'డ్రాగన్' హీరో.. 'ప్రేమలు' హీరోయిన్ | Pradeep Ranganathan And Mamitha Baiju Dude Movie | Sakshi
Sakshi News home page

Dude Movie: తమిళ హీరో.. మలయాళ హీరోయిన్.. ఓ తెలుగు సినిమా

May 11 2025 4:50 PM | Updated on May 11 2025 5:04 PM

Pradeep Ranganathan And Mamitha Baiju Dude Movie

ఇప్పుడంతా పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. భాషాభేదం లేకుండా పలు భాషల్లోనూ యాక్టర్స్ తెలుగులోనూ హీరోహీరోయిన్లుగా నటిస్తూ గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు ఆ లిస్టులోకి చేరేందుకు ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు రెడీ అయిపోయారు. ఇంతకీ వీళ్ల కొత్త సినిమా సంగతేంటి?

(ఇదీ చదవండి: దర్శకుడి డ్రీమ్ కార్.. గిఫ్ట్ ఇచ్చిన సూర్య-కార్తీ) 

'కోమలి' సినిమాతో దర్శకుడిగా మారిన ప్రదీప్ రంగనాథన్.. 'లవ్ టుడే' మూవీతో అటు దర్శకత్వం చేస్తూనే హీరోగా మారిపోయాడు. రీసెంట్ గా 'డ్రాగన్' మూవీతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఈ క్రమంలోనే ఇతడిని హీరోగా పెట్టి తెలుగు నిర్మాతలైన మైత్రీ మూవీ మేకర్స్ కొత్త సినిమాని ప్రకటించారు. 

'డ్యూడ్' పేరుతో తీస్తున్న ఈ సినిమాని ఈ ఏడాది దీపావళి కానుకాగ థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. 'ప్రేమలు' మూవీతో ఫేమ్ తెచ్చుకున్న మలయాళ హీరోయిన్ మమిత బైజు.. డ్యూడ్ చిత్రంలో ప్రదీప్ కి జోడీగా నటిస్తోంది. ఈ మేరకు వీళ్లిద్దరూ కలిసున్న లుక్ ని రిలీజ్ చేశారు. షర్ట్ లేకుండా ప్రదీప్ ఉండటం చూస్తుంటే ఇది కూడా కామెడీ ఎంటర్ టైనర్ అని తెలుస్తోంది.

(ఇదీ చదవండి: ఆ హీరోయిన్ తో అస్సలు నటించను: టాలీవుడ్ హీరో) 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement