‘ఉస్తాద్‌.. ’ కోసం శ్రీలీల అంత తీసుకుందా? | Sreeleela Charge Huge Remuneration For Ustaad Bhagat Singh | Sakshi
Sakshi News home page

‘ఉస్తాద్‌.. ’ కోసం శ్రీలీల అంత తీసుకుందా?

Mar 15 2026 9:51 AM | Updated on Mar 15 2026 11:08 AM

Sreeleela Charge Huge Remuneration For Ustaad Bhagat Singh

టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్లలో శ్రీలీల ఒకరు. పెళ్లి సందడి సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ బ్యూటీ..ధమాకా చిత్రంతో భారీ హిట్‌ని ఖాతాలో వేసుకుంది. ఆ చిత్రం రిలీజ్‌ తర్వాత శ్రీలీలకు వరస అవకాశాలు వచ్చాయి. రామ్‌, నితిన్‌ లాంటి యంగ్‌ హీరోలతో పాటు మహేశ్‌ బాబు లాంటి సూపర్‌ స్టార్‌ చిత్రాల్లోనూ నటించింది. దీంతో పాటు పుష్ప 2లో స్పెషల్‌ సాంగ్‌కి బన్నీతో స్టెప్పులేసి ఆకట్టుకుంది. 

ఇలా తెలుగులో బిజీగా ఉన్నప్పుడే బాలీవుడ్‌పై కన్నేసింది. అక్కడ కూడా తన టాలెంట్‌ని నిరూపించుకునే ప్రయత్నం చేస్తుంది. తెలుగులో ఆమె నటించిన తాజా చిత్రం ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’(Ustaad Bhagat Singh)మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో శ్రీలీల(Sreeleela)తో పాటు రాఖీ ఖన్నా కూడా మరో హీరోయిన్‌గా నటించింది. కెరీర్‌తో తొలిసారి పవన్‌ కల్యాణ్‌తో కలిసి నటిస్తుంది ఈ భామ. అయితే ఈ సినిమా కోసం భారీగానే పారితోషికం పుచ్చుకుందట.

సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న దాని ప్రకారం.. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కోసం శ్రీలీల రూ.2.5 నుంచి 3 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుందట. గత సినిమాలతో పోలిస్తే..ఇది తక్కువే అని చెబుతున్నారు. ఆమె నటించిన ‘జూనియర్‌’ చిత్రానికి ఏకంగా రూ. 4 కోట్లు తీసుకుందంట. ఇక ధమాకా తర్వాత రవితేజతో కలిసి నటించిన మరో చిత్రం ‘మాస్‌ జాతర’కు రూ. 3 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. 

Advertisement
 
Advertisement
Advertisement