breaking news
Dude
-
ఫుట్ బాల్ నేపథ్యంలో ‘డ్యూడ్’
మల్టీ టాలెంటెడ్ తేజ్ నటించిన త్రిభాషా చిత్రం ‘డ్యూడ్. ఫుట్ బాల్ నేపథ్యంలో బలమైన భావోద్వేగాలతో సాగే ఈ చిత్రాన్ని ఫుట్ బాల్ ప్రేమికుడైన స్వర్గీయ కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కు అంకితం చేస్తున్నారు. 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకుని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న "డ్యూడ్" చిత్రం టీజర్ త్వరలో విడుదల చేయనున్నారు!!హీరో కమ్ డైరెక్టర్ తేజ్ మాట్లాడుతూ... "హీరోగా, డైరెక్టర్ గా 'డ్యూడ్" చిత్రం ఔట్ ఫుట్ పట్ల చాలా హ్యాపీగా ఉన్నాను. రష్ చూసుకుంటుంటేనే చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. ఎప్పుడెప్పుడు ఆడియన్స్ తో కలిసి థియేటర్స్ లో సినిమా చూసుకుంటామా అని చాలా ఆత్రంగా ఉంది. సినిమా ఇంత బాగా రావడానికి కారకులైన నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. త్వరలో టీజర్ రిలీజ్ చేసి, అప్పటి నుంచి ప్రచార కార్యమాలు ముమ్మరం చేస్తాం" అని అన్నారు!!రంగాయన రఘు ఫుట్ బాల్ కోచ్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఇదే ఏడాదిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఏక కాలంలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది!!ఈ చిత్రంలో కీలకమైన పాత్ర పోషిస్తున్న రాఘవేంద్ర రాజ్ కుమార్... ఈ చిత్రానికి 'స్క్రిప్ట్ కన్సల్టెంట్'గా కూడా వ్యవహరించడం విశేషం. శాన్య కావేరమ్మ, మేఘ, మోహిత, ధృతి, అనర్ఘ్య, దిపాలి పాండే, సిరి, ఎవాంజిలిన్, సోను తీర్ధ గౌడ్, యశశ్విని, మెర్సి, మోనిష... ఫుట్ బాల్ అంటే పడి చచ్చే ధీర వనితలుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో సుందర్ రాజా, స్పర్శ రేఖ, విజయ్ చెందూర్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు -
'డ్యూడ్' టైటిల్ మాది.. ఏడాది క్రితమే రిజిస్టర్
ప్రదీప్ రంగనాథ్ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ తీస్తున్న సినిమాకు డ్యూడ్ అని టైటిల్ పెట్టారు. అయితే ఈ పేరు ప్రకటించడం తనని ఆశ్చర్యానికి, ఆవేదనకు గురి చేసిందని హీరో-నిర్మాత-దర్శకుడైన తేజ్ అంటున్నాడు. ఏడాది నుంచి 'డ్యూడ్' సినిమా ప్రచారాన్ని నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. (ఇదీ చదవండి: నేనేం RRR లాంటి సినిమా తీయట్లేదుగా..: లోకేశ్ కనగరాజ్)మైత్రీ లాంటి అగ్ర నిర్మాణ సంస్థతో ఘర్షణ పడే ఉద్దేశ్యం తనకు లేదని, ఈ విషయాన్ని ఇప్పటికే మైత్రి మూవీ మేకర్స్ దృష్టికి తీసుకువెళ్లామని, వారు సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నామని తేజ్ పేర్కొన్నారు.తేజ్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా డ్యూడ్. తెలుగు-కన్నడ-మలయాళ భాషల్లో తీస్తున్నారు. ఫుట్ బాల్ నేపథ్య కథతో దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం చివరి షెడ్యూల్ త్వరలో మొదలుకానుంది. ఆగస్టు లేదా సెప్టెంబరులో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. మరి టైటిల్ విషయమై ఏం చేస్తారో చూడాలి?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలు ఇవే) -
'డ్రాగన్' హీరో.. 'ప్రేమలు' హీరోయిన్
ఇప్పుడంతా పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. భాషాభేదం లేకుండా పలు భాషల్లోనూ యాక్టర్స్ తెలుగులోనూ హీరోహీరోయిన్లుగా నటిస్తూ గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు ఆ లిస్టులోకి చేరేందుకు ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు రెడీ అయిపోయారు. ఇంతకీ వీళ్ల కొత్త సినిమా సంగతేంటి?(ఇదీ చదవండి: దర్శకుడి డ్రీమ్ కార్.. గిఫ్ట్ ఇచ్చిన సూర్య-కార్తీ) 'కోమలి' సినిమాతో దర్శకుడిగా మారిన ప్రదీప్ రంగనాథన్.. 'లవ్ టుడే' మూవీతో అటు దర్శకత్వం చేస్తూనే హీరోగా మారిపోయాడు. రీసెంట్ గా 'డ్రాగన్' మూవీతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఈ క్రమంలోనే ఇతడిని హీరోగా పెట్టి తెలుగు నిర్మాతలైన మైత్రీ మూవీ మేకర్స్ కొత్త సినిమాని ప్రకటించారు. 'డ్యూడ్' పేరుతో తీస్తున్న ఈ సినిమాని ఈ ఏడాది దీపావళి కానుకాగ థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. 'ప్రేమలు' మూవీతో ఫేమ్ తెచ్చుకున్న మలయాళ హీరోయిన్ మమిత బైజు.. డ్యూడ్ చిత్రంలో ప్రదీప్ కి జోడీగా నటిస్తోంది. ఈ మేరకు వీళ్లిద్దరూ కలిసున్న లుక్ ని రిలీజ్ చేశారు. షర్ట్ లేకుండా ప్రదీప్ ఉండటం చూస్తుంటే ఇది కూడా కామెడీ ఎంటర్ టైనర్ అని తెలుస్తోంది.(ఇదీ చదవండి: ఆ హీరోయిన్ తో అస్సలు నటించను: టాలీవుడ్ హీరో) -
ఫుట్ బాల్ నేపథ్యంలో ‘డ్యూడ్’
యంగ్ హీరో తేజ్ నటిస్తున్న ద్విభాషా చిత్రం ‘డ్యూడ్’. ప్రి ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ లో సెట్స్ కు వెళ్లనుంది. తెలుగు - కన్నడ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పనరోమిక్ స్టూడియోస్ పతాకంపై తేజ్ స్వయంగా నిర్మిస్తుండడమే కాకుండా... స్వయంగా కథను అందించి, దర్శకత్వం వహిస్తుండడం విశేషం. తేజ్ ఇంతకుముందు "రామాచారి" అనే కన్నడ హిట్ చిత్రంలో నటించారు. తేజ్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘గాడ్’ కూడా త్వరలో మొదలు కానుంది. ఇప్పటివరకు కొన్ని వేల ప్రేమ కథా చిత్రాలు వచ్చాయి. కానీ పూర్తి ఫుట్ బాల్ నేపథ్యంలో ఇప్పటివరకు తెలుగు, కన్నడ భాషల్లో సినిమా రాలేదు. అందువల్లే... కర్ణాటకలోని "కిక్ స్టార్ట్" అనే సుప్రసిద్ధ ఫుట్ బాల్ క్లబ్... "డ్యూడ్" చిత్రానికి పూర్తి సహాయసహకారాలు అందిస్తోంది. డిసెంబర్ లో సెట్స్ కు వెళ్లనున్న ఈ చిత్రానికి కన్నడ - మలయాళ భాషల్లో సుపరిచితుడైన ఇమిల్ మొహమ్మద్ సంగీతం అందిస్తున్నాడు. -
ఫుట్ బాల్ నేపథ్యంలో ‘డ్యూడ్’
యంగ్ హీరో తేజ్ నటిస్తున్న ద్విభాషా చిత్రం ‘డ్యూడ్’. తెలుగు - కన్నడ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పనరోమిక్ స్టూడియోస్ పతాకంపై తేజ్ స్వయంగా నిర్మిస్తుండడమే కాకుండా... స్వయంగా కథను అందించి, దర్శకత్వం వహిస్తుండడం విశేషం. తేజ్ ఇంతకుముందు ‘రామాచారి’ అనే హిట్ చిత్రంలో నటించారు. తను తాజాగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘గాడ్’ ప్రి - ప్రొడక్షన్ లో ఉంది. ఇప్పటివరకు కొన్ని వేల ప్రేమ కథా చిత్రాలు వచ్చాయి. కానీ పూర్తి ఫుట్ బాల్ నేపథ్యంలో ఇప్పటివరకు ఏ తెలుగు, కన్నడ భాషల్లో సినిమా రాలేదు. అందువల్లే... కర్ణాటకలోని ‘కిక్ స్టార్ట్’ అనే సుప్రసిద్ధ ఫుట్ బాల్ క్లబ్... ‘డ్యూడ్’ చిత్రానికి పూర్తి సహాయసహకారాలు అందిస్తోంది. అక్టోబర్ లో సెట్స్ కు వెళ్లనున్న ఈ చిత్రానికి కన్నడ - మలయాళ భాషల్లో సుపరిచితుడైన ఇమిల్ మొహమ్మద్ సంగీతం సమకూర్చుతుండగా... నాని కెరీర్ కి తిరుగులేని పునాది వేసిన "అలా మొదలైంది" చిత్రానికి ఛాయాగ్రహణం అందించిన ప్రేమ్ కెమెరా బాధ్యతలు నిర్వహించనున్నారు. -
త్వరలో మరో సరికొత్త ఓటీటీ యాప్..
Dude OTT App Logo Launched: కరోనా లాక్‌డౌన్‌తో డిజిటల్ ప్లాట్‌ఫాంలకు ఆదరణ చాలా బాగా పెరిగిపోయింది. మహమ్మారి సమయంలో థియేటర్లు మూతపడటంతో పెద్ద సినిమాల నుంచి చిన్న సినిమాల వరకు ఓటీటీ బాట పట్టాయి. సినిమాల విడుదలకు ఓటీటీలే అడ్రస్‌గా మారాయి. ఇక కరోనా తగ్గుముఖం పట్టి సాధారణ పరిస్థితులు వచ్చి.. థియేటర్లు తెరుచుకున్న కూడా ఓటీటీల హవా కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే కొత్త కొత్త ఓటీటీ యాప్‌లు పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికే పలువురు సినీ సెలబ్రిటీలు సొంతంగా ఓటీటీ యాప్‌ను ప్రారంభించారు. తాజాగా మరో ఓటీటీ యాప్ రానుంది.. ‘డ్యూడ్’ అనే సరికొత్త ఓటీటీ ప్రేక్షకులను అలరించనుంది. మే 1 నుంచి ‘డ్యూడ్’ ఓటీటీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. తాజాగా ‘డ్యూడ్’ లోగో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ‘డ్యూడ్’ ఓటీటీ వ్యవస్థాపకుడు, దర్శక-నిర్మాత ఈశ్వర్ మాట్లాడుతూ.. ‘‘ప్రతిభావంతులకు సరైన మార్గాన్ని ఏర్పరచాలనే ధృడ సంకల్పంతో నేను, ధూళిపూడి ‘డ్యూడ్’కి నాంది పలికాం. ఇందులో సినిమా, వెబ్‌సిరీస్, గేమ్స్, స్పోర్ట్స్, లైవ్ న్యూస్.. ఇలా ఎన్నో ఉంటాయి.’’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మాత రాజీవ్, స్పాన్సర్లు సద్గురు, సమై శేఖర్, హీరోయిన్స్ డోరిస్, హరిత పాల్గొన్నారు. చదవండి: కొత్త బిజినెస్‌ను ప్రకటించిన షారుక్ ఖాన్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1621343214.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
కాలాతీత రచన ఇది!
మై ఫేవరెట్ బుక్ -లిటిల్ ఉమెన్ అమెరికన్ రచయిత్రి మే అల్కాట్ రాసిన ‘లిటిల్ ఉమెన్’ నవల గురించి చాలామంది చెప్పగా విన్నాను. అలా నాకు కూడా ఆ పుస్తకం చదవాలనే ఆసక్తి పెరిగింది. పుస్తకాన్ని చేతుల్లోకి తీసుకోగానే బరువు కొంచెం భయపెట్టింది. ‘ఇంత పెద్ద పుస్తకాన్ని నేను చదవగలనా?’ అనుకున్నాను. వాక్యంలో సత్తా ఉంటే కొండలాంటి పుస్తకమైనా త్వరగా పూర్తవుతుందని చెప్పడానికి ఈ పుస్తకమే నిదర్శనం. ముగ్గురు అక్కచెల్లెళ్ళ జీవితాన్ని గురించి రాసిన నవల ఇది. స్త్రీ జీవితంలోని భిన్నకోణాలను ప్రతిబింబించే పుస్తకం ఇది. రచయిత్రి తన సొంత అనుభవాలకు కాస్త కల్పన జోడించి ఈ నవల రాశారట. ఇది అక్షరాలా టైమ్‌లెస్ క్లాసిక్. ఎలాగోలా... వీలుచేసుకొని ఈ నవల చదవండి. నవలలో ఒక పాత్ర అయిన ఎమిలీ సంభాషణలు చదువుతున్నప్పుడు ఈ కాలం టీనేజర్ మాట్లాడుతున్నట్లే అనిపిస్తుంది. ‘డ్యూడ్’ అనే పదాన్ని ఇప్పటి తరం పిల్లలు కూడా ఉపయోగిస్తున్నారు కదా! ఇది యువ పాఠకులను లక్ష్యంగా పెట్టుకొని రాసిన నవల అయినప్పటికీ అన్ని వయసుల వారూ హాయిగా చదువుకోవచ్చు. ఒక క్లాసిక్ అనేది తరాలకు అతీతంగా ఎప్పుడూ తాజాగా ఎలా ఉంటుందనే విషయం తెలుసుకోవడానికి ఈ నవల చదవడం అవసరం. - దీపికా పదుకొనే, హీరోయిన్