కాళ్లు మొక్కడం తప్ప ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? | Manchu Mohan Babu Speech at Mohan Babu University 34th Annual Day | Sakshi
Sakshi News home page

Mohan Babu: రెండేళ్లకంటే ఎక్కువ ఇండస్ట్రీలో ఉండననుకున్నా..

Mar 15 2026 12:04 PM | Updated on Mar 15 2026 12:04 PM

Manchu Mohan Babu Speech at Mohan Babu University 34th Annual Day

సినీ చిత్రపరిశ్రమలో 50 ఏళ్ల నటజీవితాన్ని ఊహించలేదంటున్నారు విలక్షణ నటుడు మోహన్‌బాబు. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రెండేళ్లకే మళ్లీ ఊరిబాట పడతాననుకున్నానని, కానీ సుదీర్ఘకాలంగా నటుడిగా కొనసాగుతున్నానన్నారు. మోహన్‌బాబు యూనివర్సిటీ 34వ వార్షికోత్సవంలో ఆయన మాట్లాడుతూ.. 1975 నవంబర్‌ 22న నా మొదటి సినిమా స్వర్గం- నరకం విడుదలైంది. 

50 ఏళ్లలో..
ఏడాదో, రెండేళ్లు ఇక్కడుంటాను.. తర్వాత సినిమాలుండవు, ఊరికెళ్లిపోవాల్సిందే అనుకున్నాను. అలాంటిది 50 ఏళ్లలో 560 సినిమాలు చేశాను. విభిన్న పాత్రలు.. ఒకదాన్ని మించి మరొకటి చేశాను. తల్లిదండ్రులు, భగవంతులు, నన్ను ప్రోత్సహించిన దర్శకనిర్మాతలు, ప్రేక్షకుల ఆశీస్సుల వల్లే ఇదంతా సాధ్యమైంది.

అది చూసి ఆశ్చర్యపోతుంటా..
విద్యార్థులారా.. మీకన్నీ తెలుసు.. ఎలా నడుచుకోవాలి? ఏం చేయాలి? ఎలా బతకాలి? అన్నీ మీకు తెలుసు. మీ వయసులో నేనున్నప్పుడు ఈ కంప్యూటర్లు, సెల్‌ఫోన్లు లేవు. ఇప్పుడు ఒక్కొక్కరికి రెండు సెల్‌ఫోన్లు.. అవి తల్లిదండ్రుల సంపాదనతో కొన్నవే! అది చూసి ఆశ్చర్యపోతుంటాను. ఒక పూట భోజనం చేసి, గంజి తాగి పిల్లల్ని స్కూలుకు పంపుతున్న తల్లిదండ్రులెంతోమంది!

ఏమిచ్చి రుణం తీర్చుకోగలం?
అలాంటివాళ్లెందరికో మేము సాయం చేశాం, చేస్తూనే ఉన్నాం. మీరందరూ ఏది మంచిదారి, ఏది చెడుదారి ఆలోచించుకుని ముందుకెళ్లాలి. తల్లిదండ్రులకు ఇబ్బంది కలిగించకండి. వారి పాదాలకు నమస్కరించడం తప్ప ఏమిచ్చి వారి రుణం తీర్చుకోగలం? కాబట్టి మంచి మార్గంలో ప్రయాణించండి అని విద్యార్థులకు మోహన్‌బాబు సూచించారు.

చదవండి: ఉస్తాద్‌ కోసం శ్రీలీల అంత పారితోషికం తీసుకుందా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement