్ ధరలు పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీఓ జారీ చేసింది. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ మూవీ విడుదల కానుంది. ముందు రోజు వేసే స్పెషల్ ప్రీమియర్ టికెట్ ధరను జీఎస్టీతో కలిపి రూ.500గా నిర్ణయించారు. జనవరి 11న రాత్రి 8గంటల నుంచి 10లోపు ఈ షోలు ఉంటాయని తెలిపింది.
ఆపై తొలి పదిరోజులపాటు టికెట్ ధరలను పెంచుకోవచ్చని ప్రభుత్వం అనుమతి వచ్చింది. సింగిల్ స్క్రీన్‌లలో టికెట్ ధరపై రూ.100, మల్టీప్లెక్స్‌లలో రూ.125 జీఎస్టీతో కలిపి పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. విడుదల మొదటిరోజు రాష్ట్రవ్యాప్తంగా 5 షోలు ప్రదర్శించవచ్చని జీఓలో పేర్కొంది.
మనశంకర్ వరప్రసాద్ విషయానికొస్తే.. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా నయనతార నటిస్తోంది. విక్టరీ వెంకటేశ్ కీలక పాత్ర పోషించాడు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. దీంతో మూవీపై బజ్ క్రియేట్ అయింది.


