
‘‘డ్యూడ్’ సినిమా చాలా కొత్తగా ఉంటుంది. ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు. మా చిత్రం ఘన విజయం సాధిస్తుంది. ఈ దీ΄ావళికి వస్తున్న ‘మిత్రమండలి, తెలుసు కదా, కె–ర్యాంప్’ చిత్రాలు కూడా విజయం సాధించాలి’’ అని నిర్మాత వై.రవిశంకర్ అన్నారు. ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు జంటగా శరత్ కుమార్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘డ్యూడ్’. కీర్తీశ్వరన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదలకానుంది.
హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ప్రదీప్ రంగనాథన్ మాట్లాడుతూ– ‘‘మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూ΄÷ందిన ఈ చిత్రంలో వినోదం, భావోద్వేగాలతో ΄ాటు ఊహించని అంశాలుంటాయి. ‘డ్యూడ్’ కచ్చితంగా ప్రేక్షకులకి నచ్చుతుంది’’ అని చె΄్పారు. ‘‘చాలా కొత్త కథ ఇది. కచ్చితంగా విజయం సాధిస్తుంది’’ అన్నారు శరత్ కుమార్. మైత్రి డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి మాట్లాడారు.